Congress: నిక్కర్‌కు నిప్పంటించిన కాంగ్రెస్- చెలరేగిన రాజకీయ దుమారం!
Congress: ఆర్‌ఎస్‌ఎస్ ధరించే ఖాకీ నిక్కర్ కాలిపోతున్న ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేసింది కాంగ్రెస్.
Congress: కాంగ్రెస్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన ఓ ఫోటోపై రాజకీయ దుమారం రేగింది. భారత్ జోడో యాత్ర ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ తన ట్విట్టర్‌లో.. ఆర్‌ఎస్‌ఎస్ ధరించే ఖాకీ నిక్కర్ కాలిపోతున్న ఫోటోను షేర్ చేసింది. దీనికి భారత్ జోడో యాత్ర ట్యాగ్‌ను జత చేసింది.
To free the country from shackles of hate and undo the damage done by BJP-RSS.
— Congress (@INCIndia) September 12, 2022
Step by step, we will reach our goal.#BharatJodoYatra 🇮🇳 pic.twitter.com/MuoDZuCHJ2
భాజపా ఫైర్
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ఫోటోపై భాజపా ఫైర్ అయింది. ఈ ఫోటోను వెంటనే తొలగించాలని డిమాండ్ చేసింది. రాహుల్ గాంధీ.. దేశంలో హింసను కోరుకుంటున్నారా? అని భాజపా అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. రాహుల్ చేపట్టింది భారత్ జోడో యాత్ర కాదు భారత్ తోడో, ఆగ్ లగావో యాత్ర అని సెటైర్లు వేశారు.
జోడో యాత్ర
మొత్తం 3,570 కిలోమీటర్ల మేర ఈ జోడో యాత్ర సాగనుంది. 118 మంది శాశ్వత సభ్యులు ఇందులో పాల్గొంటారు. కాంగ్రెస్ సీనియర్ నేతలంతా.. పార్టీకి ఇది టర్నింగ్ పాయింట్ అవుతుందని చెబుతున్నారు. ఇటీవలే వరుసగా పలువురు సీనియర్ నేతలు రాజీనామా చేయటం ఆ పార్టీని గందరగోళంలో పడేసింది. ఇలాంటి సంక్లిష్ట సమయంలో కాంగ్రెస్ ఈ పాదయాత్ర చేపట్టింది. వచ్చే ఏడాది పలు రాష్ట్రాల ఎన్నికలతో పాటు 2024 ఎలక్షన్స్‌ని టార్గెట్‌గా పెట్టుకుంది.
కన్యాకుమారిలో ప్రారంభమైన భారత్ జోడో యాత్ర 150 రోజుల పాటు 3,570 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. జమ్ముకశ్మీర్‌లో ముగుస్తుంది. ఈ యాత్రలో పాల్గొనే వారెవరూ..హోటళ్లలో బస చేయరు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంటెయినర్లలోనే బస చేస్తారు. దేశవ్యాప్తంగా ఇలాంటి కంటెయినర్లను 60 వరకూ అరేంజ్ చేశారు. వీటిలోనే నిద్రించేందుకు బెడ్స్ ఉంటాయి. టాయిలెట్స్, ఏసీలనూ ఏర్పాటు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా, రాహుల్ గాంధీ ఓ కంటెయినర్‌లో ఉంటారు. మిగతా యాత్రికులంతా ఇతర కంటెయినర్లలో బస చేయనున్నారు.
Also Read: Sonali Phogat Murder Case: CBI చేతికి సోనాలీ ఫోగాట్ హత్య కేసు- గోవా సీఎం కీలక నిర్ణయం