అన్వేషించండి

Rocketry Movie Review - 'రాకెట్రీ' రివ్యూ: ఫస్టాఫ్‌లో సైన్స్ పాఠాలు, సెకండాఫ్‌లో భావోద్వేగాలు - నంబి నారాయణన్ బయోపిక్ ఎలా ఉందంటే?

Rocketry Movie Review Telugu: రాకెట్ సైంటిస్ట్ నంబి నారాయణన్ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా 'రాకెట్రీ : ది నంబి ఎఫెక్ట్'. తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కించారు. తెలుగులో అనువదించారు.

సినిమా రివ్యూ: రాకెట్రీ - ది నంబి ఎఫెక్ట్
రేటింగ్: 3/5
నటీనటులు: ఆర్. మాధవన్, సిమ్రాన్, సామ్ మోహన్, గుల్షన్ గ్రోవర్, మిషా గోషాల్ తదితరులతో పాటు అతిథి పాత్రలో సూర్య
సినిమాటోగ్రఫీ: శీర్షా రై
సాహిత్యం: కె. రామ్ మనోహర్
సంగీతం: సామ్ సి.ఎస్. 
నిర్మాతలు: ఆర్‌.మాధ‌వ‌న్‌, స‌రితా మాధ‌వ‌న్‌, వ‌ర్గీస్ మూల‌న్‌, విజ‌య్ మూల‌న్
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: ఆర్‌.మాధ‌వ‌న్‌
విడుదల తేదీ: జూలై 1, 2022

మాధవన్ కథానాయకుడిగా నటించడంతో పాటు దర్శకుడిగా పరిచయమైన చిత్రం 'రాకెట్రీ - ది నంబి ఎఫెక్ట్'. నిర్మాతల్లో మాధవన్ కూడా ఒకరు. రాకెట్ సైంటిస్ట్ నంబి నారాయణన్ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రమిది. ఈ సినిమా ఎలా ఉంది?

కథ (Rocketry Movie Story) : నంబి నారాయణన్ (మాధవన్) ఇస్రో శాస్త్రవేత్త. దేశ రహస్యాలు పాకిస్తాన్‌కు చేరవేశారనే అభియోగం మీద పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేస్తారు. కొన్ని రోజుల తర్వాత బెయిల్ మీద బయటకు వస్తారు. కొన్నాళ్లకు నిర్దోషి అని తెలుస్తుంది. అయితే... పోలీసులు అరెస్ట్ తర్వాత నంబితో పాటు అతని కుటుంబాన్ని సమాజం ఎలా చూసింది? ఆయన నిరపరాధి అని, ఎటువంటి తప్పు చేయలేదని ఎలా నిరూపించబడింది? నంబిపై నిరాధారమైన కేసు బనాయించి, ఆయనపై దేశద్రోహి అని ముద్ర వేయడానికి ముందు, తర్వాత దేశం కోసం ఆయన ఏం చేశారు? ఏయే త్యాగాలు చేశారు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ (Rocketry Review) : రాకెట్రీ... ఇది కథ కాదు, ఒక జీవితం! ఓ కుటుంబం పడిన మానసిక సంక్షోభానికి దృశ్యరూపం! దేశం కోసం త్యాగాలు చేసిన, చేయడం కోసం సిద్ధపడిన మనిషికి ఎంతటి అవమానం జరిగినా, ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా... చేయని తప్పు చేశానని అంగీకరించకుండా, ధైర్యంగా నిలబడి చేసిన పోరాటానికి నిలువుటద్దం!

కథగా చూస్తే... 'రాకెట్రీ'లో కొత్తగా ఏమీ లేదు. గూగుల్‌లో రాకెట్ సైంటిస్ట్ నంబి నారాయణన్ గురించి అందుబాటులో ఉన్నదే సినిమాలో ఎక్కువ శాతం ఉంది.  నాసా ఫెలోషిప్ రావడంతో అమెరికా వెళ్లడం, అక్కడ నుంచి తిరిగొచ్చిన తర్వాత అరెస్ట్ కావడం, ఆయనకు పద్మభూషణ్ రావడం అందరికీ అందుబాటులో ఉన్న సమాచారమే. అయితే, మాధవన్ కొత్తగా ఏం చూపించారు? అంటే... నంబి, ఆయన కుటుంబ సభ్యులు అనుభవించిన మానసిక క్షోభ.

నంబిని అరెస్ట్ చేసిన తర్వాత ఆయనను చూడడానికి ఇస్రో శాస్త్రవేత్తలు ఎవరూ రారు. ఎందుకు రాలేదని అధికారి ప్రశ్నిస్తే... ''ఒక రాకెట్ కూలిపోతే ఎలా రియాక్ట్ అవ్వాలో తెలిసిన మాకు (సైంటిస్ట్‌ల‌కు), ఒక మనిషి కూలిపోతే ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియదేమో'' అని నంబి సమాధానం ఇస్తారు. సినిమా చూశాక... నంబి కుటుంబం పట్ల బంధువులు, ఇతరులు ప్రవర్తించిన తీరు చూశాక... 'ఒక మనిషి కూలిపోతే ఎలా రియాక్ట్ అవ్వాలో ప్రజలుగా మనలో చాలా మందికి తెలియదేమో' అనిపిస్తుంది. ద్వితీయార్థంలో సన్నివేశాలు అంతలా హృదయాన్ని తాకుతాయి.

