News
News
X

ABP C Voter Survey Gujarat: మోదీని తిడితే అధికారంలోకి వచ్చేస్తారా? ఏబీపీ సీ ఓటర్ సర్వేలో షాకింగ్ ఫలితాలు

ABP C Voter Survey Gujarat: ప్రధాని మోదీని తిడితే అధికారం సాధించటం సాధ్యమేనా అన్న అంశంపై సీ ఓటర్ సర్వే చేపట్టింది.

FOLLOW US: 
 
ABP C Voter Survey Gujarat:

గుజరాత్, హిమాచల్‌లో సర్వే..

గుజరాత్ ఎన్నికలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఎన్నడూ లేనంతగా టఫ్ ఫైట్ ఈ సారి కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. భాజపా మాత్రం వార్ వన్‌ సైడ్ అని ధీమాగా చెబుతోంది. అటు ఆమ్ఆద్మీ పార్టీ గట్టిగానే ప్రచారం చేస్తోంది. భాజపాను ఢీకొట్టేందుకు అస్త్రాలు సిద్ధం చేసుకుంది. వీటిలో ముఖ్యం "మోదీపై విమర్శలు" చేయటమే పనిగా పెట్టుకుంది. సింపుల్‌గా చెప్పాలంటే.. ఆయన చరిష్మాను దెబ్బ తీసే విధంగా కామెంట్స్ చేయటం. అటు హిమాచల్ ప్రదేశ్‌లోనూ ప్రతిపక్షాలు మోదీనే టార్గెట్ చేస్తున్నాయి. అంటే...ఈ సారి ఎన్నికల అంశం "మోదీ" చుట్టూనే తిరగనుంది. మరి ఆయన చరిష్మాను దెబ్బ తీస్తే ప్రతిపక్షాలకు విజయం దక్కుతుందా..? ఈ అంశంపైనే ABP News C Voter Survey చేపట్టింది. గుజరాత్‌లో 1,425 మంది,హిమాచల్ ప్రదేశ్‌లో 1,361 మంది అభిప్రాయాలను సేకరించింది. గుజరాత్‌లో ప్రధాని మోదీని టార్గెట్ చేసినంత మాత్రాన ప్రతిపక్షాలను విజయం వరిస్తుందా అని ప్రశ్నించగా...వాళ్లు షాకింగ్ సమాధానాలు చెప్పారు. ఈ సర్వేలో 39% మంది అవును అని బదులిచ్చారు. పీఎం మోదీని తిట్టటం ద్వారా ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశ ముందని వాళ్లు అంగీకరించారు. 61% మంది మాత్రం "కాదు" అని సమాధానమిచ్చారు. ఆయనను తిట్టటం ద్వారా విజయం సాధింటటం సాధ్యం కాదని స్పష్టం చేశారు. అంతకు ముందు కూడా పలు అంశాలపై సీ ఓటర్ సర్వే చేపట్టింది. 

గతంలోనూ సర్వే..

News Reels

గుజరాత్‌లో ఆమ్‌ఆద్మీ పార్టీ బలం పుంజుకుంటే కాంగ్రెస్ బలహీన పడుతుందా అన్న ప్రశ్నకు 44% మంది అవుననే సమాధానమిచ్చారు. 33% మంది ఆ ప్రభావం తక్కువే అని తేల్చి చెప్పారు. ఇక 23% మంది ఆప్‌తో కాంగ్రెస్‌కు వచ్చిన నష్టం ఏమీ లేదని వెల్లడించారు. ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రచార జోరు మామూలుగా లేదు. అటు భాజపా బయటకు చెప్పకపోయినా..కాస్తో కూస్తో ఆప్ వేగానికి కలవరపడుతోంది. తప్పకుండా గెలుస్తా మన్న ధీమా కాషాయ పార్టీకి ఉన్నప్పటికీ..ఆప్‌ జోరుతో కాస్త అప్రమత్తంగా ఉంటోంది. నిజానికి..ఆప్ బలపడితే ఆ దెబ్బ భాజపా కంటే ఎక్కువగా కాంగ్రెస్‌పైనే పడుతుంది. కానీ...ఆ ప్రభావం ఎంత మేర ఉంటుందన్నదే ప్రశ్న. అదే సమయంలో ఆప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలూ చేస్తోంది. ఇప్పటికే హామీల వర్షం కురిపించింది. ఢిల్లీ మోడల్‌నే గుజరాత్‌లోనూ అమలు పరుస్తామని భరోసా ఇస్తోంది. అయితే...ఈ ప్రకటనలు, విమర్శలతో ఆ పార్టీకి ఎంత ప్రయోజనం కలుగుతుందన్నది చూడాల్సి ఉంది. కాంగ్రెస్‌ను పూర్తిగా సైడ్‌కి నెట్టేసి భాజపా వర్సెస్ ఆప్‌గా ఎన్నికలను మార్చేయాలని కేజ్రీవాల్‌ వ్యూహం అమలు చేస్తున్నారు. అంటే...గుజరాత్‌లో ఓటమి పాలైనప్పటికీ ప్రధాన ప్రతిపక్షంగా ఆప్‌ ఉండాలన్నది ఆ పార్టీ ఆలోచన అయి ఉండొచ్చు. అందుకే...కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ లాంటి సీనియర్ నేతలంతా గుజరాత్‌లో తెగ ప్రచారం చేస్తున్నారు.

