![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Airplane Fire Incidents: ఈ విమానాలకు ఏమైంది, ఓ వైపు మంటలు మరో వైపు పొగలు
Airplane Fire Incidents: ఈ మధ్య కాలంలో తరచూ విమానాలు ప్రమాదాలకు గురవుతున్నాయి.
![Airplane Fire Incidents: ఈ విమానాలకు ఏమైంది, ఓ వైపు మంటలు మరో వైపు పొగలు Airplane fire incidents Sometimes smoke in cabin sometimes there fire, Cases of disturbances during increasing air travel Airplane Fire Incidents: ఈ విమానాలకు ఏమైంది, ఓ వైపు మంటలు మరో వైపు పొగలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/29/09fc8e49ec0fd8c3a72e8f6d0e828dcc1667025623961517_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Airplane Fire Incidents:
తరచూ ప్రమాదాలు
విమాన ప్రయాణం చేయాలంటేనే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి వస్తోంది. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ సంగతేమో కానీ..డొమెస్టిక్ ఫ్లైట్స్ అయితే తరచూ ఏదో ఓ ప్రమాదానికి గురిఅవుతున్నాయి. ప్రాణనష్టం జరగకపోయినా...వాటి సర్వీస్‌లు మాత్రం ప్రయాణికుల్ని తెగ ఇబ్బంది పెడుతున్నాయి. ఉన్నట్టుండి పొగలు రావటం, క్యాబిన్‌లో మంటలు చెలరేగడం లాంటి ఘటనలు చిరాకు తెప్పిస్తున్నాయి. ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్తున్న Indigo flight (6E-2131) ఇంజిన్‌లో మంటలు వచ్చాయి. ఒక్కసారిగా ప్రయాణికులు భయాందోళనకుగురయ్యారు. ఫలితంగా...ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లోనే విమానాన్ని నిలిపివేశారు. ఇదే రూట్‌లో ముందు రోజు Air India ఫ్లైట్‌లో ఏదో సాంకేతిక సమస్య తలెత్తడం వల్ల సర్వీస్‌ని రద్దు చేయాల్సి వచ్చింది. ఇలాంటివి తరచుగా జరిగితే అవి ఎలాంటి పెను ముప్పునకు దారి తీస్తాయనేదే ఇప్పుడు అందరినీ కలవర పెడుతున్న ప్రశ్న. SpiceJet, Vistara, Indigo, GoAir..ఇలా అన్ని ఫ్లైట్స్‌లోనూ ఏదో సమస్య తలెత్తుతూనే ఉంది. ఇలాంటప్పుడు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్నారే తప్ప సమస్య ఎక్కడుందన్నది ఆరా తీయడం లేదు. దీనిపై సమగ్ర విచారణ జరపాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి వరుస ఘటనలు.
స్పైస్‌జెట్‌లోనే అధికం..
అన్నింటికన్నా ముఖ్యంగా స్పైస్‌జెట్ అత్యంత ప్రమాదకరంగా మారింది. ఎక్కువ సార్లు ప్రమాదాలు జరిగింది ఈ ఫ్లైట్‌లలోనే. ఈ కంపెనీకి చెందిన 8 విమానాల్లో ఇప్పటికే లోపాలను గుర్తించారు. DGCA ఈ విషయమై ఆ కంపెనికి వార్నింగ్ ఇచ్చింది. 50% సర్వీస్‌లతోనే నడపాలని ఆంక్షలు విధించింది. ఈ మధ్యే వాటిని ఎత్తివేసింది. ఓ విమానంలో సాంకేతిక సమస్య వస్తే..అందులో ఉన్న ప్రయాణికులంతా ఒక్కసారిగా ప్యానిక్ అవుతారు. సమస్య తీవ్రత ఎక్కువైతే వాళ్ల భయం కూడా పెరుగుతుంది. ఆక్సిజన్ సరిపడా లేకపోవటం, ఇంజిన్‌లో మంటలు, పక్షిఢీ కొట్టటం లాంటి ప్రమాదాలు పెద్ద ఎత్తున ప్రాణనష్టాన్ని కలిగించే అవకాశముంది. స్పైస్ జెట్ విమానంలో ఇదే జరిగింది. ప్లేన్ డోర్ వద్ద ఆక్సిజన్ లీకేజ్‌ను పైలట్ గుర్తించి వెంటనే అప్రమత్తమయ్యాడు. రన్‌వేపై వేగం పుంజుకోకముందే వెంటనే ఆపేశాడు. లేకపోయుంటే...ఎంత పెద్ద ప్రమాదం జరిగేదో ఊహించుకోవచ్చు. గతేడాది 4 విమాన ప్రమాదాలు జరిగాయి. 2020లో రెండు ప్రమాదాలు సంభవించాయి. లెక్కల పరంగా చూస్తే ఇది తక్కువగానే అనిపిస్తున్నా..పదేపదే టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావటం వల్ల ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి.
పక్షులతోనూ ముప్పు..
పక్షులు ఢీకొట్టడం వల్ల విమానాలు ప్రమాదాలకు గురవుతుంటాయి. ఒక్కోసారి ఇంజిన్‌లో ఇరుక్కుపోవడం వల్లా ప్రమాదాలు సంభవిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా కమర్షియల్ ఫ్లైట్‌లు కేవలం పక్షులు ఢీకొట్టడం వల్ల ఏటా వేల కోట్ల రూపాయల మేర ఆర్థిక నష్టాన్ని చవిచూస్తున్నాయి.
ఏటా 1.2 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతోంది. అంటే...మన ఇండియన్ కరెన్సీలో రూ.7 వేల కోట్లు. టేకాఫ్ లేదా ల్యాండింగ్ అయ్యే సమయంలో పక్షులు విమానాలను ఢీకొడుతుంటాయి. ఈ సమయంలోనే అవి కొలైడ్ అవడానికి ఎక్కువ అవకాశాలుంటాయి.
Also Read: Shocking: పావురాలను జాంబీలుగా మార్చేస్తున్న మిస్టిరియస్ వ్యాధి, మనుషులకు సోకుతుందా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)