అన్వేషించండి

ABP Desam: ప్రజల మద్దతుతో మూడు వసంతాలు పూర్తి చేసుకున్న ABP Desam- నవ ఉత్సాహంతో నాల్గో ఏడాదిలోకి ప్రవేశం

ABP Desam Third Anniversary: ప్రజల మద్దతులో మరో ఏడాది పూర్తి చేసుకున్న ఏబీపీ దేశం నాల్గో వసంతంలోకి అడుగుపెట్టింది. నిరంతరం మీ పక్షాన నిటారుగా నిలబడుతూ మరిన్ని ఆసక్తికరమైన కథనాలు ఇకపై కూడా అందిస్తాం.

ABP Desam: ఏబీపీ దేశం మరో ముందడుగు వేస్తోంది. మూడేళ్ల ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తిచేసి నూతన ఉత్తేజంతో నాలుగో ఏడాదిలోకి అడుగుపెడుతున్నాం. జులై 30 2021న తెలుగునేలపై తొలి అడుగు పెట్టాం. అప్పటికి ఏబీపీ తెలుగు భాషలో వీక్షకులకు  మేం కొత్త.  కానీ ఈ బ్రాండ్ దేశ ప్రజలకు వందేళ్లకుపైగా తెలుసు. బెంగాల్ నేలపై పుట్టిన ఆనంద్ బజార్ పత్రిక- ABP గ్రూప్ ఈ నెలలోనే 102 ఏళ్లు పూర్తి చేసుకుంది. అలాంటి గ్రూపు నుంచి ఏబీపీ దేశం పేరుతో తెలుగుమార్కెట్లోకి అడుగుపెట్టాం. ఏబీపీ గ్రూపులో భాగమైన ఏబీపీ నెట్‌వర్క్ పరిధిలో జాతీయ వార్తా చానెల్ ఏబీపీ న్యూస్‌తోపాటు, రీజనల్ శాటిలైట్ చానళ్లు మరాఠీలో మాఝా, బెంగాళీలో ఆనందో, గుజరాతీలో అస్మిత ఉన్నాయి. వీటితోపాటు డిజిటల్ ఛానళ్లుగా పంజాబీలో సాంజా, తమిళనాడులో ఏబీపీనాడు, హిందీ డిజిటల్ ఛానల్ గంగ ఉన్నాయి. తెలుగులో ఏబీపీదేశం పేరుతో వచ్చాం.  రెండు రాష్ట్రాల్లోని తెలుగువారే కాదు... దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు రీడర్లు... సరిహద్దులకు ఆవల ఉన్న ప్రవాసాంధ్రులకు అభిమానపాత్రంగా మారింది మీ ఏబీపీ దేశం. 

అంకెలు- అంకితభావం

ఈ మూడేళ్లలో మేం ఏం చేశాం.. ఎక్కడున్నాం..? వందేళ్లుగా పాత్రికేయ పునాదుల మీదనే ఏబీపీ గ్రూపు జర్నలిజం మౌలిక సూత్రాలను మంత్రంగా భావిస్తుంటుంది. అందులో భాగమైన మేం మూడేళ్లుగా దానినే పాటిస్తున్నాం. మేం ఏంటో నెంబర్లలో చెప్పడం కన్నా..పాత్రికేయ ధర్మాన్ని పవిత్రంగా భావించాం అని చెప్పడానికే ప్రాధాన్యం ఇస్తాం. నెంబర్లలోనే చెప్పాలి అనుకుంటే మా వెబ్ సైట్ ద్వారా 1లక్షా 70వేలకు పైగా వార్తలు, కథనాలు, వీడియోలు అందించాం. Youtubeలో 40వేలకుపైగా వీడియోలు పబ్లిష్ చేశాం. గూగుల్ సెర్చ్, డిస్కవర్ మాధ్యమాల ద్వారా ఏబీపీ దేశం 200కోట్ల ఇంప్రెషన్స్ సాధించింది. 92కోట్ల పేజ్ వ్యూస్, 11 కోట్ల మంది యూనిక్ యూజర్స్ ఉన్నారు. కామ్ స్కోర్‌లో తెలుగులో టాప్-5లోకి చేరిన యంగెస్ట్ వెబ్ సైట్ ఏబీపీ దేశం. YouTube లో 160కోట్ల ఇంప్రెషన్స్ పొందిన మేం 38కోట్ల వీడియో వ్యూస్ సాధించాం. Facebookలో అత్యంత వేగంగా దూసుకెళ్లిన న్యూస్ పేజ్ ఏబీపీ దేశం. గడచిన రెండేళ్లుగా తెలుగు డిజిటల్ న్యూస్‌లో అత్యంత గ్రోత్ ఉన్న ఫేస్ బుక్  పేజ్ ఏబీపీ దేశం. ఈ ఏడాది మార్చిలో దేశం..లీడర్ బోర్డులో నెంబర్ వన్. నేను ఇంతకు ముందే చెప్పినట్లు మేం నెంబర్లలో ఎంత అనే దానికన్నా.. ఎలాంటి వార్తలు ఇచ్చాం అన్నదానికే ప్రాధాన్యం ఇస్తాం. 

