IPL, 2022 | Qualifier 2 | Narendra Modi Stadium, Ahmedabad - 27 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
RCB
RCB
IPL, 2022 | Final | Narendra Modi Stadium, Ahmedabad - 29 May, 08:00 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
TBC
TBC

Hey Sinamika Review - 'హే సినామికా' రివ్యూ: భరించడం కష్టం బాసూ!

Hey Sinamika Movie Review Telugu: నృత్య దర్శకురాలు బృందా మాస్టర్ దర్శకురాలిగా పరిచయమైన సినిమా 'హే సినామికా'. ఈ రోజు తమిళ, తెలుగు భాషల్లో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందంటే...

FOLLOW US: 

సినిమా రివ్యూ: హే సినామికా
రేటింగ్: 1.5/5
నటీనటులు: దుల్కర్ సల్మాన్, కాజల్ అగర్వాల్, అదితి రావు హైదరి తదితరులు 
సినిమాటోగ్రఫీ: ప్రీత జయరామన్ 
సంగీతం: గోవింద్ వసంత
నిర్మాణ సంస్థలు: జియో స్టూడియోస్, గ్లోబల్ వన్ స్టూడియోస్, వయాకామ్ 18 స్టూడియోస్ 
దర్శకత్వం: బృందా మాస్టర్ 
విడుదల తేదీ: మార్చి 3, 2022

'మహానటి'తో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan). అంతకు ముందు మణిరత్నం దర్శకత్వంలో నటించిన అనువాద చిత్రం 'ఓకే బంగారం' సైతం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. 'కనులు కనులు దోచాయంటే' చిత్రంతో తెలుగునాట మరో విజయం అందుకున్నారు. ఈ రోజు 'హే సినామికా' సినిమా (Hey Sinamika Movie Review)తో థియేటర్లలోకి వచ్చారు. ఇందులో కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal), అదితి రావు హైదరి (Aditi Rao Hydari) కథానాయికలు. నృత్య దర్శకురాలిగా ఎన్నో పాటలకు కొరియోగ్రఫీ అందించిన బృందా మాస్టర్ 'హే సినామికా'తో దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా (Brinda directorial debut Hey Sinamika Movie Review) ఎలా ఉంది?

కథ: ఆర్యన్ (దుల్కర్ సల్మాన్), మౌన (అదితి రావు హైదరి) తొలి పరిచయంలో ప్రేమలో పడతారు. పెళ్ళైన రెండేళ్లకు పరిస్థితి మారుతుంది. ఆర్యన్ నుంచి విడిపోవాలని మౌన నిర్ణయించుకుంటుంది. అందుకు కారణం తన భర్త నాన్ స్టాప్ వాగుడు, చేసిపెట్టే వంటలు అని చెబుతుంది. పలు ప్రయత్నాలు చేసిన తర్వాత సైకాలజిస్ట్ మలర్ (కాజల్ అగర్వాల్) దగ్గరకు వెళుతుంది. తన భర్తను వలలో వేసుకోమని, ప్రేమలో పడేయమని కోరుతుంది. అతడు ప్రేమలో పడితే... దాన్ని కారణంగా చూపించి విడిపోతానని అంటుంది. అందుకు మలర్ అంగీకరిస్తుంది. ఆర్యన్‌తో పరిచయం పెంచుకుని, అతడిని ప్రేమలో పడేసే ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? మలర్ ప్రేమలో ఆర్యన్ పడ్డాడా? లేదా? ఆర్యన్ నుంచి మౌన విడిపోయిందా? లేదా? అనేది మిగతా సినిమా.

విశ్లేషణ: 'ఎప్పుడు అయితే మదిలో ప్రశ్నలు ఆగిపోతాయో, అప్పుడు మనం మరణించినట్టు లెక్క. ప్రశ్నిస్తూ ఉండండి. మాట్లాడటం ఆపకండి' - సినిమాలో హీరో డైలాగ్ ఇది. 'హే సినామికా' ప్రారంభం నుంచి ప్రీ క్లైమాక్స్ వచ్చే వరకూ స్క్రీన్ ముందున్న ప్రేక్షకుల్ని ఒక ప్రశ్న వెంటాడుతూ ఉంటుంది. 'ఈ సినిమాను దుల్కర్ సల్మాన్, కాజల్ అగర్వాల్, అదితి రావు హైదరి ఎలా ఓకే చేశారు? ఈ కథతో దర్శకురాలిగా పరిచయం కావాలని బృందా మాస్టర్ ఎందుకు అనుకున్నారు?' అని! స్క్రీన్ మీద ఏదో జరుగుతుంది. కానీ, ఏదీ ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉండదు.

సినిమా ప్రారంభంలో దుల్కర్, అదితి ఎలా ప్రేమలో పడ్డారో ఎంత ఆలోచించినా అర్ధం కాదు. కాసేపటి ప్రేమలో సమస్య లేదు, పెళ్లి తర్వాత భర్త ప్రవర్తనతో కథానాయికకు సమస్య ఉందని, అదే అసలు కథ అని తెలుస్తుంది. అయితే... ఆ సమస్య నుంచి ఆమె బయట పడటం కోసం చేసే ప్రయత్నాలు సిల్లీగా అనిపిస్తాయి. సరైన సన్నివేశాలు లేవు. భర్త నుంచి విడిపోవడానికి భార్య చెప్పే కారణం సిల్లీగా ఉందంటే... సన్నివేశాలు ఇంకా సిల్లీగా ఉన్నాయి. భార్యాభర్తల తీరు మాత్రమే కాదు, కథానాయిక స్నేహితులు ప్రవర్తించే విధానం కూడా విచిత్రంగా ఉంటుంది. కథలో మంచి పాయింట్ ఉంది. కానీ, దానిని చెప్పిన విధానం బాలేదు. ప్రీ క్లైమాక్స్ నుంచి సినిమా కాస్త బావుంటుంది. ఎమోషనల్ సన్నివేశాలు హృద్యంగా ఉన్నాయి.

