Aircraft Crash: పంట పొలాల్లో కుప్ప కూలిన ఎయిర్ క్రాఫ్ట్, పైలట్‌లకు గాయాలు
Aircraft Crash: కర్ణాటకలో IAFకి చెందిన ఎయిర్ క్రాఫ్ట్ పంట పొలాల్లో కుప్ప కూలింది.
Aircraft Crash:
కర్ణాటకలో ఘటన..
కర్ణాటకలోని చామ్‌రాజ్‌నగర్‌లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి చెందిన ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్ కుప్ప కూలింది. కూలగానే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో అందులో ఇద్దరు పైలట్‌లు ఉన్నారు. ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయని, సురక్షితంగా ఉన్నారని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారికంగా ప్రకటించింది. బెంగళూరుకు 136 కిలోమీటర్ల దూరంలో ఉన్న చామ్‌రాజ్‌నగర్‌లో రొటీన్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఉన్నట్టుండి పంట పొలాల్లో కూలిపోయింది. ఈ క్రాష్‌కి కారణమేంటన్నది మాత్రం ఇంకా తేలలేదు. ప్రస్తుతం దీనిపై విచారణ చేపట్టనున్నట్టు అధికారులు వెల్లడించారు.
"కిరణ్ ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్ మకాలి గ్రామంలోని చామ్‌రాజ్‌నగర్ వద్ద పంటపొలాల్లో కుప్ప కూలింది. ప్రమాద సమయంలో ఇద్దరు పైలట్‌లు ఉన్నారు. వీరిలో ఓ మహిళా పైలట్ కూడా ఉన్నారు. ఇద్దరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదానికి కారణమేంటో విచారణ జరపుతాం"
- ఇండియన్ ఎయిర్ ఫోర్స్
A Kiran trainer aircraft of the IAF crashed near Chamrajnagar, Karnataka today, while on a routine training sortie. Both aircrew ejected safely. A Court of Inquiry has been ordered to ascertain the cause of the accident.
— Indian Air Force (@IAF_MCC) June 1, 2023
VIDEO | Visuals from the site in Karnataka's Chamarajanagar where an IAF trainer aircraft crashed earlier today. pic.twitter.com/ozXQGGQQ0D
— Press Trust of India (@PTI_News) June 1, 2023
ఆర్మీ హెలికాప్టర్లు, చాపర్లు కూలిపోతున్న ఘటనలు ఈ మధ్య కాలంలో పెరిగిపోయాయి. గతంలో జమ్ముకశ్మీర్‌లో ఓ చాపర్ కూలిపోయి ఓ పైలట్ మృతి చెందాడు. ఇటీవల మరోసారి ఇలాంటి దుర్ఘటనే జరిగింది. రాజస్థాన్‌లోని హనుమాన్మార్గ్లో ఆర్మీ హెలికాప్టర్ కుప్ప కూలింది. సూరత్గర్ నుంచి టేకాఫ్ అయిన చాపర్...కాసేపటికే కూలిపోయింది. పారాచూట్ సాయంతో పైలట్ సహా కో పైలట్ కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. అయితే...ఆ చాపర్ ఓ ఇంటిపై కూలడం వల్ల ఆ ఇంట్లోని ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఏడాది జనవరిలోనూ సుఖోయ్, మిరేగ్ విమానాలు కుప్ప కూలిన ఘటనల్లో ఓ పైలట్ ప్రాణాలు కోల్పోయాడు. రాజస్థాన్‌లోనే భరత్‌పూర్‌లో జరిగిందీ ఘటన. మధ్యప్రదేశ్‌లోనూ మొరెనా ప్రాంతంలో ఓ ఆర్మీ హెలికాప్టర్ కూలింది. ఏప్రిల్‌లో కొచ్చిలో కోస్ట్ గార్డ్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఇలా తరచూ ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి.
#WATCH | Indian Air Force MiG-21 fighter aircraft crashed near Hanumangarh in Rajasthan. The aircraft had taken off from Suratgarh. The pilot is safe. More details awaited: IAF Sources pic.twitter.com/0WOwoU5ASi
— ANI (@ANI) May 8, 2023
Also Read: ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వాడొద్దు అన్నందుకు భర్తను వదిలేసి వెళ్లిన భార్య - ఇదేం గొడవరా బాబు