Shekar Review: శేఖర్ రివ్యూ: రాజశేఖర్ కొత్త సినిమా ఎలా ఉందంటే?

రాజశేఖర్ హీరోగా నటించిన శేఖర్ సినిమా ఎలా ఉందంటే?

FOLLOW US: 

సినిమా రివ్యూ: శేఖర్
రేటింగ్: 2.5/5
నటీనటులు: రాజశేఖర్, శివాని రాజశేఖర్, ఆత్మీయ రాజన్, ముస్కాన్ ఖుబ్‌చందానీ తదితరులు
సినిమాటోగ్రఫీ: మల్లికార్జున నగరాని
సంగీతం: అనూప్ రూబెన్స్
నిర్మాత: బీరం సుధాకర్ రెడ్డి శివాత్మిక రాజశేఖర్
దర్శకత్వం: జీవిత రాజశేఖర్
విడుదల తేదీ: మే 20, 2022

సీనియర్ హీరో రాజశేఖర్ చాలా కాలం తర్వాత గరుడ వేగ సినిమాతో హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన కల్కి కూడా పర్వాలేదు అనిపించుకుంది. మళ్ళీ చాలా కాలం గ్యాప్ తర్వాత మలయాళం సినిమా రీమేక్ శేఖర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎలా ఉందంటే?

కథ: శేఖర్ (రాజశేఖర్) హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేసి వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకుంటారు. భార్య ఇందు (ఆత్మీయ రాజన్) తన నుంచి విడిపోయి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. కూతురు గీత (శివాని రాజశేఖర్) మాత్రం శేఖర్ దగ్గరే ఉంటుంది. గీత యాక్సిడెంట్‌లో మరణించడంతో శేఖర్ కుంగిపోయి తాగుడుకు బానిస అవుతాడు. ఇంతలో ఇందుకు కూడా యాక్సిడెంట్ అవుతుంది. పరిస్థితి చేయి దాటిపోయి బ్రెయిన్ డెడ్ కావడంతో తన అవయవాలను దానం చేస్తారు. అసలు ఇందు, గీతల మరణాల వెనుక ఎవరున్నారు? నిజం తెలిశాక శేఖర్ ఏ నిర్ణయం తీసుకున్నాడు? లాంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ: మలయాళ సినిమా జోసెఫ్‌కు రీమేక్‌కు తెరకెక్కిన చిత్రమిది. మొదట వేరే దర్శకుడు తీయాల్సి ఉన్నప్పటికీ అనుకోని పరిస్థితుల కారణంగా మెగాఫోన్ జీవిత చేతికి వచ్చింది. రీమేక్ సినిమాలను తెరకెక్కించడం కత్తి మీద సాము లాంటిది. ఉన్నది ఉన్నట్లుగా తీసినా కష్టమే. చేసిన మార్పులు వర్కవుట్ అవ్వకపోయినా కష్టమే. ఈ సినిమా ఫస్టాఫ్ చాలా నిదానంగా సాగుతుంది. కథకు సంబంధం లేని సన్నివేశాలు, పాటలు పంటి కింద రాయిలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇందు, శేఖర్‌లు ఎందుకు విడిపోయారో చెప్పటానికి అంత ఫ్లాష్‌బ్యాక్ పెట్టడం అనవసరం అనిపిస్తుంది.

ఇంటర్వల్ దగ్గర నుంచి కథ ఊపందుకుంటుంది. ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు రేసీగా సాగుతాయి. క్లైమ్యాక్స్‌లో ట్విస్టులను రివీల్ చేసే కీలకమైన లాయర్ పాత్రకు ప్రకాష్ రాజ్‌ను ఎంచుకోవడం మంచిదయింది. ఇన్వెస్టిగేషన్‌లో అక్కడక్కడా లాజిక్స్ మిస్ అయ్యాయి. ఊహించని ముగింపుతో సినిమాను ఎండ్ చేయడం కొంచెం షాకిస్తుంది. కానీ ఆ బ్లాక్ ఎమోషనల్‌గా వర్కవుట్ అయింది.

అనూప్ రూబెన్స్ అందించిన పాటల్లో ‘కిన్నెరా’ ఆకట్టుకుంటుంది. నేపథ్య సంగీతం సోసోగానే ఉంది. గ్యారీ బీహెచ్ ఎడిటింగ్ ఇంకొంచెం పేసీగా ఉండాల్సింది. ప్రథమార్థంలో చాలా సన్నివేశాలకు కత్తెర వేయవచ్చు.

ఇక నటీనటుల విషయానికి వస్తే... రాజశేఖర్ తన వయసుకు తగ్గ పాత్రలో ఆకట్టుకుంటారు. ఇందు పాత్రలో నటించిన ఆత్మీయ రాజన్, గీత పాత్రలో కనిపించిన శివాని రాజశేఖర్ తమ పాత్ర పరిధిలో బాగానే నటించారు. మిగతా పాత్రలు పోషించిన వారందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు.

