By: ABP Desam | Updated at : 28 Sep 2021 10:31 AM (IST)
దేశంలో కోవిడ్ కేసులు (ప్రతీకాత్మక చిత్రం)
దేశంలో కోవిడ్ ఉద్ధృతి క్రమంగా తగ్గుతోంది. గత కొద్ది రోజులుగా కేసుల సంఖ్య తగ్గడంతోపాటు రికవరీల సంఖ్య పెరగడం ఊరట కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 18,795 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీటితో కలిపి దేశంలో ఇప్పటివరకు నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 3,36,97,581కి చేరింది. 201 రోజుల అనంతరం దేశంలో నమోదైన అతి తక్కువ కేసులు ఇవే కావడం విశేషం. గడిచిన 24 గంటల్లో 13,21,780 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఈ మేరకు వెల్లడైంది. ఇక నిన్న 179 మంది కోవిడ్ మహమ్మారితో పోరాడుతూ మృత్యువాతపడ్డారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,47,373కి చేరింది. గత 24 గంటల్లో 26,030 మంది కోవిడ్‌ను జయించారు. దీంతో రికవరీల సంఖ్య 32,9,58,002కి (97.81 శాతం) పెరిగింది. ప్రస్తుతం దేశంలో 2,92,206 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 56,57,30,031 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. నిన్న నమోదైన కోవిడ్ కేసుల్లో కేరళలో 11,699.. మహారాష్ట్రలో 2,432 ఉన్నాయి.
ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 292206గా (0.87 శాతం) ఉంది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 1,02,22,525 మందికి వ్యాక్సిన్లు అందించారు. దీంతో ఇప్పటి వరకూ అందించిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 87 కోట్లు దాటింది.
India reports 18,795 new #COVID19 cases, 26,030 recoveries, and 179 deaths in the last 24 hrs as per Union Health Ministry
— ANI (@ANI) September 28, 2021
Total cases 3,36,97,581
Total recoveries 32,9,58,002
Death toll 4,47,373
Active cases 2,92,206
Total vaccination: 87,07,08,636 (1,02,22,525 in last 24 hrs) pic.twitter.com/zF2fPXn7ra
COVID-19 Testing Update. For more details visit: https://t.co/dI1pqvXAsZ @MoHFW_INDIA @DeptHealthRes @PIB_India @mygovindia @COVIDNewsByMIB #ICMRFIGHTSCOVID19 #IndiaFightsCOVID19 #CoronaUpdatesInIndia #COVID19 #Unite2FightCorona pic.twitter.com/3EQzijLueb
— ICMR (@ICMRDELHI) September 28, 2021
Also Read: Huzurabad Bypoll: హుజూరాబాద్ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల.. పోలింగ్, కౌంటింగ్ తేదీలివే..
Also Read: Cyclone Updates: బలహీనపడ్డ గులాబ్.. తెలంగాణ, ఏపీలో ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఇక్కడ అతిభారీగా..
TSPSC Group1 Exam: గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్, 15 నిమిషాల ముందే గేట్లు క్లోజ్!
KTR Mulugu Tour: ఈ 7న ములుగు జిల్లాలో కేటీఆర్ పర్యటన, కలెక్టరేట్ సహా పలు పనులకు శంకుస్థాపన
దేశంలోనే టాప్ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్, యూనివర్సిటీల్లో 10వ స్థానంలో హెచ్‌సీయూ!
EMRS Teacher Jobs: ఏకలవ్య పాఠశాలల్లో 38 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్, వివరాలు ఇలా!
AP Weather: మరింత లేట్‌గా నైరుతి రుతుపవనాలు, ఆ ఎఫెక్ట్‌తో తీవ్రవడగాల్పులు - ఈ మండలాల్లోనే
Adipurush: థియేటర్లో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటు - 'ఆదిపురుష్' టీమ్ అరుదైన నిర్ణయం
Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన
Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ
క్యూట్ స్మైల్ తో కట్టిపడేస్తున్న లావణ్య త్రిపాఠి