అన్వేషించండి

Vizag Steel Plant Protests: 500 రోజుల మార్క్ దాటిన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దు ఉద్యమం 

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దు చెయ్యాలంటూ ఉద్యోగులూ, కార్మికులూ ఏకధాటిగా చేస్తున్న ఉద్యమం మొదలై 500 రోజులైంది. ఈ ఉద్యమాన్ని ప్రజలు ఏదో ఒక ప్రాంతానికో, ఉద్యోగులకో సంబంధించినది చూడటం లేదు.

 విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను రద్దు చెయ్యాలంటూ కార్మికులు,ఉద్యోగులు చేస్తున్న ఉద్యమం ప్రారంభమై 500 రోజులు అయింది. ఒక పక్క పని చేస్తూనే మరోవైపు ఉద్యమం చేస్తూ అటు సంస్థను లాభాల్లోకి తేవడమే కాకుండా ఇటు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు కార్మికులు , ఉద్యోగులు. ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవడానికి ఎన్నిరోజులైనా పోరాడుతూనే ఉంటామంటున్నారు. ఈ ఉద్యమం ప్రారంభమై 500 రోజులు పూర్తయిన వేళ ప్రత్యేక కార్యక్రమాలకు పిలుపునిచ్చారు కార్మికులు.  
 
కార్మికులకు లభిస్తున్న మద్దతు :

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దు చెయ్యాలంటూ అక్కడి ఉద్యోగులూ,కార్మికులూ ఏకధాటిగా చేస్తున్న ఉద్యమం మొదలై 500 రోజులైంది. ఈ ఉద్యమాన్ని ప్రజలు ఏదో ఒక ప్రాంతానికో, కొంతమంది ఉద్యోగులకో సంబంధించిన ఆంశంగా చూడటం లేదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ని ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీకగా ప్రజలు భావిస్తున్నారు. దానితో ప్రవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న కార్మికుల పోరాటానికి మద్దతు ఇస్తున్నారు. దీనివల్ల రెట్టించిన ఉత్సాహంతో ఈ ప్రైవేటీకరణ ప్రక్రియ ఆగే వరకూ పోరాటాన్ని ఆపేది లేదని కార్మిక, ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. తమ పోరాటం ప్రారంభించి 500 రోజులైన వేళ వివిధ కార్యక్రమాలను చేపడుతున్నారు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు.

ఈ 500 రోజుల కాలంలో ఎన్నో ఆటుపోట్లు, మరెన్నో బెదిరింపులు, ఆంక్షలు, అడ్డంకులు ఎదురైనా వారు వెనుతిరగలేదు.  వీటి స్ఫూర్తితోనే  ఆదివారం నాడు 26న ప్రత్యేక కార్యక్రమం జరుపనుంది విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ. ఆ రోజు ఉదయం 9 గంటలకు విశాఖపట్నం లోని కూర్మన్నపాలెం జంక్షన్ (స్టీల్ ప్లాంట్ ) గేట్ దగ్గర నుంచి రైల్వే డీఆర్‌ఎం ఆఫీసు వరకూ బైక్ ర్యాలీ చేపట్టనుంది. అక్కడి నుంచి జీవీఎంసీ ఉన్న గాంధీ విగ్రహం ముందు జరిగే మహాప్రదర్శనలో పాల్గొనాలని కార్మికులకు పిలునిచ్చారు. 

