Ajit Pawar: 'వాష్‌రూమ్‌కు వెళ్తే వార్తలు రాసేశారు! పార్టీపై నాకేం కోపం లేదు'
Ajit Pawar: ఎన్‌సీపీ సీనియర్ నేత అజిత్ పవార్.. పార్టీపై అలిగారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై ఆయన స్పందించారు.
Ajit Pawar: శరద్ పవార్ బంధువు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) నేత అజిత్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం జరిగిన పార్టీ సమావేశం నుంచి మధ్యలోనే నిష్క్రమించడం, పార్టీ జాతీయ సదస్సులో ప్రసంగించకపోవడంపై మీడియాతో మాట్లాడారు.
వాష్‌రూమ్
పార్టీ జాతీయ సదస్సులో శరద్ పవార్ తర్వాత వేదికపై మాట్లాడాలనుకున్నారు అజిత్ పవార్. అయితే ఆయన స్థానంలో జయంత్ పాటిల్‌కు మాట్లాడే అవకాశం ఇచ్చారు. దీంతో ఆయన ఆగ్రహంతో వెళ్లిపోయారని మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలను అజిత్ పవార్ తోసిపుచ్చారు.
ఆదివారం దిల్లీలో జరిగిన పార్టీ ఎనిమిదో జాతీయ మహాసభల్లో సీనియర్ నేతలు పీసీ చాకో, ఛగన్ భుజబల్, సుప్రియా సూలే, జయంత్ పాటిల్, అమోల్ కోల్హే, ఫౌజియా ఖాన్ ప్రసంగించారు. ఈ సమావేశంలో శరద్ పవార్ పార్టీ అధినేతగా ఏకగ్రీవంగా మరోసారి ఎన్నికయ్యారు. నాలుగు సంవత్సరాలు ఆ పదవిలో కొనసాగుతారు.
జోడో యాత్రపై
మరోవైపు కాంగ్రెస్ భారత్ జోడో యాత్రకు ప్రతిపక్ష పార్టీల మద్దతుపై కూడా అజిత్ పవార్ స్పందించారు. ఈ యాత్రను కాంగ్రెస్ సొంతంగా ప్రారంభించిందన్నారు. ఇది UPA చేస్తోన్న భారత్ జోడో యాత్ర కాదని పవార్ అన్నారు. దీని గురించి కాంగ్రెస్ ఎప్పుడూ తమతో మాట్లాడలేదని, అయితే ఇది ఒక పెద్ద యాత్ర అని పేర్కొన్నారు.
మొత్తం 3,570 కిలోమీటర్ల మేర ఈ జోడో యాత్ర సాగనుంది. 118 మంది శాశ్వత సభ్యులు ఇందులో పాల్గొంటారు. కాంగ్రెస్ సీనియర్ నేతలంతా.. పార్టీకి ఇది టర్నింగ్ పాయింట్ అవుతుందని చెబుతున్నారు. ఇటీవలే వరుసగా పలువురు సీనియర్ నేతలు రాజీనామా చేయటం ఆ పార్టీని గందరగోళంలో పడేసింది. ఇలాంటి సంక్లిష్ట సమయంలో కాంగ్రెస్ ఈ పాదయాత్ర చేపట్టింది. వచ్చే ఏడాది పలు రాష్ట్రాల ఎన్నికలతో పాటు 2024 ఎలక్షన్స్‌ని టార్గెట్‌గా పెట్టుకుంది.
Also Read: Congress: నిక్కర్‌కు నిప్పంటించిన కాంగ్రెస్- చెలరేగిన రాజకీయ దుమారం!