అన్వేషించండి

ABP CVoter Opinion Poll: ప్రధాని పదవికి మోదీయే పర్‌ఫెక్ట్, రెండో స్థానంలో రాహుల్ - ABP సీఓటర్ ఒపీనియన్ పోల్

ABP News CVoter Opinion Poll: ప్రధాని పదవికి మోదీయే సరైన వ్యక్తి అని ఏబీపీ సీఓటర్ ఒపీనియన్ పోల్‌లో వెల్లడైంది.

ABP News CVoter Opinion Poll 2024: లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ (Lok Sabha Elections 2024) మరి కొద్ది రోజుల్లో మొదలు కానుంది. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్‌ జరగనుంది. మొత్తం 7 విడతల్లో జూన్ 1వ తేదీ వరకూ ఈ ఎన్నికలు కొనసాగనున్నాయి. ఈ క్రమంలోనే దేశ ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేసింది ABP CVoter Opinion Poll. ప్రధాని అభ్యర్థిగా ఎవరు ఉండాలని సర్వే చేపట్టగా అందులో 58% మంది ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీకే ఓటు వేశారు. ఆయనే ఆ పదవికి సరైన వ్యక్తి అని తేల్చి చెప్పారు. ఇక ఎప్పటి నుంచో ప్రతిపక్షాల తరపున రాహుల్ ప్రధాని అభ్యర్థి అన్న ప్రచారం జరుగుతోంది. అందుకే ఈ ఒపీనియన్‌ పోల్‌లో రాహుల్‌ గురించీ అభిప్రాయాలు సేకరించింది ఏబీపీ సీఓటర్స్ ఒపీనియన్ పోల్. అందులో 16% మంది రాహుల్‌కి అనుకూలంగా ఓటు వేశారు. ఆయన ప్రధానిగా ఉండడానికి అర్హులే అని తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.

అయితే...నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీల్లో ఎవరినైనా ఒకరిని నేరుగా ఎన్నుకోవాల్సి వస్తే ఎవరికి ఓటు వేస్తారన్న కోణంలోనూ సర్వే జరిగింది. అందులో 62.4% మంది మోదీకి మద్దతునిచ్చారు. ఆయననే ప్రధానిగా ఎన్నుకుంటామని చెప్పారు. 28% మంది ఓటర్లు రాహుల్‌కి ఓటు వేశారు. ఇక ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 2.4% మంది ప్రధాని పదవికి అరవింద్ కేజ్రీవాల్ కూడా సరైన వ్యక్తే అని చెప్పారు. 1.6% మంది ఓటర్లు మమతా బెనర్జీకి మద్దతు తెలిపారు. అఖిలేష్ యాదవ్‌కీ 1.5% మంది ఓటు వేశారు. 11.1% మంది ఇతరుల పేర్లు చెప్పగా...8.2% మంది చెప్పలేమని సమాధానమిచ్చారు. 

సర్వేలో పాల్గొన్న ఓటర్లలో 23.6% మంది భారత్‌ అభివృద్ధి దిశగా దూసుకుపోతుందని అభిప్రాయపడ్డారు. 47.5% మంది తమ జీవితాలు ఎంతో మెరుగయ్యాయని చెప్పారు. 4.3% మంది తాము బాగానే ఉన్నప్పటికీ భారత్ మాత్రం ఇంకా పేదరికంలోనే ఉండిపోతోందని అసహనం వ్యక్తం చేశారు. 21.8% మంది తమ జీవితాలు ఏమీ బాగుపడలేదని, ప్రభుత్వం కూడా సమస్యల్లోనే ఉందని వెల్లడించారు. 11.1% ఓటర్లు ప్రధాని మోదీ పని తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక 11.8% మంది ఓటర్లు తమ రాష్ట్ర ముఖ్యమంత్రిని మార్చేయాలని చెప్పారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సమస్యల్లో నిరుద్యోగం చాలా కీలకమైందని 31.9% మంది ఓటర్లు అభిప్రాయపడ్డారు. ఇక 23.1% మంది ఓటర్లు ద్రవ్యోల్బణం, ఆదాయం, ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నట్టు చెప్పారు.

ఏప్రిల్ 1 నుంచి 9వ తేదీ వరకూ దాదాపు 2,600 మంది ఓటర్ల అభిప్రాయాలు సేకరించి ఈ ఫలితాలు విడుదల చేశారు. గతంలోనూ ఇలాంటి సర్వేలు జరగగా నరేంద్ర మోదీకే ఎక్కువ ఓట్లు పడ్డాయి. రాహుల్‌ గాంధీ రెండో స్థానానికి పరిమితమయ్యారు. మొదటి టర్మ్ కన్నా రెండో టర్మ్‌కి ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా పెరిగిపోయింది. అందుకే..కచ్చితంగా ఈ సారి హ్యాట్రిక్‌ కొడతామని బీజేపీ చాలా ధీమాగా చెబుతోంది. ఓటర్లను ఆకట్టుకునేలా మోదీ గ్యారెంటీల పేరుతో మేనిఫెస్టో కూడా విడుదల చేసింది. 

Also Read: Voter Registration: ఓటు నమోదుకు లాస్ట్‌ ఛాన్స్‌, రేపటితో ముగియనున్న గడువు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Parliament Sessions: 25 నుంచి పార్లమెంట్ సమావేశాలు -  రాజ్యాంగ సవరణల కోసమే ఉభయసభల సంయుక్త సమావేశం ?
25 నుంచి పార్లమెంట్ సమావేశాలు - రాజ్యాంగ సవరణల కోసమే ఉభయసభల సంయుక్త సమావేశం ?
Chetan Maddineni: తెలుగు హీరోలకు థియేటర్ల కష్టాలు... మొన్న కిరణ్ అబ్బవరం, నేడు చేతన్ మద్దినేని
తెలుగు హీరోలకు థియేటర్ల కష్టాలు... మొన్న కిరణ్ అబ్బవరం, నేడు చేతన్ మద్దినేని
US Presidential Election 2024: అమెరికాలో ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందనAndhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Parliament Sessions: 25 నుంచి పార్లమెంట్ సమావేశాలు -  రాజ్యాంగ సవరణల కోసమే ఉభయసభల సంయుక్త సమావేశం ?
25 నుంచి పార్లమెంట్ సమావేశాలు - రాజ్యాంగ సవరణల కోసమే ఉభయసభల సంయుక్త సమావేశం ?
Chetan Maddineni: తెలుగు హీరోలకు థియేటర్ల కష్టాలు... మొన్న కిరణ్ అబ్బవరం, నేడు చేతన్ మద్దినేని
తెలుగు హీరోలకు థియేటర్ల కష్టాలు... మొన్న కిరణ్ అబ్బవరం, నేడు చేతన్ మద్దినేని
US Presidential Election 2024: అమెరికాలో ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
Pawan Kalyan in Palnadu: సరస్వతి భూముల్ని పరిశీలించిన పవన్ కల్యాణ్ - జగన్ పై సంచలన ఆరోపణలు
సరస్వతి భూముల్ని పరిశీలించిన పవన్ కల్యాణ్ - జగన్ పై సంచలన ఆరోపణలు
YS Sharmila: వైసీపీది పాపం, కూటమి సర్కార్ చర్యలు ప్రజలకు శాపం - విద్యుత్ ఛార్జీలపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు
వైసీపీది పాపం, కూటమి సర్కార్ చర్యలు ప్రజలకు శాపం - విద్యుత్ ఛార్జీలపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Indiramma Houses Scheme In Telangana: ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
Kuppam TDP: కుప్పంలో వైసీపీకి భారీ షాక్ - టీడీపీలో చేరిపోయిన మున్సిపల్ చైర్మన్
కుప్పంలో వైసీపీకి భారీ షాక్ - టీడీపీలో చేరిపోయిన మున్సిపల్ చైర్మన్
Embed widget