By: Ram Manohar | Updated at : 05 Jan 2023 03:25 PM (IST)
ఫ్లైట్‌లో మహిళపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Air India:
బాధితురాలి కంప్లెయింట్..
ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో ఓ మహిళపై యూరినేట్ చేసిన వ్యక్తిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఎయిర్ ఇండియా సంస్థ ఆ వ్యక్తిపై 30 రోజుల పాటు విమాన ప్రయాణం చేయకుండా ఆంక్షలు విధించింది. గతేడాది నవంబర్ 26న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు నేరుగా టాటా గ్రూప్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్‌కి ఫిర్యాదు చేశారు. కర్ణాటకకు చెందిన ఈ బాధితురాలి ఫిర్యాదుని పరిశీలించిన పోలీసులు నిందితుడిపై FIR నమోదు చేశారు. డిసెంబర్ 28న ఎయిర్ ఇండియా సంస్థ తమకు ఈ విషయం చెప్పిందని, ఆ తరవాత బాధితురాలని సంప్రదించి మరిన్ని వివరాలు సేకరించామని పోలీసులు తెలిపారు. ప్రాథమిక విచారణలో నిందితుడి పేరు శేఖర్ మిశ్రా అని తేలింది. ముంబయికి చెందిన ఈ బిజినెస్‌మేన్ ఎక్కడ ఉంటాడోనని పోలీసులు ఆరా తీస్తున్నారు. "బాధితురాలి ఫిర్యాదు మేరకు పబ్లిక్ ప్లేస్‌లో అనుచితంగా ప్రవర్తించినందుకు ఐపీసీ సెక్షన్ 510, మహిళా గౌరవాన్ని భంగ పరిచినందుకు సెక్షన్ 509, అవమాన పరిచినందుకు సెక్షన్ 354 కింద కేసు నమోదు చేశారు. అయితే...ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో ఉన్న సిబ్బందినీ విచారిస్తున్నారు. వాళ్లు చెప్పిన వివరాల ప్రకారం 50 ఏళ్ల శేఖర్ మిశ్రా...బిజినెస్‌క్లాస్‌లో ప్రయాణిస్తున్నాడు. మద్యం మత్తులో ఉన్నాడు. టాయ్‌లెట్ కోసం అని లేచి ముందుకు వెళ్లాడు. అయితే...వాష్‌రూమ్ వరకూ వెళ్లాననుకుని ఆ మత్తులోనే ఓ మహిళపై యూరినేట్ చేశాడు. ఇది జరిగిన వెంటనే సిబ్బందికి ఫిర్యాదు చేశానని, కానీ వాళ్లు స్పందించలేదని ఆరోపిస్తున్నారు బాధితురాలు.
మూడేళ్ల జైలు శిక్ష..?
"లంచ్ టైమ్ తరవాత ఫ్లైట్‌లో లైట్స్ ఆఫ్ చేశారు. అప్పుడే ఓ ప్యాసింజర్ నా సీట్ దగ్గరకు వచ్చాడు. నాపై యూరినేట్ చేయడం మొదలు పెట్టాడు" అని టాటా గ్రూప్ ఛైర్మన్‌కు రాసిన లేఖలో తెలిపారు బాధితురాలు. ప్రస్తుతం నిందితుడిపై నమోదు చేసిన కేసుల పరంగా చూస్తే...దోషిగా తేలితే కనీసం మూడేళ్ల జైలు శిక్ష పడుతుందని పోలీసులు స్పష్టం చేశారు. ఎయిర్ ఇండియా అధికారులు చెప్పిన వివరాల ప్రకారం..ఈ కేసు విచారణకు అంతర్గత కమిటీని ప్రత్యేకంగా నియమించారు. ఈ మధ్య కాలంలో విమానాల్లో ఇలాంటి ఘటనలు పెరిగి పోతున్నాయి. ప్రయాణికులు గొడవపడటం, సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించడం లాంటివి తరచూ వెలుగులోకి వస్తున్నాయి. బ్యాంకాక్ నుంచి ఇండియాకు వచ్చే స్మైల్ ఎయిర్‌వేస్ ఫ్లైట్‌లో ఇద్దరు ఇండియన్స్ ఘర్షణకు దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు గొడవకు కారణమేంటని ఆరాతీస్తే...ఓ సీట్ విషయంలోనే వాళ్లు అంతగా ఘర్షణ పడ్డారని తేలింది.
#AirRage
— Saurabh Sinha (@27saurabhsinha) December 28, 2022
Video of a fight between pax that broke out on @ThaiSmileAirway flight
Reportedly on a Bangkok-India flight of Dec 27 pic.twitter.com/qyGJdaWXxC
Also Read: Flipkart Fined: ఫ్లిఫ్‌కార్ట్‌కు భారీ జరిమానా, ఫోన్ డెలివెరీ చేయనందుకు మూడు రెట్ల శిక్ష
KNRUHS: యూజీ ఆయూష్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడి! ఫిబ్రవరి 5, 6 తేదీల్లో వెబ్ఆప్షన్లు!
Gold-Silver Price 05 February 2023: కుప్పకూలిన బంగారం, వెండి రేట్లు - కొనాలనుకునే వాళ్లకు మంచి అవకాశం
AOC Recruitment 2023: పదోతరగతి అర్హతతో 'ఇండియన్ ఆర్మీ'లో ఉద్యోగాలు, 1793 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!
Telangana Jobs: కొత్త వైద్య కళాశాలలకు 313 పోస్టుల మంజూరు, ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ!
Peddagattu Jatara 2023 Effect: హైదరాబాద్ - విజయవాడ హైవేపై ఈ నెల 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు ఇలా
Buggana Rajendranath: మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.1.34 లక్షల కోట్లు: మంత్రి బుగ్గన
Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!
NTR Death : తెరమీదకు ఎన్టీఆర్ మరణం, టీడీపీకి చెక్ పెట్టేందుకా? డైవర్ట్ పాలిటిక్సా?
TS High Court : న్యాయమూర్తికే నోటీసులిచ్చిన న్యాయవాది, జైలుకు పంపిస్తామని హైకోర్టు సీరియస్