IPL, 2022 | Qualifier 2 | Narendra Modi Stadium, Ahmedabad - 27 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
RCB
RCB
IPL, 2022 | Final | Narendra Modi Stadium, Ahmedabad - 29 May, 08:00 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
TBC
TBC

RRR Review - 'ఆర్ఆర్ఆర్' రివ్యూ: నందమూరి - కొణిదెల అభిమానులకు పండగే!

RRR Review Telugu : రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా నేడు విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది?

FOLLOW US: 

సినిమా రివ్యూ: 'ఆర్ఆర్ఆర్'
రేటింగ్: 3/5
నటీనటులు: ఎన్టీఆర్, రామ్ చరణ్, ఆలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగణ్, శ్రియ, సముద్రఖని, రే స్టీవెన్ సన్, అలీసన్ డూడీ, రాహుల్ రామకృష్ణ తదితరులు
కథ: కె.వి. విజయేంద్ర ప్రసాద్
స్క్రిప్ట్ డెవ‌ల‌ప్‌మెంట్‌: ఎస్.ఎస్. కాంచి
మాటలు: సాయి మాధవ్ బుర్రా     
సినిమాటోగ్రఫీ: కె.కె. సెంథిల్ కుమార్
సంగీతం: ఎం.ఎం. కీరవాణి
నిర్మాత: డీవీవీ దానయ్య
దర్శకత్వం: ఎస్.ఎస్. రాజమౌళి
విడుదల తేదీ: మార్చి 25, 2022

నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఎన్టీఆర్ (NTR jr), కొణిదెల ఫ్యామిలీ మెగా వారసుడు రామ్ చరణ్ (Ram Charan)... రియల్ లైఫ్‌లో వీళ్ళిద్దరూ స్నేహితులు. రీల్ లైఫ్‌లోనూ స్నేహితులుగా నటించిన సినిమా 'ఆర్ఆర్ఆర్' (RRR Movie). ఈ కాంబినేషన్‌ను తెరపైకి తీసుకొచ్చిన ఘనత దర్శకుడు రాజమౌళిది (Rajamouli). ఎన్టీఆర్, చరణ్ స్నేహితులైనా... అభిమానుల్లో ఆ స్నేహం లేదు. నందమూరి ఫ్యాన్స్, మెగాభిమానులు వేర్వేరు. రాజకీయ, సామాజిక కారణాలు దృష్ట్యా... ఈ 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' సినిమాను (RRR Roudram Ranam Rudhiram Review) అరుదైన మల్టీస్టారర్‌గా తెలుగునాట పేర్కొంటున్నారు. సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మిగతా భాషలకు వస్తే... 'బాహుబలి 2' తర్వాత రాజమౌళి దర్శకత్వం వహించిన చిత్రమిది. 'బాహుబలి' ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీలో బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలవడంతో 'ఆర్ఆర్ఆర్' కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. మరి, సినిమా (RRR Review in Telugu) ఎలా ఉంది? హిందీలో రామ్ చరణ్‌కు విజయాన్ని అందిస్తుందా? ఎన్టీఆర్‌కు పర్ఫెక్ట్ పాన్ ఇండియా డెబ్యూ అనొచ్చా? రివ్యూ (RRR Movie Telugu Review)లోకి వెళదాం! 

కథ: భారతదేశానికి స్వాతంత్య్రం రావడానికి ముందు సంగతి... అది ఆదిలాబాద్ జిల్లా. అక్కడి గోండు పిల్లను తెల్లదొర (బ్రిటీషర్ ఆఫీసర్) తీసుకు వెళతాడు. అడ్డు వచ్చిన అమ్మాయి తల్లిని చంపేస్తాడు. ఆ పాపను తీసుకురావడం కోసం భీమ్ (ఎన్టీఆర్) ఢిల్లీకి వెళతాడు. తెల్లదొరల దగ్గర పోలీస్‌గా పనిచేసే రామరాజు (రామ్ చరణ్) సైతం ఢిల్లీకి వెళతాడు. బ్రిటీషర్లకు వ్యతిరేకంగా పని చేసే ప్రజల్ని పట్టుకోవడం కోసం! ఢిల్లీలో భీమ్, రామరాజు ఒకరికొకరు పరిచయం అవుతారు. ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడుతుంది. జెన్నీ (ఒలీవియా మోరిస్)కు దగ్గర కావడానికి భీమ్ చేస్తున్న ప్రయత్నాలకు రామరాజు సాయం కూడా చేస్తాడు. అయితే... భీమ్‌ను రామరాజు ఎందుకు అరెస్ట్ చేస్తాడు? ఇద్దరి మధ్య ఏమైంది? భీమ్ తన పేరును అక్త‌ర్‌గా ఎందుకు మార్చుకుని మారువేషంలో ఎందుకు తిరిగాడు? రామరాజు తల్లిదండ్రుల (అజయ్ దేవగణ్, శ్రియ) కథేంటి? స్నేహితుల మధ్య సీత (ఆలియా భట్) పాత్ర ఏమిటి? భీమ్, రామరాజు కలిసి ఏం చేశారు? అనేది మిగతా సినిమా.  

