అన్వేషించండి
Advertisement
Rajya Sabha: 12 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు.. వర్షాకాలంలో తప్పు చేస్తే శీతాకాలంలో శిక్ష!
12 మంది ఎంపీలను సస్పెండ్ చేస్తూ రాజ్యసభ నోటీసు ఇచ్చింది. గత సెషన్‌లో సభలో మర్యాదపూర్వకంగా నడుచుకోని ఎంపీలపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు రాజ్యసభ నోటీసులో తెలిపింది.
శీతాకాల సమావేశాలు మొదలైన తొలిరోజే సాగు చట్టాల రద్దు బిల్లుకు ఆమోదం తెలిపింది పార్లమెంటు. విపక్ష సభ్యుల నిరసనల మధ్యే మూజువాణీ ఓటుతో బిల్లుకు ఆమోదం తెలిపాయి ఉభయ సభలు. అయితే రాజ్యసభ 12 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేసింది.
గత వర్షాకాల సమావేశాల్లో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి సభా మర్యాదలు పాటించని ఎంపీలను ఈ శీతాకాల సమావేశాలకు మొత్తం సస్పెండ్ చేస్తూ రాజ్యసభ సోటీసు ఇచ్చింది.
సస్పెండైన ఎంపీలు..
- ఎలమారమ్ కరీమ్ - సీపీఎమ్
- ఫులో దేవీ నేతమ్ - కాంగ్రెస్
- ఛాయా వర్మ - కాంగ్రెస్
- ఆప్ బోరా - కాంగ్రెస్
- రాజమణి పటేల్ - కాంగ్రెస్
- సయ్యద్ నాసిర్ హుస్సేన్ - కాంగ్రెస్
- అఖిలేశ్ ప్రసాద్ సింగ్ - కాంగ్రెస్
- బినోయ్ విశ్వం - సీపీఐ
- డోలా సేన్ - టీఎమ్‌సీ
- శాంతా ఛెత్రీ - టీఎమ్
- ప్రియాంక ఛతుర్వేదీ - శివసేన
- అనిల్ దేశాయ్ - శివసేన
" ఆగస్టు 11న జరిగిన సభలో ఈ ఎంపీలు మర్యాదను పాటించలేదు. ఛైర్మన్ స్థానాన్ని అవమానించారు. ఉద్దేశపూర్వకంగా భద్రతా సిబ్బందిపై దాడి చేశారు. "
-సస్పెన్షన్ నోటీసు
If you see the CCTV footage it has been recorded how male marshals were jostling female MPs. All of this on one side & your decision on the other? What kind of unparliamentary behaviour is this?: Shiv Sena MP Priyanka Chaturvedi - one of the 12 RS MPs suspended for this session pic.twitter.com/qwkCVvUsse
— ANI (@ANI) November 29, 2021
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
ఆట
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement