7th Pay Commission News: కరోనా కాలంలో నిలిపివేసిన డీఏ బకాయిలపై కేంద్రం మౌనం - ఎదురు చూస్తున్న ఉద్యోగులు !
కరోనా కారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నిలిపివేసిన డీఏను ప్రభుత్వం ఇటీవల ఇచ్చింది. అయితే బకాయిల గురించి మాత్రం ఇంత వరకూ స్పష్టత ఇవ్వలేదు.
7th Pay Commission News: కోవిడ్ కారణంగా 2020 - 2021 జూన్ మధ్య పద్దెనిమిది కాలానికి సంబంధించిన కాలని డీఏను కేంద్రం నిలిపి వేసింది. ఆ డీఏ బకాయిలు విడుదల కాలేదు. జూలై 2021 నుండి రెండు డియర్‌నెస్ అలవెన్స్ పెంపు తర్వాత డీఏ రేటు 34%గా ఉంది. కరోనా కాలంలో నిలిపివేసిన డీఏలను కలిపారు కానీ పద్దెనిమిది నెలల పాటు ఇవ్వాల్సిన బకాయిలపై మాత్రం కేంద్రం స్పష్టత ఇవ్వడం లేదు. ఇప్పటికే ఎలాంటి బకాయిలు ఇచ్చే ఆలోచన లేదని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం 2020 జనవరి, 2020 జూలై, 2021 జనవరి డీఏలను రీస్టోర్ చేయడంతో పాటు 2021 జూలై, 2022 జనవరి డీఏలను కూడా పెంచింది. అయితే 2020 జనవరి నుంచి 2021 జూన్ వరకు 18 నెలల డీఏ బకాయిలు విడుదల చేయాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వీటి కోసం ఎదురు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాల్సిన డీఏ, డీఆర్ బకాయిల మొత్తం రూ.34,402 కోట్లు ఉన్నట్టు గతంలోనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. డీఏ, డీఆర్ బకాయిల్ని విడుదల చేస్తే 48 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 60 లక్షల మంది పెన్షనర్లకు మేలు జరుగుతుంది.
తాత్కాలిక ఉపాధ్యాయులను పర్మినెంట్ చేసే ప్రతిపాదన లేదు, తేల్చేసిన కేంద్రం
అయితే కరోనా కారణంగా డీఏను ఫ్రీజ్‌చేయడం వల్ల జరిగిన నష్టాన్ని ప్రభుత్వమే భర్తీ చేయాలని కేంద్ర ప్రభుత్వ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 18 నెలల బకాయిపై ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయని, చర్చల ద్వారా పరిష్కారం చూపాలని కోరుతున్నాయి.
ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వ సిబ్బందికి భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం రెండుసార్లు లేదా ప్రతి ఆరు నెలలకు ఒకసారి DA చెల్లిస్తుంది. అయితే, బకాయి మొత్తాన్ని చెల్లించడానికి ప్రభుత్వం సుముఖంగా లేనప్పటికీ, దానిని చెల్లించాలని నిర్ణయించుకుంటే, కేంద్ర ప్రభుత్వ సిబ్బందికి 11% పెంపుతో కలిపి 18 నెలల పాటు ఏకమొత్తం మొత్తం లభిస్తుంది.కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏటా జనవరి, జూలైలో డీఏ, డీఆర్ పెంచుతుంది. ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (AICPI) డేటాను పరిగణలోకి తీసుకొని డీఏను నిర్ణయిస్తుంది. ప్రతీసారి 3 శాతం లేదా 4 శాతం డీఏ పెరుగుతుంది.