Also Read: Kejriwal on Uniform Civil Code: అప్పుడూ హడావుడి చేసి దుకాణం సర్దేశారు, ఇప్పుడూ అదే జరుగుతుంది - యూసీసీపై కేజ్రీవాల్

Published at : 30 Oct 2022 02:13 PM (IST) Tags: PM Modi Gujarat elections Gujarat ABP C Voter Survey Gujarat Elections 2022 HP Elections 2022 ABP C Voter Survey Gujarat

సంబంధిత కథనాలు

Soyam Babu Rao: 25 ఏళ్ల కిందట సారా ప్యాకెట్స్ తయారుచేసి అమ్మింది మీరు కాదా?: మంత్రిపై బీజేపీ ఎంపీ ఫైర్

Soyam Babu Rao: 25 ఏళ్ల కిందట సారా ప్యాకెట్స్ తయారుచేసి అమ్మింది మీరు కాదా?: మంత్రిపై బీజేపీ ఎంపీ ఫైర్

Bansilalpet Stepwell : పర్యాటక హంగులతో బన్సీలాల్ పేట్ మెట్ల బావి, ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Bansilalpet Stepwell : పర్యాటక హంగులతో బన్సీలాల్ పేట్ మెట్ల బావి, ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Dating App Cheating: డేటింగ్‌ యాప్స్‌లో కొత్త రకం మోసాలు, కిడ్నాప్‌ అవుతున్న యువకులు, ఉద్యోగులు!

Dating App Cheating: డేటింగ్‌ యాప్స్‌లో కొత్త రకం మోసాలు, కిడ్నాప్‌ అవుతున్న యువకులు, ఉద్యోగులు!

Covid Man Made Virus: కరోనా వైరస్ మానవ నిర్మితమే, చైనా ల్యాబ్ నుంచే లీక్ - వెలుగులోకి షాకింగ్ విషయాలు

Covid Man Made Virus: కరోనా వైరస్ మానవ నిర్మితమే, చైనా ల్యాబ్ నుంచే లీక్ - వెలుగులోకి షాకింగ్ విషయాలు

Nuzvid Police Station : నూజివీడు పోలీస్ స్టేషన్ పై మహిళలు దాడి, భారీగా పోలీసుల మోహరింపు!

Nuzvid Police Station : నూజివీడు పోలీస్ స్టేషన్ పై మహిళలు దాడి, భారీగా పోలీసుల మోహరింపు!

టాప్ స్టోరీస్

Ex MP Harsha Kumar : వైసీపీ గూటికి మాజీ ఎంపీ హర్షకుమార్‌!, ఎంపీ టికెట్ ఇచ్చే యోచనలో అధిష్ఠానం?

Ex MP Harsha Kumar : వైసీపీ గూటికి మాజీ ఎంపీ హర్షకుమార్‌!, ఎంపీ టికెట్ ఇచ్చే యోచనలో అధిష్ఠానం?

Disaster Telugu Movies 2022: ఈ ఏడాది టాప్ 10 డిజాస్టర్ తెలుగు సినిమాలేంటో తెలుసా?

Disaster Telugu Movies 2022: ఈ ఏడాది టాప్ 10 డిజాస్టర్ తెలుగు సినిమాలేంటో తెలుసా?

ENG Vs PAK: పాకిస్తాన్‌పై 74 పరుగులతో ఇంగ్లండ్ ఘనవిజయం - టీ20 తరహాలో సాగిన బ్రిటిషర్ల బ్యాటింగ్!

ENG Vs PAK: పాకిస్తాన్‌పై 74 పరుగులతో ఇంగ్లండ్ ఘనవిజయం  - టీ20 తరహాలో సాగిన బ్రిటిషర్ల బ్యాటింగ్!

NTR For SDT: సాయి ధరమ్ తేజ్ కోసం ఎన్టీఆర్ - పవర్‌ఫుల్ వాయిస్ అందిస్తున్న తారక్!

NTR For SDT: సాయి ధరమ్ తేజ్ కోసం ఎన్టీఆర్ - పవర్‌ఫుల్ వాయిస్ అందిస్తున్న తారక్!