అన్వేషించండి

NCP Future: అజిత్ పవార్ హఠాన్మరణంతో ఎన్సీపీ పరిస్థితి గందరగోళం - పవార్ పరివారం విలీనం ఖాయమేనా?

NCP Future: ఎన్సీపీని చీల్చి తనదే అసలైన ఎన్సీపీ అని అజిత్ పవార్ నిరూపించుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన హఠాత్తుగా చనిపోవడంతో ఆ పార్టీ పరిస్థితిపై చర్చలు జరుగతున్నాయి.

Nationalist Congress Party future:  మహారాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన అజిత్ పవార్ అకాల మరణం తర్వాత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) భవిష్యత్తు ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. అజిత్ పవార్ మరణం కేవలం ఒక వ్యక్తిగత నష్టం మాత్రమే కాదు, ఆయన నేతృత్వంలోని   ఎన్సీపీ ఉనికికే సవాలుగా మారింది.  
 
నాయకత్వ శూన్యత , అజిత్ పవార్ వారసులు 

అజిత్ పవార్ తన బలమైన పరిపాలనా దక్షతతో దాదాగా పార్టీపై పట్టు సాధించారు. ఆయన మరణం తర్వాత ఆయన కుమారులు పార్థ్ పవార్, జయ్ పవార్  ఆ స్థానాన్ని భర్తీ చేయగలరా అనేది ఇప్పుడు ప్రధాన చర్చ. పార్థ్ పవార్ గతంలో లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి పాలైనందున, ఆయనకు అజిత్ పవార్ స్థాయిలో మాస్ ఇమేజ్,  పార్టీని నడిపించే వ్యూహ చతురత ఉందా అనే సందేహాలు రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతున్నాయి. అజిత్ పవార్ భార్య, రాజ్యసభ ఎంపీ సునేత్రా పవార్ ప్రస్తుతం కుటుంబానికి అండగా ఉన్నప్పటికీ, రాజకీయాల్లో ఆమె పాత్ర ఎంతవరకు ఉంటుందనేది వేచి చూడాలి.

విలీనం దిశగా అడుగులు? 

అజిత్ పవార్ మరణానికి కొద్దిరోజుల ముందే, స్థానిక సంస్థల ఎన్నికల కోసం శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (శరద్ పవార్) , అజిత్ పవార్ ఎన్సీపీ చేతులు కలిపినట్లు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా పుణె, పింప్రి-చించ్వాడ్ మున్సిపల్ ఎన్నికల కోసం ఇరు వర్గాలు పవార్ పరివార్ ఒక్కటేనని చాటాయి. ఇప్పుడు అజిత్ పవార్ లేకపోవడంతో, ఆయన వర్గంలోని ఎమ్మెల్యేలు, కీలక నాయకులు మళ్ళీ  శరద్ పవార్‌ ఛత్రం కిందకు వెళ్లడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. సుమారు 40 మంది ఎమ్మెల్యేలు అజిత్ పవార్‌తో వెళ్ళింది ఆయన వ్యక్తిగత ఇమేజ్ చూసే తప్ప బీజేపీతో పొత్తు కోసం కాదు. కాబట్టి, ఇప్పుడు ఆ నాయకులందరూ మళ్ళీ మాతృ సంస్థలో విలీనం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని భావిస్తున్నారు. 

సుప్రియా సూలే నాయకత్వం  

శరద్ పవార్ వారసురాలిగా  సుప్రియా సూలే ఇప్పటికే జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు పొందారు. అజిత్ పవార్ మరణంతో పార్టీ బాధ్యతలు పూర్తిగా ఆమె భుజస్కంధాలపై పడే అవకాశం ఉంది. అజిత్ పవార్ తరహాలో రాష్ట్ర రాజకీయాల్లో దూకుడుగా వెళ్లడం, పార్టీ క్యాడర్‌ను కలుపుకుని పోవడం ఆమె ముందున్న ప్రధాన సవాళ్లు. అయితే, అజిత్ పవార్ మరణం పట్ల ఆమె స్పందించిన తీరు, కుటుంబం పట్ల ఆమెకున్న అనుబంధం ఇరు వర్గాల కార్యకర్తల్లో సెంటిమెంట్‌ను పెంచింది. ఇది పార్టీని ఏకం చేయడానికి ఆమెకు సానుకూల అంశంగా మారవచ్చు.

తర్వాతి తరం నాయకుల పరిస్థితి 

ఎన్సీపీలో తర్వాతి తరం నాయకుల్లో  రోహిత్ పవార్ అత్యంత చురుకుగా ఉన్నారు. అజిత్ పవార్ ఉన్న సమయంలోనే రోహిత్ పవార్ పార్టీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అజిత్ పవార్ కుమారులు రాజకీయంగా ఇంకా నిలదొక్కుకోనందున, రోహిత్ పవార్ , సుప్రియా సూలే ద్వయం పార్టీని ముందుకు నడిపించే అవకాశం ఉంది. శరద్ పవార్ ఈ క్లిష్ట సమయంలో పార్టీని మళ్ళీ ఏకం చేసి, తన వారసులకు పగ్గాలు అప్పగించే దిశగా పావులు కదుపుతున్నారు.

 పార్టీ ఏకమౌతుందా? 

అజిత్ పవార్ మరణంతో ఆయన వర్గానికి బలమైన నాయకుడు కరువయ్యారు. బీజేపీతో పొత్తులో కొనసాగడం కంటే, పవార్ అనే బ్రాండ్ ఇమేజ్‌ను కాపాడుకోవడమే ఆ వర్గం ఎమ్మెల్యేలకు ముఖ్యం. అందువల్ల, రాబోయే కొన్ని నెలల్లోనే రెండు పార్టీలు విలీనమై, మళ్ళీ ఒకే ఎన్సీపీగా అవతరించే అవకాశాలు 90 శాతం వరకు ఉన్నాయి.  

టాప్ హెడ్ లైన్స్

Breaking News: నేడు తాడేపల్లిలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ కీలక భేటీ
నేడు తాడేపల్లిలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ కీలక భేటీ
Kerala Influencer Akhil Megha: కేరళం సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ జంటకు దిష్టి తగిలేసిందా? బస్సు క్లీనర్‌తో భార్య పరార్‌! బోరుమంటున్న భర్త!
కేరళం సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ జంటకు దిష్టి తగిలేసిందా? బస్సు క్లీనర్‌తో భార్య పరార్‌! బోరుమంటున్న భర్త!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
అత్యంత లగ్జరీగా Trump Towers.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో మరో మైలురాయి, ధర వింటే షాక్
కోకాపేటలో లగ్జరీగా Trump Towers.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో మరో మైలురాయి, ధర వింటే షాక్

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Chemical Signaling: మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
Microsoft Alert: హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Embed widget