అయోధ్య ఉత్సవ సమయంలో ముస్లింలు బయటకు రాకండి - అసోం నేత సంచలన వ్యాఖ్యలు
Ram Mandir inauguration: అయోధ్య ఉత్సవ సమయంలో ముస్లింలెవరూ బయటకు రావద్దని అసోం నేత అజ్మల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Ram Mandir Opening:
రైళ్లలో ప్రయాణించకండి: అజ్మల్
ఈ నెల 22న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున అయోధ్యకు చేరుకోనున్నారు. ఈ క్రమంలోనే All India United Democratic Front (AIUDF) చీఫ్ బదరుద్దీన్ అజ్మల్ (Badaruddin Ajmal) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నెల రోజుల పాటు ముస్లింలు ఎవరూ రైళ్లలో ప్రయాణించొద్దని పిలుపునిచ్చారు. ముస్లింలపై దాడులు జరిగే ప్రమాదముందని హెచ్చరించారు. అలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే రైలు ప్రయాణాన్ని మానుకోవడమే మంచిదని చెప్పారు. ఈ కార్యక్రమానికి కనీసం 60 వేల మంది తరలి వస్తారని అంచనా. ప్రధాని మోదీ చేతుల మీదుగా బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే అజ్మల్ ఈ వ్యాఖ్యలు చేశారు. అసోంలో జరిగిన ప్రచార కార్యక్రమంలో ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. జనవరి 20-25 వరకూ ముస్లింలు అంతా బయటకు రాకుండా ఇళ్లలోనే ఉండాలని సూచించారు.
"వాళ్లు (బీజేపీని ఉద్దేశిస్తూ) స్పెషల్ ట్రైన్స్ బుక్ చేసుకున్నారు. బస్సులూ బుక్ అయ్యాయి. రామ మందిర ఉత్సవానికి పెద్ద ఎత్తున భక్తుల్ని తరలిస్తున్నారు. జనవరి 20-25 వరకూ ముస్లింలు రైళ్లు, బస్‌లలో ప్రయాణించకపోవడమే మంచిది"
- బదరుద్దీన్ అజ్మల్, AIUDF చీఫ్
Barpeta, Assam | AIUDF chief and MP Badruddin Ajmal says "We will have to be cautious. Muslims should not travel by train from January 20 to January 25. The Ram idol will be placed in Ram Janmabhoomi, the entire world will witness this. Lakhs of people will come. BJP's plan is… pic.twitter.com/AsYwDpMyQH
— ANI (@ANI) January 6, 2024
బీజేపీపై ఫైర్..
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అసోంలోని 14 సీట్లలో మూడు చోట్ల పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది AIUDF.ఇప్పటికే ప్రచారమూ మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నారు అజ్మల్. ఇస్లాం మతాచారాలను బీజేపీ ఎప్పుడూ పట్టించుకోదని, ఆ పార్టీ ముస్లింల వ్యతిరేకి అని మండి పడ్డారు. ట్రిపుల్ తలాక్‌ని అందుకే తొలగించారని అసహనం వ్యక్తం చేశారు.
"మన ఆచారాలన్నా, సంప్రదాయాన్నా వాళ్లకు చిన్న చూపు. ముస్లింల మహిళల గౌరవాన్ని పట్టించుకోవడం లేదు. ఖురాన్ ఆధారంగానే మనకు చట్టాలు ఏర్పడ్డాయి. కానీ బీజేపీ ఇందులోనూ జోక్యం చేసుకుంటోంది"
- బదరుద్దీన్ అజ్మల్, AIUDF చీఫ్
భిన్న రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానం అందింది. కాంగ్రెస్ సహా మరి కొన్ని పార్టీల్లోని కీలక నేతలకూ ఆహ్వానం పంపింది ప్రభుత్వం. ఆ రోజు భక్తులందరూ రావడానికి అవకాశం ఉండదని అందుకే రాముడిపై భక్తి చాటుకునేందుకు ఇంట్లోనే Shri Ram Jyoti వెలిగించాలని పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. ఈ ఉత్సవం పూర్తయ్యాక అందరూ వచ్చి అయోధ్య రాముడిని దర్శించుకోవాలని సూచించారు.
Also Read: బీచ్ టూరిజంలో భారత్ మాతో పోటీ పడలేదు, మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవ్స్ అక్కసు