ఓవరాల్‌గా చెప్పాలంటే... ఒక డిఫరెంట్ థ్రిల్లర్ చూడాలనుకునేవారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. ఫస్టాఫ్‌ను ఇంకొంచెం ట్రిమ్ చేసి రన్ టైం తగ్గించి ఉంటే డీసెంట్ థ్రిల్లర్ అయ్యేది.

Published at : 20 May 2022 02:11 PM (IST) Tags: Rajashekar Shivani Rajashekar ABPDesamReview Shekar Shekar Movie Review Shekar Review Shekar Review in Telugu Telugu Movie Shekar Review Jeevita Rajashekar

సంబంధిత కథనాలు

10th Class Diaries Movie Review - 'టెన్త్ క్లాస్ డైరీస్' రివ్యూ: స్కూల్ డేస్ లవ్వే  కాదు, అంతకు మించి - శ్రీరామ్, అవికా గోర్ నటించిన సినిమా ఎలా ఉందంటే?

10th Class Diaries Movie Review - 'టెన్త్ క్లాస్ డైరీస్' రివ్యూ: స్కూల్ డేస్ లవ్వే కాదు, అంతకు మించి - శ్రీరామ్, అవికా గోర్ నటించిన సినిమా ఎలా ఉందంటే?

Anya’s Tutorial Web Series Review - 'అన్యాస్ ట్యుటోరియల్' రివ్యూ: రెజీనా, నివేదితా సతీష్ భయపెట్టారా? లేదా?

Anya’s Tutorial Web Series Review - 'అన్యాస్ ట్యుటోరియల్' రివ్యూ: రెజీనా, నివేదితా సతీష్ భయపెట్టారా? లేదా?

Pakka Commercial Movie Review - 'పక్కా కమర్షియల్' రివ్యూ: గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా మారుతి తెరకెక్కించిన సినిమా ఎలా ఉందంటే?

Pakka Commercial Movie Review - 'పక్కా కమర్షియల్' రివ్యూ: గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా మారుతి తెరకెక్కించిన సినిమా ఎలా ఉందంటే?

Rocketry Movie Review - 'రాకెట్రీ' రివ్యూ: ఫస్టాఫ్‌లో సైన్స్ పాఠాలు, సెకండాఫ్‌లో భావోద్వేగాలు - నంబి నారాయణన్ బయోపిక్ ఎలా ఉందంటే?

Rocketry Movie Review - 'రాకెట్రీ' రివ్యూ: ఫస్టాఫ్‌లో సైన్స్ పాఠాలు, సెకండాఫ్‌లో భావోద్వేగాలు - నంబి నారాయణన్ బయోపిక్ ఎలా ఉందంటే?

Chor Bazaar Movie Review: చోర్ బజార్ సినిమా రివ్యూ: బచ్చన్ సాబ్ మెప్పించాడా?

Chor Bazaar Movie Review: చోర్ బజార్ సినిమా రివ్యూ: బచ్చన్ సాబ్ మెప్పించాడా?

టాప్ స్టోరీస్

SpiceJet Emergency Landing: స్పైస్‌జెట్ విమానంలో సాంకేతిక లోపం- పాకిస్థాన్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్!

SpiceJet Emergency Landing: స్పైస్‌జెట్ విమానంలో సాంకేతిక లోపం- పాకిస్థాన్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్!

Karthi First Look - PS 1: రాజ్యం లేని చోళ యువరాజు - వంతియతేవన్ వచ్చాడోచ్

Karthi First Look - PS 1: రాజ్యం లేని చోళ యువరాజు - వంతియతేవన్ వచ్చాడోచ్

Tigers Roaming In AP: పులి ఉంది జాగ్రత్త, ప్రజలను అలర్ట్ చేసిన ఏపీ అటవీ శాఖ - ఈ సూచనలు పాటిస్తే బెటర్

Tigers Roaming In AP: పులి ఉంది జాగ్రత్త, ప్రజలను అలర్ట్ చేసిన ఏపీ అటవీ శాఖ - ఈ సూచనలు పాటిస్తే బెటర్

Teegala Krishna Reddy: మంత్రి సబిత - తీగల కృష్ణారెడ్డి మధ్య ముదిరిన వార్! సంచలన వ్యాఖ్యలు, ఇవి అందుకు సంకేతమా?

Teegala Krishna Reddy: మంత్రి సబిత - తీగల కృష్ణారెడ్డి మధ్య ముదిరిన వార్! సంచలన వ్యాఖ్యలు, ఇవి అందుకు సంకేతమా?