ఏబీపీ దేశం ప్రారంభించింది..

నాణ్యతతో పాటు నవ్యతకు కూడా ప్రాధాన్యం ఇవ్వడం ఏబీపీ గ్రూప్ ప్రత్యేకత. అనేక ఇన్నేవేషన్స్ తెలుగులో చేశాం. తెలుగు మీడియాలో మొదటిసారి వెబ్ స్టోరీలను ప్రవేశపెట్టడం, వర్టికల్ వీడియోలను వెబ్ పేజీల్లోకి తీసుకురావడం, సౌతిండియాలో మొట్టమొదటి AI యాంకర్‌ను ఇంట్రడ్యూస్ చేయడం ఇవన్నీ ఏబీపీ దేశం ఘనతలు. 

సూటిగా సుత్తిలేకుండా 

మార్కెట్‌లోకి వచ్చే ముందు మేం ఒకటే అనుకున్నాం. ఫేకు వార్తల ప్రచారాల కన్నా... నిఖార్సైన నిజాలే చెప్పాలనుకున్నాం. మిస్ లీడ్ చేసే లీడింగ్‌ల కంటే.. జనాలను ఎంపవర్ చేసే ఫీడింగ్‌కే ప్రాధాన్యత ఇచ్చాం. రెండు అసెంబ్లీ ఎన్నికలు, జనరల్ ఎలక్షన్‌లో ఎటూ వంగకుండా నిటారుగా నించుని మా ప్రత్యేకత చూపాం. పొలిటికల్ విశ్లేషణల్లో విస్తృతిని.. కామెంట్లలో నిర్భీతిని చూపాం. నిస్పక్షపాతంగా ఉన్నాం. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఓపీనియన్ పోల్స్ కానీ.. పోలింగ్ ముగిసిన తర్వాత ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ కానీ ఎగ్జాక్ట్ రిజల్ట్స్‌తో మ్యాచ్ అయ్యాయి. 

ఎన్నికల సమయంలో మేం 100కు పైగా పొలిటికల్ ఇంటర్వూలు చేశాం. వైఎస్ షర్మిల, ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, పెమ్మసాని, శ్రీభరత్, మాధవీలత, ఇలా ఎందరో ప్రముఖులు ఏబీపీదేశంతో మాటలను పంచుకున్నారు.

గిరిజన గూడెం నుంచి అంతరిక్ష యానం వరకు 

క్షేత్రస్థాయిలోని మా రిపోర్టర్లు ఎప్పటికప్పుడు వినూత్న కథనాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువవుతున్నారు. గోదారి వరదల్లో గ్రౌండ్ రిపోర్టులు, ఎన్నికల గొడవల్లో స్పాట్ న్యూస్‌లు, అడవుల్ల జలపాతాలు.. అదే అడవి బిడ్డల ఆక్రందనలు, మనకు తెలీని సైన్సు కథలు, గుట్టు మట్లు చెప్పే డ్రెస్సింగ్ రూమ్ టేల్స్ ఇలా ఎన్నో రిపోర్టులు, ఐపీలతో మేం మీ ముందుకు వచ్చాం. 

ఎంటర్‌టైన్‌మెంట్‌కు అడ్డా

తెలుగింటి టీవీ సీరియల్స్‌ను చూసే తీరిక లేక డిజిటల్‌గా చదివేవారికి చిరునామాగా ఏబీపీ దేశం వెబ్ సైట్ మారింది. తెలుగులో టాప్ సీరియల్స్‌ను ఇప్పుడు మా వెబ్ సైట్ ద్వారానే రీడర్లు చదువుతున్నారు. మా లైఫ్ స్టైల్ కంటెంట్ వెబ్ స్టోరీల రూపంలో లక్షలాది మొబైల్ ఫోన్లకు చేరుతోంది. ఎలాంటి మిస్ లీడింగ్‌కు, తప్పుడు సమాచారాన్ని తావివ్వకుండా ఆరోగ్య సమాచారాన్ని అందిస్తున్నాం. పొద్దున లేవగానే ఎందరో మా శుభసమయాన్ని ఫాలో అవుతున్నారు. స్పిరుచ్యువల్ సమాచారంతో స్వాంతన పొందుతున్నారు. టెక్, ఆటో ఫీడ్‌లతో అప్ డేట్ అవుతున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్స్‌క్లూజివ్స్ ఆస్వాదిస్తున్నారు.

ఈవెంట్ వండర్స్

కేవలం వెబ్ పేజీల్లో వార్తలు మాత్రమే కాదు. ఆన్‌గ్రౌండ్ ఈవెంట్ల ద్వారా  జనాలకు చేరువతుతున్నాం. నాలుగు రోజుల కిందటే హైదరాబాద్‌లో ABP DESAM HEALTH CONCLAVEను నిర్వహించాం. తెలంగాణలోని విశిష్టమైన వైద్య నిపుణుల్ని, విద్యార్థలను ఒక చోటకు చేర్చి..వైద్య సంబంధిత అంశాలపై చర్చను నిర్వహించింది ఏపీబీదేశం. హైదరాబాద్ ఇన్ చార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్, వైద్యరంగ నిపుణులు హాజరైన ఈ కార్యక్రమం సూపర్ సక్సెస్ అయింది. త్వరలోనే మరిన్ని పెద్ద ఈవెంట్లకూ సిద్ధమవుతున్నాం. 

ఈ మూడేళ్లలో ప్రజలకు చేరాల్సిన ఏ సమాచారాన్ని ఫిల్టర్ లేకుండా అందించడం, వాళ్ల పక్షాన నిలబడటం, నిస్పక్షపాతంగా ఉండటం, నాణ్యమైన వార్తలను నవ్యతతో అందించడమే ప్రమాణాలుగా పనిచేశాం. ఇక ముందూ చేస్తాం.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Politics : కూటమి పార్టీల్లో అందరికీ నో ఎంట్రీ - చేరాలంటే ఎంట్రన్స్ టెస్టు పాసవ్వాల్సిందే !
కూటమి పార్టీల్లో అందరికీ నో ఎంట్రీ - చేరాలంటే ఎంట్రన్స్ టెస్టు పాసవ్వాల్సిందే !
New Ration Cards In Telangana: రేషన్ కార్డుల కోసం చూస్తున్న వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డుల కోసం చూస్తున్న వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
Tirupati Laddu Issue : వైఎస్ఆర్‌సీపీపై మరో పిడుగు శ్రీవారి లడ్డూ ఇష్యూ -  హిందూవాదుల ఆగ్రహాన్ని జగన్ ఎలా ఎదుర్కొంటారు ?
వైఎస్ఆర్‌సీపీపై మరో పిడుగు శ్రీవారి లడ్డూ ఇష్యూ - హిందూవాదుల ఆగ్రహాన్ని జగన్ ఎలా ఎదుర్కొంటారు ?
Weather Latest Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా వర్షాలు - ఐఎండీ
నేడు తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా వర్షాలు - ఐఎండీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABPTDP revealed reports on TTD Laddus | టీటీడీ లడ్డూల ల్యాబ్ రిపోర్టులు బయటపెట్టిన టీడీపీ | ABP Desamహైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Politics : కూటమి పార్టీల్లో అందరికీ నో ఎంట్రీ - చేరాలంటే ఎంట్రన్స్ టెస్టు పాసవ్వాల్సిందే !
కూటమి పార్టీల్లో అందరికీ నో ఎంట్రీ - చేరాలంటే ఎంట్రన్స్ టెస్టు పాసవ్వాల్సిందే !
New Ration Cards In Telangana: రేషన్ కార్డుల కోసం చూస్తున్న వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డుల కోసం చూస్తున్న వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
Tirupati Laddu Issue : వైఎస్ఆర్‌సీపీపై మరో పిడుగు శ్రీవారి లడ్డూ ఇష్యూ -  హిందూవాదుల ఆగ్రహాన్ని జగన్ ఎలా ఎదుర్కొంటారు ?
వైఎస్ఆర్‌సీపీపై మరో పిడుగు శ్రీవారి లడ్డూ ఇష్యూ - హిందూవాదుల ఆగ్రహాన్ని జగన్ ఎలా ఎదుర్కొంటారు ?
Weather Latest Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా వర్షాలు - ఐఎండీ
నేడు తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా వర్షాలు - ఐఎండీ
Idi Manchi Prabhutvam:
"ఇది మంచి ప్రభుత్వం" ప్రారంభమయ్యేది శ్రీకాకుళంలో కాదు, ఆఖరి నిమిషంలో మారిన షెడ్యూల్
Tirupati Laddu: తిరుమల లడ్డూలో వాడే పదార్థాలు ఏంటీ? ఇప్పుడు టీటీడీ చేయాల్సిందేంటీ?
తిరుమల లడ్డూలో వాడే పదార్థాలు ఏంటీ? ఇప్పుడు టీటీడీ చేయాల్సిందేంటీ?
Jr NTR Interview: సిద్ధూ జొన్నలగడ్డను పిలిచి మరీ పరువు తీసిన ఎన్టీఆర్... యంగ్ హీరోలతో హిలేరియస్ 'దేవర' ప్రమోషన్స్ 
సిద్ధూ జొన్నలగడ్డను పిలిచి మరీ పరువు తీసిన ఎన్టీఆర్... యంగ్ హీరోలతో హిలేరియస్ 'దేవర' ప్రమోషన్స్ 
Doon Express : ఎక్స్ ప్రెస్ రైలును బోల్తా కొట్టించే కుట్ర.. రైల్వే ట్రాక్ పై ఏడు మీటర్ల కరెంట్ పోల్
ఎక్స్ ప్రెస్ రైలును బోల్తా కొట్టించే కుట్ర - రైల్వే ట్రాక్ పై ఏడు మీటర్ల కరెంట్ పోల్
Embed widget