అన్వేషించండి

Taliban Banned Barbers: అఫ్గాన్‌లో ఇక అందరూ దేవదాసులే..! ఏమి సేతురా తాలిబన్లలారా!

ఇక గడ్డం తీసుకోకూడదట..! ఇదేంటి అనుకుంటున్నారా? అవును.. తాలిబన్లు తాజాగా ఇవే ఆదేశాలిచ్చారు. ఈ ఆదేశాలు ఉల్లంఘిస్తే శిక్షలు తప్పవని హెచ్చరించారు.

అఫ్గానిస్థాన్‌ను ఆక్రమించిన తర్వాత అక్కడి పౌరులకు తాలిబన్లు రోజుకో షాక్ ఇస్తున్నారు. తాజాగా హెయిర్ కటింగ్ షాపుల్లో గడ్డం తీయడం, ట్రిమ్మింగ్ చేయడాన్ని బ్యాన్ చేస్తున్నట్లు తాలిబన్లు ప్రకటించారు. ఇది కూడా ఇస్లామిక్, షరియా చట్టాలకు లోబడే తీసుకున్న నిర్ణయమన్నారు.

ఇదేంట్రా బాబు..

దక్షిణ అఫ్గానిస్థాన్‌లోని హెల్మండ్ రాష్ట్ర రాజధాని లష్కర్ గాహ్‌లో ఈ మేరకు ప్రకటించారు తాలిబన్లు. దీనిపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

" గడ్డం తీసుకోవడంపై బ్యాన్ విధించిన వార్త వినగానే నా గుండె ఆగిపోయినట్లైంది. ఈ నగరంలో అందరూ ఓ రకమైన జీవన విధానానికి అలవాటుపడ్డారు. కనుక వారి ఇష్ట ప్రకారం ఉండే అవకాశం ఇవ్వాలి.                                 "
-    బిలాల్ అహ్మద్, స్థానికుడు

ఈ ఆదేశాలను అతిక్రమించిన వాళ్లు శిక్షార్హులని తాలిబన్లు ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే ఈ ఆదేశాలను ఉల్లంఘించిన బార్బర్లకు ఎలాంటి శిక్షలు విధిస్తారనే దానిపై మాత్రం స్పష్టత లేదు.

మళ్లీ అదే పాలన..

ఇంతకుముందు తాలిబన్ల పాలనలో పురుషులు గడ్డం పెంచుకోవాలని ఆదేశాలిచ్చారు. అయితే తాలిబన్ల ప్రభుత్లం కూలిన తర్వాత షేవింగ్, ట్రిమ్మింగ్ దేశంలో ఎక్కువగా పాపులర్ అయ్యాయి. ఇప్పుడు మళ్లీ తిరిగి తాలిబన్లు అవే నిబంధనలు తీసుకురావడంపై అఫ్గాన్ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

" తాలిబన్ సోదరులారా.. ప్రజలను ఎలా కావాలంటే అలా బతికే స్వేచ్ఛనివ్వండి. వాళ్లు జుత్తు, గడ్డం తీసుకోవాలంటే తీసుకోనివ్వండి. మా దగ్గరకి కొంత మంది కస్టమర్లు వస్తున్నారు. కానీ వాళ్లు మీకు భయపడుతున్నారు. మా వ్యాపారం మమ్మల్ని చేసుకోనివ్వండి.                                       "
-    జలాలుద్దీన్, క్షురకుడు

అంతకుముందు అఫ్గాన్‌ను పరిపాలించిన తాలిబన్లు ఇస్లామ్ చట్టాలను బలవంతంగా ప్రజలతో పాటించేలా చేశారు. ప్రస్తుతం మళ్లీ అదే తరహాలో విచిత్రమైన ఆదేశాలను జారీ చేస్తున్నారు తాలిబన్లు.

శనివారం.. నలుగురు కిడ్నాపర్లను చంపి వాళ్ల మృతదేహాలను హేరత్ నగర నడిబొడ్డున వేలాడదీశారు తాలిబన్లు. ఇది చూసిన ప్రజలు మరోసారి అఫ్గాన్.. అదే తాలిబన్ల అరాచక పాలనలోకి జారుకుంటోందని భయపడుతున్నారు.