విశ్లేషణ: రాజమౌళి పేరే పెద్ద బ్రాండ్. ఆ బ్రాండ్‌కి యంగ్ టైగర్, మెగా పవర్ స్టార్ యాడ్ అవ్వడం... 'బాహుబలి 2' తర్వాత రాజమౌళి సినిమా కావడం... 'ఆర్ఆర్ఆర్' మీద అంచనాలు పెంచాయి. సినిమా కథేంటి? అనేది ముందుగా చెప్పడం దర్శక ధీరుడి స్టైల్. 'ఆర్ఆర్ఆర్' గురించి కూడా ఆయన ముందు చెప్పేశారు... ఇద్దరు స్నేహితుల మధ్య జరిగే కథ అని! కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు కలిస్తే ఎలా ఉంటుంది? అని ఒక ఫిక్షనల్ కథ రాసుకున్నామని! అయితే... రియల్ క్యారెక్టర్లను బేస్ చేసుకుని ఫిక్షనల్ స్టోరీ రాసుకోవడంతో అంచనాలు పెరిగాయి.

ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి... అల్లూరి సీతారామరాజు గెట‌ప్‌లో రామ్ చరణ్ స్క్రీన్ మీద కనిపించినప్పుడు సెగలు సెగలే! రామరాజు ఇంట్రో వాయిస్ ఓవర్‌లో ఎన్టీఆర్ చెప్పినట్టు... ఆ ఎపిసోడ్‌లో రామ్ చరణ్ నిప్పు కణంలా నిలబడ్డాడు. కనిపించాడు. ఇంట్రో ఫైట్ అయితే సూపర్. కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌నూ తెరపై అలా చూస్తే... గూస్ బంప్స్ వస్తాయి. రాజమౌళి అంటే... ఎమోషన్ అండ్ యాక్షన్. ఈ సినిమాలో యాక్షన్ బ్లాక్స్‌ను ఒక రేంజ్‌లో తీశారు. ముందు రామ్ చరణ్ ఇంట్రడక్షన్, ఆ తర్వాత ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ (పులితో ఫైట్)... ఇంటర్వెల్ ఫైట్, సెకండాఫ్‌లో మరో ఫైట్... సినిమాలో ప్రతి ఫైట్ సూపర్ అనేలా ఉంది. అయితే... యాక్షన్ మధ్యలో ఎమోషన్, స్టోరీ చిన్నబోయింది. 

రాజమౌళి యాక్షన్ సీక్వెన్సులు ఎంత బాగా తీస్తారో... ఎమోషనల్ సన్నివేశాలనూ అంతే బాగా తెరకెక్కిస్తారని పేరు ఉంది. 'ఆర్ఆర్ఆర్'లో యాక్షన్ సీన్లు తీశారు. కానీ, వాటి మధ్యలో ఎమోషన్ మిస్ అయిన ఫీలింగ్ ఉంటుంది. కథలో కాన్‌ఫ్లిక్ట్‌ బలంగా లేకపోవడంతో ఎమోషన్ పండలేదు. విలన్ ఎంత బలంగా ఉంటే... హీరోయిజం అంత ఎలివేట్ అవుతుందనేది రాజమౌళి బలంగా నమ్మే సూత్రం. 'ఆర్ఆర్ఆర్'లో ఆ విలనిజం బలంగా లేదు. ఎన్టీఆర్ - రామ్ చరణ్ ఫైట్ ఒక్కటే ఎమోషనల్ మూమెంట్. ఆ తర్వాత క్లైమాక్స్‌లో ఫైట్స్ ఎమోషన్ ఇచ్చాయి. ఎమోషన్స్ కంటే యాక్షన్ సీన్స్‌లో ఫ్యాన్స్‌కు రాజమౌళి ఇచ్చిన హై మూమెంట్స్ బావుంటాయి.