ప్రజల నుంచి సేకరించిన 26 వేల  ఎకరాల్లో ఏర్పాటైన స్టీల్ ప్లాంట్ :

రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్‌గా పిలిచే వైజాగ్ స్టీల్ ప్లాంట్ దాదాపు 26 వేల ఎకరాల్లో విస్తరించి ఉంది. దీని పేరు మీదే విశాఖ నగరానికి ఉక్కు నగరం అనే పేరు స్థిరపడింది. ప్రారంభంలో ఏడాదికి 3. 5 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్ధ్యంతో మొదలైన స్టీల్ ప్లాంట్ ప్రస్తుతం 7. 3 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేస్తుంది. ప్రత్యక్షంగా 17,500 మంది ఉద్యోగులూ, పరోక్షంగా మరో లక్షమంది ఈ స్టీల్ ప్లాంట్‌పై ఆధారపడి పని చేస్తున్నారు. అయితే ఈ సంస్థ నష్టాల్లో ఉందంటూ కేంద్ర ప్రభుత్వం తన వాటాను ఉపసంహరించు కోవడంతో ఏడాది క్రితం ఆందోళనలు మొదలయ్యాయి. స్టీల్ ఉత్పత్తుల్లో అనేక రికార్డులు సాధించిన  స్టీల్ ప్లాంట్ 2015 నుంచి వరుసగా నష్టాలను చవిచూస్తోంది.  విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు లేకపోవడమీ దీనికి ప్రధాన కారణమని కార్మిక సంఘాలు అంటున్నాయి. జిందాల్ లాంటి ప్రైవేటు సంస్థలకు గనులను కేటాయించిన ప్రభుత్వం... విశాఖ స్టీల్ ప్లాంట్‌కు మాత్రం అలంటి పనులు చేయడంలేదంటున్నారు. సొంత గనులు లేకపోవడంతో ముడి ఖనిజాన్ని కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీంతో ఉత్పత్తి వ్యయం పెరుగుతోంది. అందుకే గత కొన్నేళ్లుగా సంస్థ నష్ఠాలను నమోదు చేస్తుందంటున్నారు. వాటిని  సాకుగా చూపించి కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్‌ను పూర్తిగా ప్రైవేటుకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేసింది.
నిజానికి 2015 వరకూ స్టీల్ ప్లాంట్ పరిస్థితి బానే ఉంది. కానీ ఉక్కు పరిశ్రమలో అంతర్జాతీయంగా వస్తున్నమార్పులు, ఐరన్ ఓర్‌ను ప్రవేటుగా కొనుగోలు చెయ్యాల్సిన పరిస్థితి రావడంతో 2015-16 నుంచి 2020 వరకూ 5 వేల కోట్లు వరకు నష్టం వచ్చిందని కేంద్రం అంటుంది. ప్లాంట్ ఆధునికీకరణ, విస్తరణ చేపట్టడం వలన కూడా ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. అయితే  దేశంలో స్టీలుకు డిమాండు పెరుగుతుండటంతో భవిష్యత్తులో మళ్లీ లాభాల బాటపట్టే అవకాశం ఉంది. కానీ ఈ టైంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణకు సిద్ధమైంది.
 
సమస్యకు పరిష్కారం చూపించాల్సింది పోయి సంస్థను అమ్మేస్తామనడం సరికాదని స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు  అంటున్నారు . స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం ఆంధ్రులు చేసిన త్యాగాలు అన్నీ ఇన్నీ కావు . 1971లో ఈ సంస్థ కోసం 64 గ్రామాల నుంచి దాదాపు 26 వేల ఎకరాల భూమిని సేకరించారు. ఇదిగాక కురుపాం జమీందార్ 6వేల ఎకరాలను విరాళంగా ప్రకటించారు. అయితే భూములు ఇచ్చిన కుటుంబాల్లో సగం మందికే ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వగలిగారు. అయినప్పటికీ విశాఖ స్టీల్ ప్లాంట్ అంటే అది అందరిదీ అనే అభిప్రాయంతో ప్రజలు సర్దుకుపోయారు. ప్రతీ ఏటా వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి టాక్సుల రూపంలో వేలకోట్లు కేంద్ర ప్రభుత్వానికి చేరుతున్నాయి. అయినప్పటికీ నష్ఠాల వంక చూపి స్టీల్ ప్లాంట్ అమ్మేయ్యాలని కేంద్రం చూస్తుందని ఉద్యోగులు, కార్మికులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఏర్పాటై పోరాటం చేస్తుంది . 
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget