Arunachal Pradesh Avalanche: హిమపాతంలో చిక్కుకున్న ఏడుగురు సైనికులు మృతి
అరుణాచల్‌ప్రదేశ్‌లో ఇటీవల హిమపాతంలో చిక్కుకొని గల్లంతైన ఏడుగురు సైనికులు మృతి చెందినట్లు భారత సైన్యం ప్రకటించింది.
అరుణాచల్‌ప్రదేశ్‌లో హిమపాతంలో చిక్కుకొని గల్లంతైన ఏడుగురు సైనికులు మృతి చెందారు. ఈ మేరకు భారత సైన్యం స్పష్టం చేసింది. వీరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది.
Seven Army personnel who were struck by avalanche in high altitude area of Kameng Sector in Arunachal Pradesh on 6 Feb have been confirmed dead, their bodies retrieved from the avalanche site: Indian Army pic.twitter.com/2SZMML8GzC
— ANI (@ANI) February 8, 2022
ఎక్కడ జరిగింది?
రాష్ట్రంలోని ఎత్తైన ప్రాంతమైన కమెంగ్ సెక్టార్‌లో ఆదివారం ఈ ఘటన జరిగింది. 14,500 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతంలో ఆదివారం సైనికులు పెట్రోలింగ్ చేస్తుండగా ఒక్కసారిగా మంచు కొండలు విరిగిపడ్డాయి. దీంతో వాటి కింద చిక్కుకుపోయిన సైనికులను కాపాడేందుకు ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. తీవ్రమైన హిమపాతం కొనసాగుతున్నా సరే ప్రతికూల వాతావరణంలోనూ సహాయ చర్యలను చేపట్టారు. కానీ లాభం లేకపోయిందని ఆర్మీ తెలిపింది.
ప్రాణాలతో సైనికులను కాపాడలేకపోయామని, చివరికి అమరులైన ఏడుగురు సైనికుల మృతదేహాలను ఘటనా స్థలం నుంచి వెలికి తీశామని ఇవాళ ఒక ప్రకటనలో పేర్కొంది. ఫార్మాలిటీలను పూర్తి చేసి మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగిస్తామని తెలిపింది.
Also Read: Karnataka Hijab Row: కర్ణాటకలో హిజాబ్ X కాషాయ కండువా.. వ్యవహారంపై హైకోర్టు ఏమందంటే?
Also Read: BJP Manifesto UP Election: యూపీ మేనిఫెస్టో విడుదల చేసిన భాజపా.. యువత, రైతులు, మహిళలపై వరాల జల్లు