ఫస్టాఫ్‌లో హీరోల ఇద్దరి ఇంట్రడక్షన్స్‌తో, స్టోరీ స్టార్ట్ చేయడంతో కొంతసేపు గడుస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ బావుంది. సెకాండాఫ్‌లో ఏదో జరుగుతుందని అనుకుంటే... కథ మరీ చప్పగా సాగింది. క్లైమాక్స్ వచ్చేవరకూ ఏదో అలా వెళుతూ ఉన్నట్టు ఉంటుంది తప్పతే... హై మూమెంట్ అనేది ఉండదు. చేదు గుళికపై తేనెపూతలా సాధారణ కథపై అల్లూరి, కొమురం భీమ్, బ్రిటీషర్ల పూత పూశారు రాజమౌళి. కథనం విషయంలోనూ నిరాశ పరిచారు. 

ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించిన పాటల విషయానికి వస్తే... 'నాటు నాటు' జనాల్లోకి వెళ్ళింది. తెరపై కూడా పాట అద్భుతంగా ఉంది. 'కొమురం భీముడో...' పాటలో ఎన్టీఆర్ నటన అద్భుతం. 'రామం రాఘవం...' పాట సందర్భానికి తగ్గట్టు ఉంది. అల్లూరి సీతారామరాజుగా తెరపై రామ్ చరణ్ జూలు విదిల్చినప్పుడు... నేపథ్యంలో ఆ పాట రావడం బావుంది. 'ఎత్తర జెండా' పాట సినిమా పూర్తయిన తర్వాత ఎండ్ టైటిల్స్ టైమ్‌లో వచ్చింది. పాటల్ని పక్కన పెట్టి, నేపథ్య సంగీతం విషయానికి వస్తే... రాజమౌళి సినిమాల్లో కీరవాణి నేపథ్య సంగీతం బలంగా నిలుస్తూ వచ్చింది. 'ఆర్ఆర్ఆర్'లోనూ కీరవాణి ఆర్ఆర్ (రీ రికార్డింగ్) హైలైట్ అయిన సందర్భాలు ఉన్నాయి. పాటలు సూపర్ డూపర్ హిట్ అని చెప్పలేం. కానీ, తెరపై చూసినప్పుడు బావున్నాయి. కె.కె. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ సినిమాకు బలంగా నిలిచింది. ప్రొడక్షన్ డిజైన్, ప్రొడక్షన్ వేల్యూస్ ఉన్నత స్థాయిలో ఉన్నాయి. వీఎఫ్ఎక్స్ బాగా కుదిరాయి. సెకండాఫ్ స్టార్టింగ్ ఎపిసోడ్స్ విషయంలో ఎడిటింగ్ పరంగా జాగ్రత్తలు తీసుకోవాల్సింది.

నటీనటుల విషయానికి వస్తే... ఎన్టీఆర్, రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. రామ్ చరణ్ రోల్ కాస్త సీరియస్‌గా సాగితే... ఎన్టీఆర్‌కు కొంతసేపు నవ్వులు పూయించే అవకాశం లభించింది. ఇద్దరూ పాత్రల్లో ఒదిగిపోయారు. పాత్రకు అవసరమైన అమాయకత్వాన్ని ఎన్టీఆర్ చక్కగా పలికించారు. అభీష్ఠానికి వ్యతిరేకంగా పనిచేసే సన్నివేశాల్లో రామ్ చరణ్ అద్భుతమైన అభినయం కనబరిచారు. ఆల్రెడీ చెప్పినట్టు యాక్షన్ సీన్స్‌లో ఇద్దరూ ఇరగదీశారు. ఆలియా భట్ పాత్ర నిడివి తక్కువే. కానీ, తెరపై కనిపించిన ప్రతిసారీ తన ఉనికి చాటుకున్నారు. సీత పాత్రకు ఆమె అభినయం ప్లస్ అయ్యింది. ఒలీవియా మోరిస్ అందంగా కనిపించారు. అజయ్ దేవగణ్ పాత్ర నిడివి కూడా తక్కువే. కానీ, ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉంటుంది. సముద్రఖని, రాహుల్ రామకృష్ణ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు.

Also Read: ‘డీప్ వాటర్’ రివ్యూ - భార్య అఫైర్స్‌కు భర్త ఊహించని ట్రీట్మెంట్, పెద్దలకు మాత్రమే!