Also Read: India Covid Cases: దేశంలో తగ్గిన కోవిడ్ కేసులు.. కొత్తగా 18,795 నమోదు.. 201 రోజుల్లో ఇవే అత్యల్పం..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: కాంట్రాక్ట్ ఉద్యోగులకు తెలంగాణ హైకోర్టు షాక్, జీవో 16 కొట్టివేస్తూ ఉత్తర్వులు
కాంట్రాక్ట్ ఉద్యోగులకు తెలంగాణ హైకోర్టు షాక్, జీవో 16 కొట్టివేస్తూ ఉత్తర్వులు
YS Viveka Case: బెయిల్ రద్దు ఎందుకు చేయకూడదు ?-  అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
బెయిల్ రద్దు ఎందుకు చేయకూడదు ?- అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
Pushpa 2 Chennai Event Date: ఏయ్ బిడ్డా... ఆ రెండు రోజులు చెన్నై, కొచ్చి నగరాలు పుష్పరాజ్ అడ్డా - అక్కడ ఈవెంట్స్ చేసేది ఎప్పుడంటే?
ఏయ్ బిడ్డా... ఆ రెండు రోజులు చెన్నై, కొచ్చి నగరాలు పుష్పరాజ్ అడ్డా - అక్కడ ఈవెంట్స్ చేసేది ఎప్పుడంటే?
Sabarimala Special Trains: శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్, మరో 26 ప్రత్యేక రైళ్లు ఇవే
శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్, మరో 26 ప్రత్యేక రైళ్లు ఇవే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Marquee players list IPL 2025 Auction | ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీల చూపు వీరి మీదే | ABP DesamRishabh pant IPL 2025 Auction | స్పైడీ రిషభ్ పంత్ కొత్త రికార్డులు సెట్ చేస్తాడా.? | ABP DesamRishabh Pant Border Gavaskar Trophy Heroics | ఒక్క ఇన్నింగ్స్ తో టెస్ట్ క్రికెట్ క్రేజ్ మార్చేశాడుPujara Great Batting at Gabba Test | బంతి పాతబడటం కోసం బాడీనే అడ్డం పెట్టేశాడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: కాంట్రాక్ట్ ఉద్యోగులకు తెలంగాణ హైకోర్టు షాక్, జీవో 16 కొట్టివేస్తూ ఉత్తర్వులు
కాంట్రాక్ట్ ఉద్యోగులకు తెలంగాణ హైకోర్టు షాక్, జీవో 16 కొట్టివేస్తూ ఉత్తర్వులు
YS Viveka Case: బెయిల్ రద్దు ఎందుకు చేయకూడదు ?-  అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
బెయిల్ రద్దు ఎందుకు చేయకూడదు ?- అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
Pushpa 2 Chennai Event Date: ఏయ్ బిడ్డా... ఆ రెండు రోజులు చెన్నై, కొచ్చి నగరాలు పుష్పరాజ్ అడ్డా - అక్కడ ఈవెంట్స్ చేసేది ఎప్పుడంటే?
ఏయ్ బిడ్డా... ఆ రెండు రోజులు చెన్నై, కొచ్చి నగరాలు పుష్పరాజ్ అడ్డా - అక్కడ ఈవెంట్స్ చేసేది ఎప్పుడంటే?
Sabarimala Special Trains: శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్, మరో 26 ప్రత్యేక రైళ్లు ఇవే
శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్, మరో 26 ప్రత్యేక రైళ్లు ఇవే
Amaran OTT Release Date: 'అమరన్' ఓటీటీ రిలీజ్ ఈ నెలలోనే... అనుకున్న తేదీ కంటే ముందుగానే Netflixలో... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
'అమరన్' ఓటీటీ రిలీజ్ ఈ నెలలోనే... అనుకున్న తేదీ కంటే ముందుగానే Netflixలో... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Lagacharla Incident: అధికారులపై దాడి కేసులో కీలక పరిణామం, లొంగిపోయిన కీలక నిందితుడు - 14 రోజులపాటు రిమాండ్
అధికారులపై దాడి కేసులో కీలక పరిణామం, లొంగిపోయిన కీలక నిందితుడు - 14 రోజులపాటు రిమాండ్
YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Viral News : గంజాయి మొక్కలతో బాల్కనీ గార్డెన్ - రొమాంటిక్ ఫోటోషూట్‌ చేసుకుని సోషల్ మీడియాలో పెట్టిన జంట - కట్ చేస్తే
గంజాయి మొక్కలతో బాల్కనీ గార్డెన్ - రొమాంటిక్ ఫోటోషూట్‌ చేసుకుని సోషల్ మీడియాలో పెట్టిన జంట - కట్ చేస్తే
Embed widget