Gujarat Elections: తక్కువ ధరకే సిలిండర్‌లు ఇస్తే బెంగాలీలకు చేపలు వండుతారా? పరేష్ రావల్ వివాదాస్పద వ్యాఖ్యలు
Gujarat Elections: గుజరాత్ ఎన్నికల ప్రచారంలో బేజీపీ నేత పరేష్ రావల్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి.
Gujarat Elections:
ఎన్నికల ప్రచారంలో..
నటుడు, బీజేపీ నేత పరేష్ రావల్ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మరోసారి ఇలాంటి కామెంట్స్ చేశారు. ఈ వీడియోపై పెద్ద దుమారం రేగుతోంది. మొదటి విడత ఎన్నికలు జరగక ముందు ఆయన ఓ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా రోహింగ్యా ముస్లింల గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. "అందరూ గ్యాస్ సిలిండర్‌ల ధర పెరిగిపోయిందని వాపోతున్నారు. త్వరలోనే ఆ ధరలు తగ్గుతాయి. ఉద్యోగాలూ వస్తాయి. కానీ...ఒకటి ఆలోచించండి. రోహింగ్యా ముస్లింలు, బంగ్లాదేశ్ పౌరులు వచ్చి మీతో పాటు ఉంటే మీకెలా ఉంటుంది..? ఇప్పటికే ఈ పరిస్థితులు ఢిల్లీలో చూస్తున్నాం. తక్కువ ధరకు గ్యాస్ సిలిండర్‌లు వస్తే కొనుక్కోవచ్చేమో. కానీ..వాటితో ఏం చేస్తారు..? బెంగాలీల కోసం చేపలు వండుతూ కూర్చుంటారా..?" అని వివాదాస్పాద వ్యాఖ్యలు చేశారు పరేష్ రావల్. అంతే కాదు. గుజరాత్ ప్రజలు ద్రవ్యోల్బణాన్నైనా సహిస్తారేమో కానీ...ఇలా బంగ్లాదేశ్ ప్రజలు వచ్చి తమతో పాటు నివసిస్తే ఊరుకోరని అన్నారు. ప్రతిపక్షాల విమర్శలపైనా కాస్త ఘాటుగా స్పందించారు. "వాళ్ల నోళ్లకు డైపర్‌లు వేసుకోవాలి. అలా మాట్లాడుతున్నారు" అని నోరు జారారు. ఈ వ్యాఖ్యలతో ప్రతిపక్షాలు మరోసారి బీజేపీపై భగ్గుమన్నాయి. తృణమూల్ కాంగ్రెస్ నేత కీర్తి ఆజాద్ ట్విటర్ వేదికగా మండి పడ్డారు. పరేష్ రావల్ మాట్లాడిన వీడియోని షేర్ చేస్తూ విమర్శలు చేశారు. "బాబు గారు. మీరు గతంలోలా లేరు. బంగ్లాదేశ్ పౌరులు, రోహింగ్యాలు భారత్‌లోకి వచ్చారంటే హోం మంత్రి అమిత్‌షా సరిగా పని చేయడం లేదని అర్థం" అని సెటైర్ వేశారు.
అయితే...ఇది వివాదాస్పదం అయ్యాక పరేష్ రావల్ స్పందించారు. "చేపలు వండుకోవడం అనేది అసలు విషయమే కాదు. గుజరాతీలు వాటిని వండుకుని తినవచ్చు. బెంగాలీలు అంటే నా దృష్టిలో అక్రమంగా మన దేశంలోకి వచ్చిన బంగ్లాదేశ్ పౌరులు, రోహింగ్యాలు అని అర్థం. అయినా ఎవరి మనోభావాలనైనా దెబ్బ తీసి ఉంటే వారికి నేను క్షమాపణలు చెబుతున్నాను" అని ట్విటర్ వేదికగా వెల్లడించారు.
Actor/BJP politician Paresh Rawal in Gujarat: “Price of Gas cylinders will come down, inflation will fluctuate up-down, but what will you do when Bangladeshis and Rohingyas start living next to you?”
— Saif 🇵🇹 (@isaifpatel) November 30, 2022
He knows what will get BJP the votes in Gujarat.pic.twitter.com/6BEuwmTUdf
‘babu Bhai’
— Kirti Azad (@KirtiAzaad) December 1, 2022
“Aap to Aise Na
The”!!!!
If Bangladeshis and
Rohingyas are entering
#India it means @AmitShah as Home
Minister is not doing job
properly! @SirPareshRawal
are you saying #BSF
doesn't gaurd the borders
properly? https://t.co/MuaFTC73MY
of course the fish is not the issue AS GUJARATIS DO COOK AND EAT FISH . BUT LET ME CLARIFY BY BENGALI I MEANT ILLEGAL BANGLA DESHI N ROHINGYA. BUT STILL IF I HAVE HURT YOUR FEELINGS AND SENTIMENTS I DO APOLOGISE. 🙏 https://t.co/MQZ674wTzq
— Paresh Rawal (@SirPareshRawal) December 2, 2022
Also Read: Anti-Brahmin Slogans: జేఎన్యూ గోడలపై బ్రాహ్మణ వ్యతిరేక నినాదాలు- స్పందించిన వీసీ!