ఫైనల్‌గా 'ఆర్ఆర్ఆర్' గురించి చెప్పాలంటే... అటు నందమూరి, ఇటు కొణిదెల అభిమానులకు పండగ. ఇద్దరు హీరోలను రాజమౌళి చక్కగా బ్యాలన్స్ చేశారు. రామ్ చరణ్ స్క్రీన్ స్పేస్ కొంచెం ఎక్కువైనా... ఎన్టీఆర్ అభిమానులకు ఎక్కడా అలా అనిపించదు. ఇద్దరి ఎలివేషన్స్ బావున్నాయి. అయితే... కథ విషయంలో, కొన్ని సన్నివేశాల విషయంలో ప్రేక్షకుడికి అసంతృప్తి ఉంటుంది. కథ, ఎమోషన్స్ కంటే యాక్షన్ సీక్వెన్సులు, హీరోలు హైలైట్ అయ్యే సినిమా 'ఆర్ఆర్ఆర్'.

Also Read: 'స్టాండప్ రాహుల్' రివ్యూ: రాజ్ తరుణ్ సినిమా నిలబడిందా? కిందకు పడిందా?

Published at : 25 Mar 2022 05:14 AM (IST) Tags: RRR ram charan alia bhatt Rajamouli RRR Movie Jr NTR ABPDesamReview RRR Review RRR Movie Review  RRR Telugu Movie Review  RRR Movie Review in Telugu  RRR Review In Telugu ఆర్ఆర్ఆర్ రివ్యూ

సంబంధిత కథనాలు

Top Gun Maverick Movie Review - 36 ఏళ్ళ తర్వాత సీక్వెల్ - 'టాప్ గన్: మావెరిక్' ఎలా ఉంది? టాప్ ప్లేస్‌లో ఉంటుందా? లేదా?

Top Gun Maverick Movie Review - 36 ఏళ్ళ తర్వాత సీక్వెల్ - 'టాప్ గన్: మావెరిక్' ఎలా ఉంది? టాప్ ప్లేస్‌లో ఉంటుందా? లేదా?

Escaype Live Review: ‘ఎస్కేప్ లైవ్’ రివ్యూ - వాస్తవాలను కళ్లకు కట్టేలా సిద్ధార్థ్ వెబ్‌ సీరిస్, ఇదో ‘వైరల్’ ఆట!

Escaype Live Review: ‘ఎస్కేప్ లైవ్’ రివ్యూ - వాస్తవాలను కళ్లకు కట్టేలా సిద్ధార్థ్ వెబ్‌ సీరిస్, ఇదో ‘వైరల్’ ఆట!

Shekar Review: శేఖర్ రివ్యూ: రాజశేఖర్ కొత్త సినిమా ఎలా ఉందంటే?

Shekar Review: శేఖర్ రివ్యూ: రాజశేఖర్ కొత్త సినిమా ఎలా ఉందంటే?

Don Review - 'డాన్' రివ్యూ: డాన్ నవ్వించాడు, ఏడిపించాడు - అయితే, మైనస్ ఏంటి? శివ కార్తికేయన్ సినిమా ఎలా ఉంది?

Don Review - 'డాన్' రివ్యూ: డాన్ నవ్వించాడు, ఏడిపించాడు - అయితే, మైనస్ ఏంటి? శివ కార్తికేయన్ సినిమా ఎలా ఉంది?

Sarkaru Vaari Paata Movie Review - 'సర్కారు వారి పాట' రివ్యూ: సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ఎలా ఉందంటే?

Sarkaru Vaari Paata Movie Review - 'సర్కారు వారి పాట' రివ్యూ: సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ఎలా ఉందంటే?
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Stock Market News: బలపడ్డ రూపాయి.. భారీ లాభాల్లో ఓపెనైన సెన్సెక్స్‌, నిఫ్టీ

Stock Market News: బలపడ్డ రూపాయి.. భారీ లాభాల్లో ఓపెనైన సెన్సెక్స్‌, నిఫ్టీ

Rahul Gandhi: ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీ సతమతం, ప్రశ్న అడగ్గానే ఏం చెప్పాలో అర్థం కాలేదా? - వీడియో వైరల్

Rahul Gandhi: ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీ సతమతం, ప్రశ్న అడగ్గానే ఏం చెప్పాలో అర్థం కాలేదా? - వీడియో వైరల్

Mahanadu 2022: టార్గెట్‌ 2024గా మహానాడు- పసుపు పండగతో టీడీపీలో కొత్త ఉత్తేజం

Mahanadu 2022: టార్గెట్‌ 2024గా మహానాడు- పసుపు పండగతో టీడీపీలో కొత్త ఉత్తేజం

Yoga Day Utsav: యోగా ఉత్సవ్ డే ప్రారంభం- యంగ్‌గా ఉండాలంటే యోగా చేయమంటున్న సెలబ్రెటీలు

Yoga Day Utsav:  యోగా ఉత్సవ్ డే ప్రారంభం- యంగ్‌గా ఉండాలంటే యోగా చేయమంటున్న సెలబ్రెటీలు