MEA On Taliban Crisis: అఫ్గాన్ గడ్డ.. ఉగ్రవాదులకు అడ్డా కాకూడదు: భారత్
అఫ్గానిస్థాన్ తాజా పరిణామాలపై భారత విదేశాంగ శాఖ ప్రతినిధి మీడియాతో మాట్లాడారు. అఫ్గాన్.. ఉగ్రవాదుల అడ్డాగా మారకుండా చూడటమే భారత్ లక్ష్యమని ఆయన అన్నారు.
అఫ్గానిస్థాన్ లో తాలిబన్ల ప్రభుత్వాన్ని భారత్ గుర్తిస్తుందా? లేదా? అనే అంశంపై ప్రస్తుతం పెద్ద చర్చే నడుస్తోంది. అసలు తాలిబన్లను ప్రభుత్వం ఉగ్రవాదులుగానే చూస్తుందా? అని కేంద్రంపై విపక్షాలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి. అయితే కేంద్రం మాత్రం ఈ ప్రశ్నలను ప్రస్తుతానికి దాటవేస్తోంది. అఫ్గాన్ తాజా పరిణామాలపై ఈరోజు భారత విదేశాంగ శాఖ మీడియాతో మాట్లాడింది.
We are not aware of any detail or nature of what kind of govt could be formed in Afghanistan. I have no update on our meeting (with Taliban): MEA Spokesperson Arindam Bagchi pic.twitter.com/OR7v1AuZZM
— ANI (@ANI) September 2, 2021
We are not aware of any detail or nature of what kind of govt could be formed in Afghanistan. I have no update on our meeting (with Taliban): MEA Spokesperson Arindam Bagchi pic.twitter.com/OR7v1AuZZM
— ANI (@ANI) September 2, 2021
ప్రస్తుతం తమ దృష్టంతా అఫ్గాన్ ఉగ్రవాదానికి అడ్డా కాకుండా చూడటంపైనే ఉందని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి అన్నారు. తాలిబన్లతో ఖతార్ లో భారత రాయబారి చేసిన చర్చలపైనా స్పందించారు.
#WATCH | "We will be able to revisit this issue once operations at Kabul airport resume. The majority of Indians have left Afghanistan," MEA Spokesperson Arindam Bagchi on bringing back remaining Indians from Afghanistan pic.twitter.com/ZNMiBFnMUP
— ANI (@ANI) September 2, 2021
ప్రస్తుతం కాబూల్ విమానాశ్రయంలో కార్యకలాపాలు జరగట్లేదని ఆయన అన్నారు. తిరిగి మొదలైన వెంటనే ప్రజల తరలింపు మొదలుపెడతామని తెలిపారు.