Young Wildlife Photographer 2021 Award: 10 ఏళ్ల బాలుడికి యంగ్ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ అవార్డు.. సాలీడు గూడును క్లిక్ మనిపించిన విద్యున్..
సాలీడు గూడును అద్భుతంగా చిత్రీకరించిన 10 ఏళ్ల విద్యున్ ఆర్ హెబ్బార్ అనే బాలుడికి 2021 సంవత్సరానికి సంబంధించి యంగ్ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ అవార్డు దక్కింది.
బెంగళూరుకు చెందిన విద్యున్ ఆర్ హెబ్బార్ అనే 10 ఏళ్ల బాలుడు 2021 సంవత్సరానికి సంబంధించి యంగ్ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ (Young Wildlife Photographer) అవార్డును దక్కించుకున్నాడు. సాలీడు గూడు నుంచి బయటకు వస్తున్న చిత్రాన్ని అద్భుతంగా చిత్రీకరించినందుకు గానూ విద్యున్‌కు ఈ అవార్డు దక్కింది. సాలీడు నివసించే గూడును డోమ్ హోమ్ (Dome Home) అని కూడా పిలుస్తారు. సాలీడు గూడు నుంచి బయటకు వస్తున్న చిత్రాన్ని తీయడం అద్భతమని.. ఇది ఫర్ఫెక్టుగా ఉందని జ్యూరీ సభ్యుడైన రోజ్ కిడ్మన్ కోక్స్ తెలిపారు. దీని బ్యాక్ డ్రాప్ కూడా సరిగ్గా సరిపోయిందని కొనియాడారు. ఒక ఫొటో బాగా రావాలంటే అందులో ఉండే చిన్న చిన్న విషయాలను కూడా గమనించాలని చెప్పారు. ఈ ఫొటో ఫ్రేమ్ చేసిన విధానం చాలా బాగుందని ప్రశంసించారు. సాలీడ్ గూడు ఆకృతిని, దాని లాటిస్ నిర్మాణాన్ని (lattice structure) ఇందులో చూడవచ్చని చెప్పారు.
Congratulations to Vidyun R Hebbar, the #WPY57 Young Wildlife Photographer of the Year! 🏆
— Natural History Museum (@NHM_London) October 12, 2021
In his colourful image, Dome home, a passing tuk-tuk provides a backdrop of rainbow colours to set off the tent spider’s silk creation.#WPYAwards @NHM_WPY pic.twitter.com/s0FXltm5iU
Ten-year old Vidyun R Hebbar from India is our Young Wildlife Photographer of the Year! 🏆
— Wildlife Photographer of the Year (@NHM_WPY) October 12, 2021
In his colourful image, Dome home, a passing tuk-tuk provides a backdrop of rainbow colours to set off a tent spider’s silk creation. #WPY57 pic.twitter.com/LGWTLfVV48
Also Read: కోవాగ్జిన్ పిల్లలకు కొవిడ్ టీకా ఎప్పటిలోగా అందుబాటులోకి వస్తుంది ? నిపుణులేమంటున్నారు ?
Also Read: దగా.. దగా.. మోసం! ఇంట్లో ఉన్నది ఐదుగురు.. పడింది మాత్రం ఒకే ఒక్క ఓటు!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి