ABP Southern Rising Summit 2024 : డీలిమిటేషన్లో దక్షిణాదికి అన్యాయం అనేది ప్రాంతీయ పార్టీల వాదన - ఏబీపీ సదరన్ సమ్మిట్‌లో తేల్చేసిన బీజేపీ ఎంపీ రఘునందన్
ABP Southern Rising Summit: దక్షిణాదికి డీమిలేటేషన్‌లో అన్యాయం జరగదని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్పష్టం చేశారు. ఒక్క జనాభా ప్రాతిపదకినే కాదని అనేక అంశాల ఆధారంగా డీలిమిటేషన్ జరుగుతుందన్నారు.
![ABP Southern Rising Summit 2024 : డీలిమిటేషన్లో దక్షిణాదికి అన్యాయం అనేది ప్రాంతీయ పార్టీల వాదన - ఏబీపీ సదరన్ సమ్మిట్‌లో తేల్చేసిన బీజేపీ ఎంపీ రఘునందన్ ABP Southern Rising Summit 2024 Hyderabad BJP MP Raghunandan Rao clarified that there will be no injustice in the demilitarization of the south ABP Southern Rising Summit 2024 : డీలిమిటేషన్లో దక్షిణాదికి అన్యాయం అనేది ప్రాంతీయ పార్టీల వాదన - ఏబీపీ సదరన్ సమ్మిట్‌లో తేల్చేసిన బీజేపీ ఎంపీ రఘునందన్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/25/1c81668c288cf9dd9c62176e37152c761729852365057228_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ABP Southern Rising Summit 2024 Raghunandan Madhuyaski: నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాదికి సీట్ల పరంగా అన్యాయం జరుగుతుందని విస్తృతంగా జరుగుతున్న ప్రచారాన్ని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తోసి పుచ్చారు. ఇదంతా ప్రాంతీయ పార్టీలు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రచారంగానే స్పష్టం చేశారు. డీ లిమిటేషన్ అనేది 2026లో రాజ్యాంగపరంగా తప్పనిసరిగా జరగాల్సిన ప్రక్రియ అని రఘునందన్ రావు గుర్తు చేశారు. ఏబీపీ నెట్‌వర్క్ హైదరాబాద్ లో నిర్వహించిన సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో రఘునందన్ రావు, కాంగ్రెస్ నేత మధుయాష్కీ బైపోలార్, మల్టీపోలార్ రాజకీయ అంశాలపై జరిగిన ప్యానల్ చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీలిమిటేషన్‌పై క్లారిటీ ఇచ్చారు.
జనాభా ఒక్కటే నియోజకవర్గాల పునర్విభజనకు ప్రాతిపదిక కాదు : రఘునందన్
నియోజకవర్గాల పునర్విభజన కేవలం జనాభా ప్రాతిపదికన జరుగుతుందని ప్రాంతీయ పార్టీలు ప్రచారం చేస్తున్నాయని కానీ పునర్విభజనకు అనేక అంశాలు దోహదం చేస్తాయన్నారు. సామాజిక, రాజకీయ , ఆర్థిక , డెమెగ్రాఫిక్ స్థితిగతులన్నింటినీ అధ్యయనం చేసిన తర్వాతనే డీలిమిటేషన్ జరుగుతందన్నారు. ఈశాన్య రాష్ట్రాల గురించి రఘునందన్ రావు ప్రస్తావించారు. ఈశాన్య రాష్ట్రాల్లో తక్కువ జనాభా ఉన్నప్పటికీ అక్కడ లోక్ సభ సీట్లు ప్రాధాన్యత స్థాయిలో ఉంటాయని గుర్తు చేశారు. అలాగే దక్షిణాదిలో కేవలం జనాభా ప్రాతిపదికనే తీసుకోరని స్పష్టం చేశారు.
గాంధీ ఐడియాలజీ కేంద్రంగా బాపూ ఘాట్, అతిపెద్ద మహాత్ముడి విగ్రహం ఏర్పాటు - రేవంత్ రెడ్డి
నియోజకవర్గాల పునర్విభజన రాజ్యాగంపరంగా అవసరం : ముధుయాష్కీ
ఇదే అంశంపై మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ కూడా దక్షిణాదికి ఖచ్చితంగా అన్యాయం జరుగుతుందని వాదించలేదు. ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయని వాటిని క్లారిఫై చేయల్సి ఉందన్నారు. అదే సమయంలో నియోజకర్గాల పునర్విభజన అనేది మాత్రం ఖచ్చితంగా చేసి తీరాల్సిందేనన్నారు. దేశంలో అతి పెద్ద పార్లమెంటరీ నియోజకవర్గంగా ఉన్న మల్కాజిగిరిలో 32 లక్షలకుపైగా ఓటర్లు ఉన్నారని.. ఒక్క ఎల్పీనగర్‌లోనే ఆరు లక్షల మంది ఓటర్లు ఉన్నారని గుర్తు చేశారు. ఇలా ఇరువురు నేతలు సున్నితమైన అంశంపై తమ అభిప్రాయాలను అటూ ఇటూ కాకుండా స్పష్టంగా వ్యక్తం చేశారు.
సంకీర్ణ ప్రభుత్వాలు మంచివే కానీ.. !
సంకీర్ణ ప్రభుత్వాలపై భిన్నమైన వాదన వినిపించారు. రెండు సార్లు యూపీఎ హయంలో సంకీర్ణ ప్రభుత్వాలు అద్భుతంగా నడిచాయని కాంగ్రెస్ నేత మధుయాష్కీ గుర్తు చేశారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయన్నారు. బీజేపీ ప్రభుత్వంలో నియంత తరహా నిర్ణయాలు తీసుకున్నారని గుర్తు చేశారు. అయితే బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంకీర్ణ రాజకీయాల విషయంలో వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదు కానీ.. ప్రజలు మోడీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. అటల్ బీహారీ వాజ్ పేయి హయాంలో సంకీర్ణ సర్కార్ విజయవంతంగా నడిచిందన్నారు.
ఈ ప్యానల్ డిబేట్‌లో అటు రఘునందన్ రావు, ఇటు మధుయాష్కీ ఇద్దరు అనేక అంశాలపై తమ అభిప్రాయాలను నిర్మోహమాటంగా వెలిబుచ్చారు. పూర్తి డిబేట్‌ను ఈ లింక్‌లో చూడవచ్చు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)