'రాకెట్రీ'కి బలం, బలహీనత... రెండూ మాధవనే. ఆయనలోని నటుడు సినిమాకు వెన్నుదన్నుగా నిలిస్తే... తొలి అడుగు వేసిన దర్శకుడు ప్రేక్షకుల నాడిని సరిగ్గా అంచనా వేయడంలో కొంత తడబడ్డాడు. ఫస్టాఫ్‌లో పలు సన్నివేశాల్లో ఆ తడబాటు కనిపించింది. కమర్షియల్ హంగులు, డ్రామా జోలికి వెళ్లకుండా నంబి నారాయణన్ జీవితంలో జరిగినది జరిగినట్టు చెప్పాలని మాధవన్ ప్రయత్నించారు. ఆ క్రమంలో వచ్చే సన్నివేశాలు సైన్స్ పాఠాలను గుర్తు చేస్తాయి. ఫస్టాఫ్ ఏమంత ఆకట్టుకోదు. ద్వితీయార్థంలో మాధవన్ అరెస్ట్ తర్వాత సన్నివేశాలు హృదయాన్ని తాకుతాయి. స్క్రీన్ ప్లే పరంగా మరింత వర్క్ చేయడంతో పాటు కొన్ని సన్నివేశాలకు మాధవన్ కత్తెర వేయాల్సింది. 

నంబి అరెస్టుకు మూల కారణం ఇప్పటికీ అంతుచిక్కని రహస్యమే. దాన్ని ఈ సినిమాలో చూపించారనుకుంటే పొరపాటే. ఈ సినిమా ద్వారా మరోసారి అసలు కారణం తెలియాలని నంబి ప్రశ్నించారు. విదేశీ శాస్త్రవేత్త ఇంట్లో నంబి పడిన కష్టాన్ని, విదేశాల్లో ఆయన ప్రయాణాన్ని ప్రేక్షకులకు సులభంగా అర్థమయ్యేలా తక్కువ సన్నివేశాల్లో మరింత ప్రభావం చూపించేలా తెరకెక్కించాల్సింది. సామ్ సిఎస్ నేపథ్య సంగీతం ఓకే. రామ్ మనోహర్ సాహిత్యంలో కథలో ఆత్మ కనిపించింది. నంబి జీవితంలో ఆవేదన ఆవిష్కృతం అయ్యింది. 

నటుడిగా మాధవన్ పడిన కష్టం తెరపై స్పష్టంగా కనిపించింది. నంబి నారాయణన్ జీవితంలో వివిధ దశలు చూపించడం కోసం బరువు తగ్గారు, పెరిగారు. శారీరకంగా ఎంతో కష్టపడ్డారు. ఆ కష్టం కంటే నటన ఎక్కువ ఆకట్టుకుంటుంది. నటుడిగా మాధవన్ చేసిన అద్భుతమైన పాత్రల్లో నంబి నారాయణన్ ఒకటిగా నిలుస్తుంది. నంబి భార్య మీనా పాత్రలో సిమ్రాన్ జీవించారు. పతాక సన్నివేశాల్లో ప్రేక్షకులకు షాక్ ఇస్తారు. మిగతా నటీనటుల్లో గుర్తు పెట్టుకోదగ్గ వారు తక్కువ. కలాం పాత్రలో గుల్షన్ గ్రోవర్, నంబిని ఇంటర్వ్యూ చేసే స్టార్ హీరో సూర్యగా సూర్య ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తారు. ఇక, సినిమా చివర్లో నంబి నారాయణన్ కనిపించడం హైలైట్. 

Also Read : 'సమ్మతమే' రివ్యూ: కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి నటించిన రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ఎలా ఉందంటే?

నంబి నారాయణన్ పడిన కష్టాన్ని, ఎదుర్కొన్న అవమానాలను, పడిన మానసిక క్షోభను వెండితెరపై ఆవిష్కరించడంలో మాధవన్‌లో నటుడు సక్సెస్ అయ్యారు. అయితే... ఆయన కథను అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాగా మలచడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యారు. డాక్యుమెంటరీలా తీశారు. 'రాకెట్రీ'కి ప్రశంసలు దక్కుతాయి. అయితే... అన్ని వర్గాల నుంచి ఆమోదం లభించడం కష్టం. ఒక్కటి మాత్రం నిజం... నంబి నారాయణన్‌ను గౌరవించిన చిత్రమిది. దీని నుంచి విజువల్ గ్రాండియర్ ఆశించవద్దు. సినిమాటిక్ ఎక్స్‌పీరియ‌న్స్ పక్కన పెట్టి... నంబి నారాయణన్ జీవితం గురించి తెలుసుకోవడంతో పాటు మాధవన్ కోసం ఒకసారి చూడొచ్చు. 

Also Read: చోర్ బజార్ సినిమా రివ్యూ: బచ్చన్ సాబ్ మెప్పించాడా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Best Selling Cars: టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Best Selling Cars: టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
Best Selling Smartphones: 2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Embed widget