Afghanistan Crisis: అఫ్గాన్ లో రెచ్చిపోతున్న తాలిబన్లు.. రిపోర్టర్ పై విచక్షణారహితంగా దాడి
టోలో న్యూస్ రిపోర్టర్ పై తాలిబన్లు దాడి చేశారు. అఫ్గాన్ లో అరాచకాలు పెరిగిపోతున్నాయని తమపై దాడి చేయడం తగదని జర్నలిస్టు సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
అఫ్గానిస్థాన్ లో తాలిబన్ల అరాచకాలు మితిమీరిపోతున్నాయి. మహిళలపై దాడులు చేస్తోన్న తాలిబన్లు తాజాగా జర్నలిస్టులను కూడా వదలడం లేదు. బుధవారం మధ్యాహ్నం టోలో న్యూస్ రిపోర్టర్ జియార్ ఖాన్ సహా అతని కెమెరామ్యాన్ పై తాలిబన్లు విచక్షణారహితంగా దాడి చేశారు.
ఏం జరిగింది?
పేదరికం, నిరుద్యోగంపై కాబూల్ లో రిపోర్టింగ్ చేస్తోన్న సమయంలో జియార్ ఖాన్, అతని కెమెరామ్యాన్ పై తాలిబన్లు చేయిచేసుకున్నారు. ఈ ఘటనపై జర్నలిస్టులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టులపై ఇలా వ్యవహరించడం తగదన్నారు.
అఫ్గానిస్థాన్ ఆక్రమించుకున్న తర్వాత జర్నలిస్టులపై తాలిబన్లు విరుచుకుపడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అఫ్గాన్ జర్నలిస్టులపై దాడి తీవ్ర ఆందోళన కలిగిస్తుందన్నారు. వీటిపై ఇస్లామిక్ యూఎఈ స్పందించాలని కోరుతున్నారు.
మరణించాడని వార్తలు..
TOLO news reporter Ziar Khan Yaad clarifies over his death reports saying "I was beaten by the Taliban in Kabul's New City while reporting. Some people have spread the news of my death which is false."
— ANI (@ANI) August 26, 2021
తాలిబన్ల దాడిలో జియార్ ఖాన్ మరణించాడంటూ ముందు వార్తలు వచ్చాయి. అయితే తనపై దాడి జరిగిన మాట వాస్తవమేనని కానీ తాను చనిపోలేదని జియార్ స్పష్టం చేశారు.
Also Read: E-Visa for Afghans: ఈ-వీసాపై మాత్రమే భారత్ లోకి ఎంట్రీ: హోంశాఖ
అమెరికా సూచన..
మరోవైపు తమ పౌరులు కాబూల్ విమానాశ్రయం వద్ద నిరీక్షించవద్దని అమెరికా సూచించింది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ మేరకు హెచ్చరించింది. తాము వ్యక్తిగతంగా సమాచారం ఇచ్చిన తర్వాతే విమానాశ్రయానికి రావాలని అమెరికా కోరింది.
Also Read: Afghanistan News: 'అమెరికా పౌరులారా.. కాబూల్ విమానాశ్రయం బయట ఉండొద్దు'