News
News
X

Adhir Ranjan Chowdhury: మన జేబులో నుంచి లాక్కుంది ఎక్కువ, ఇచ్చింది మాత్రం తక్కువ - కేంద్ర బడ్జెట్‌పై అధిర్ రంజన్ సెటైర్

Adhir Ranjan Chowdhury: కేంద్ర బడ్జెట్‌పై కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి సెటైర్లు వేశారు.

FOLLOW US: 
Share:

 Adhir Ranjan Chowdhury:

పాకెట్ గవర్నమెంట్: అధిర్ రంజన్ 

కేంద్ర బడ్డెట్‌పై ప్రతిపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు ఇదో జుమ్లా బడ్జెట్ అంటూ విమర్శిస్తున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీ సహా పలువురు నేతలు స్పందించగా...ఇప్పుడు ఎంపీ అధిర్ రంజన్ చౌదరి కూడా బడ్జెట్‌పై తన అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్రం మన జేబులో నుంచి రూ.1000 తీసుకుని రూ.200 వెనక్కి ఇస్తోందని సెటైర్లు వేశారు. సామాన్యుల సంక్షేమానికి భరోసా కల్పించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని, కానీ మోడీ సర్కార్ "పాకెట్ గవర్నమెంట్‌"గా మారిందని మండి పడ్డారు. మన నుంచి ఎక్కువ 
డబ్బులు లాక్కుని..ఇవ్వడంలో మాత్రం తక్కువ చేస్తున్నారంటూ విమర్శించారు. పైగా...అదేదో విరాళాలు ఇచ్చినట్టుగా భావిస్తున్నారంటూ కేంద్రంపై విరుచుకు పడ్డారు. బడ్జెట్ ప్రవేశ పెట్టే ముందు తమకు కొన్ని అంచనాలు ఉన్నాయని వివరించిన అధిర్ రంజన్...పెట్రోల్ రేట్లు తగ్గిస్తారని ఆశించినట్టు చెప్పారు. 

"పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తారని అంచనా వేశాం. వంటగ్యాస్‌ ధరలూ తగ్గుతాయని ఎక్స్‌పెక్ట్ చేశాం. కానీ...ఇదేమీ జరగలేదు. ఈ బడ్జెట్‌తో సామాన్య ప్రజలకు ఎలాంటి ఊరట దక్కలేదు"

అధిర్ రంజన్, కాంగ్రెస్ ఎంపీ

ప్రచారం..

ఇటు ప్రతిపక్షాల విమర్శలు వెల్లువెత్తుతున్నా...బీజేపీ మాత్రం బడ్జెట్‌ అంశాలన్ని ప్రచారం చేసుకునేందుకు రెడీ అవుతోంది. దాదాపు 12 రోజుల పాటు 50 నగరాల్లో కేంద్ర మంత్రులు ప్రత్యేకంగా ప్రెస్ కాన్ఫరెన్స్‌లు పెట్టి బడ్జెట్‌లోని కీలక విషయాల్ని ప్రస్తావించనున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ ముఖ్యమంత్రులు వీటిపై పూర్తి స్థాయిలో చర్చించనున్నారు. ఫిబ్రవరి 12వ తేదీ వరకూ ఈ చర్చలుకొనసాగనున్నాయి. పద్దులో  ప్రధాన అంశాలను ప్రజలకు చేరువ చేసేందుకు, అవగాహన కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. 

బ్యాలెన్స్ చేశాం: నిర్మలా సీతారామన్ 

బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో పద్దుపై మాట్లాడారు. వనరులు, వ్యయాలను బ్యాలెన్స్ చేస్తూ బడ్జెట్‌ను రూపొందించినట్టు స్పష్టం చేశారు. మూల ధన వ్యయం నుంచి సాధారణ ప్రజలకు మేలు చేకూర్చే వరకూ అన్ని విధాలుగా న్యాయం చేసినట్టు వెల్లడించారు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు పన్ను ఊరట కల్పించినట్టు తెలిపారు. డైరెక్ట్ ట్యాక్స్‌ విధానాన్ని సింప్లిఫై చేయాలని ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారని అన్నారు. ఈ బడ్జెట్‌లో ఆ కల నెరవేరిందని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పెట్టుబడులు వెల్లువెత్తేందుకు కేంద్రం కృషి చేస్తోందని అన్నారు. పన్ను విధానాన్నీ సరళతరం చేసినట్టు చెప్పారు. MSME సెక్టార్‌ ఆర్థికవ్యవస్థను బలోపేతం చేసేందుకు భారీగా రుణాలు అందించేందుకు ముందుకొచ్చినట్టు స్పష్టం చేశారు నిర్మలా సీతారామన్. 

