(Source: ECI/ABP News/ABP Majha)
Viral Video: లిక్కర్ బాటిల్స్ ఫ్రీగా పంపిణీ చేసిన బీజేపీ ఎంపీ, ఎగబడ్డ జనం - వీడియో వైరల్
BJP MP K Sudhakar: కర్ణాటక బీజేపీ ఎంపీ తన నియోజకవర్గం ఉచితంగా లిక్కర్ బాటిల్స్ పంపిణీ చేశారు. ఈ బాటిల్స్ కోసం జనం ఎగబడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
Karnataka News: ఎన్నికల్లో గెలిచాక పార్టీ కార్యకర్తలకు,ఫ్యాన్స్‌కి పార్టీలివ్వడం కామనే. కానీ బీజేపీ ఎంపీ మాత్రం ఏకంగా ఓపెన్‌గా అందరికీ లిక్కర్ బాటిల్స్ సప్లై చేశాడు. కార్యకర్తలంతా క్యూ కట్టి మరీ ఆ సీసాలు పట్టుకెళ్లారు. చిక్కబళ్లాపూర్‌లో ఈ ఘటన జరిగింది. ఎంపీ కే సుధాకర్ ఈ పార్టీ అరేంజ్ చేశాడు. అందరికీ ఫ్రీగా ఆల్కహాల్ ఆఫర్ చేశాడు. అలా చెప్పాడో లేదో అంతా వచ్చి వరుసలో నిలబడ్డారు. ఒక్కొక్కరూ బాటిల్ తీసుకుని వెళ్లిపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వ్యవహారం పోలీసుల వరకూ వెళ్లింది. ఇలా ఎలా అనుమతించారని విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ అనుమతి ఇచ్చిందని, పోలీసుల నుంచి అనుమతి తీసుకోలేదని డిపార్ట్‌మెంట్ క్లారిటీ ఇచ్చింది. అంతే కాదు. పోలీసులే దగ్గరుండి ఈ ఏర్పాట్లు చూసుకోవాలని ఆదేశాలిచ్చారని స్పష్టం చేసింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా వివాదాస్పదమవుతోంది.
"ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ దీనికి పర్మిషన్ ఇచ్చింది. పోలీసులే ఇదంతా దగ్గరుండి చూసుకోవాలని ఆదేశించారు. ఇందులో పోలీసుల తప్పేమీ లేదు. అనవసరంగా డిపార్ట్‌మెంట్‌ని నిందించొద్దు. ఇలాంటి వాటికి అనుమతి ఇవ్వాలా వద్దా అన్నది ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ పరిధిలో ఉంటుంది"
- పోలీసులు
#WATCH | Nelamangala, Karnataka: People queue up to receive their bottle of alcohol at the party organised by Chikkaballapur BJP MP K Sudhakar in celebration of his Lok Sabha win from the constituency
— ANI (@ANI) July 8, 2024
Bengaluru Rural SP CK Baba says, "The excise department gave permission and… pic.twitter.com/Wu0W9uSNl0