"ఎలాంటి పన్ను మినహాయింపుల్లేని పన్ను విధానాన్ని తయారు చేయాలని అనుకున్నాం. అదే చేశాం. కొత్త పన్ను విధానం సులువుగా అర్థం చేసుకునే విధంగా ఉంటుంది. ఈ శ్లాబుల్లో మార్పులు చేయడం ద్వారా మధ్యతరగతి ప్రజలకు మేలు చేకూరుతుంది. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకునే ఈ బడ్జెట్‌ను తయారు చేశాం. దాదాపు అన్ని రంగాల్లోనూ డిజిటల్ ఎకానమీ
సృష్టించడమే మా లక్ష్యం" 

- నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి 

Published at : 02 Feb 2023 11:52 AM (IST) Tags: Union Budget Adhir Ranjan Chowdhury Budget 2023 Union Budget 2023

సంబంధిత కథనాలు

Konaseema News : చనిపోయిన వృద్ధురాలికి పింఛన్, వైసీపీ నాయకుని మాటతో వాలంటీర్ నిర్వాకం!

Konaseema News : చనిపోయిన వృద్ధురాలికి పింఛన్, వైసీపీ నాయకుని మాటతో వాలంటీర్ నిర్వాకం!

MCH Hospital Erramanzil: ఎర్రమంజిల్ లో ఎంసీహెచ్ ఆస్పత్రికి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన

MCH Hospital Erramanzil: ఎర్రమంజిల్ లో ఎంసీహెచ్ ఆస్పత్రికి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన

Breaking News Live Telugu Updates: కడప జిల్లా పులివెందలలో కాల్పుల కలకలం - ఇద్దరి పరిస్థితి విషమం

Breaking News Live Telugu Updates: కడప జిల్లా పులివెందలలో కాల్పుల కలకలం - ఇద్దరి పరిస్థితి విషమం

YS Sharmila: కింద పడిపోయిన వైఎస్ షర్మిల - ఇంటిముందే తోపులాట, ఉద్రిక్తత

YS Sharmila: కింద పడిపోయిన వైఎస్ షర్మిల - ఇంటిముందే తోపులాట, ఉద్రిక్తత

Mla Rapaka : దొంగ ఓట్లతో గెలిచానని అనలేదు, నా మాటలు వక్రీకరించారు- ఎమ్మెల్యే రాపాక వివరణ

Mla Rapaka : దొంగ ఓట్లతో గెలిచానని అనలేదు, నా మాటలు వక్రీకరించారు- ఎమ్మెల్యే రాపాక వివరణ

టాప్ స్టోరీస్

Pulivenudla Shooting : పులివెందులలో కాల్పుల కలకలం - ఇద్దరికి బుల్లెట్ గాయాలు !

Pulivenudla Shooting : పులివెందులలో కాల్పుల కలకలం - ఇద్దరికి బుల్లెట్ గాయాలు !

Adipurush Update : వైష్ణో దేవి ఆశీస్సులు తీసుకున్న 'ఆదిపురుష్' దర్శక, నిర్మాతలు - ప్రభాస్ సినిమాకు నయా ప్లాన్

Adipurush Update : వైష్ణో దేవి ఆశీస్సులు తీసుకున్న 'ఆదిపురుష్' దర్శక, నిర్మాతలు - ప్రభాస్ సినిమాకు నయా ప్లాన్

MLA Durgam Chinnaiah: వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే! మహిళ సంచలన ఆరోపణలు, కోడ్‌ భాష‌లో ఛాటింగ్‌!

MLA Durgam Chinnaiah: వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే! మహిళ సంచలన ఆరోపణలు, కోడ్‌ భాష‌లో ఛాటింగ్‌!

Visakhapatnam: చనిపోతామంటూ భార్యాభర్తల సెల్ఫీ వీడియో! చూస్తే కన్నీళ్లే - కాలువ వద్ద షాకింగ్ సీన్

Visakhapatnam: చనిపోతామంటూ భార్యాభర్తల సెల్ఫీ వీడియో! చూస్తే కన్నీళ్లే - కాలువ వద్ద షాకింగ్ సీన్