Also Read: 'వలిమై' రివ్యూ: తమిళ్ హీరో అజిత్ తెలుగులో హిట్ అందుకున్నాడా? విలన్‌గా కార్తికేయ ఎలా చేశాడు?

దుల్కర్ సల్మాన్, కాజల్ అగర్వాల్, అదితి రావు హైదరి పాత్రల పరిధి మేరకు నటించారు. కానీ, సిల్లీ సీన్స్ - రైటింగ్ ఇష్యూస్ వల్ల వాళ్ల నటన కూడా తేలిపోయింది. పతాక సన్నివేశాల్లో కాస్త ఆకట్టుకున్నారు. అదితి రావు హైదరి అందంగా కనిపించింది. గోవింద్ వసంత సంగీతం పర్వాలేదు. రెండు పాటలు ఆకట్టుకుంటాయి. అయితే... రెండు గంటలు సినిమాను భరించడం కష్టం! అయినా వెళ్లాలని అనుకుంటే మీ ఇష్టం. 

Also Read: దీపికా పదుకోన్ 'గెహ‌రాయియా' రివ్యూ: ఆ ఒక్క రొమాంటిక్ మిస్టేక్ కంటే జీవితం పెద్దది!

Published at : 03 Mar 2022 01:19 PM (IST) Tags: kajal aggarwal Aditi Rao Hydari Dulquer salmaan ABPDesamReview Hey Sinamika Movie Review Hey Sinamika Review Hey Sinamika Telugu Review Hey Sinamika Review in Telugu హే సినామికా మూవీ రివ్యూ

సంబంధిత కథనాలు

Top Gun Maverick Movie Review - 36 ఏళ్ళ తర్వాత సీక్వెల్ - 'టాప్ గన్: మావెరిక్' ఎలా ఉంది? టాప్ ప్లేస్‌లో ఉంటుందా? లేదా?

Top Gun Maverick Movie Review - 36 ఏళ్ళ తర్వాత సీక్వెల్ - 'టాప్ గన్: మావెరిక్' ఎలా ఉంది? టాప్ ప్లేస్‌లో ఉంటుందా? లేదా?

Escaype Live Review: ‘ఎస్కేప్ లైవ్’ రివ్యూ - వాస్తవాలను కళ్లకు కట్టేలా సిద్ధార్థ్ వెబ్‌ సీరిస్, ఇదో ‘వైరల్’ ఆట!

Escaype Live Review: ‘ఎస్కేప్ లైవ్’ రివ్యూ - వాస్తవాలను కళ్లకు కట్టేలా సిద్ధార్థ్ వెబ్‌ సీరిస్, ఇదో ‘వైరల్’ ఆట!

Shekar Review: శేఖర్ రివ్యూ: రాజశేఖర్ కొత్త సినిమా ఎలా ఉందంటే?

Shekar Review: శేఖర్ రివ్యూ: రాజశేఖర్ కొత్త సినిమా ఎలా ఉందంటే?

Don Review - 'డాన్' రివ్యూ: డాన్ నవ్వించాడు, ఏడిపించాడు - అయితే, మైనస్ ఏంటి? శివ కార్తికేయన్ సినిమా ఎలా ఉంది?

Don Review - 'డాన్' రివ్యూ: డాన్ నవ్వించాడు, ఏడిపించాడు - అయితే, మైనస్ ఏంటి? శివ కార్తికేయన్ సినిమా ఎలా ఉంది?

Sarkaru Vaari Paata Movie Review - 'సర్కారు వారి పాట' రివ్యూ: సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ఎలా ఉందంటే?

Sarkaru Vaari Paata Movie Review - 'సర్కారు వారి పాట' రివ్యూ: సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ఎలా ఉందంటే?
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

IND vs INA, Asia Cup Hockey: ఇండోనేషియాపై టీమిండియా గోల్స్ వర్షం - ఏకంగా 16-0తో విజయం - ఇంటి బాట పట్టిన పాకిస్తాన్!

IND vs INA, Asia Cup Hockey: ఇండోనేషియాపై టీమిండియా గోల్స్ వర్షం - ఏకంగా 16-0తో విజయం - ఇంటి బాట పట్టిన పాకిస్తాన్!

Bengal Cabinet: మొన్న తమిళనాడు, నేడు బంగాల్- కేంద్రానికి షాక్‌లు, గవర్నర్ అధికారాల్లో కోతలు!

Bengal Cabinet: మొన్న తమిళనాడు, నేడు బంగాల్- కేంద్రానికి షాక్‌లు, గవర్నర్ అధికారాల్లో కోతలు!

PM Modi Hyderabad Tour: కేసీఆర్‌పై ప్రధాని మోదీ హాట్ కామెంట్స్- తెలంగాణలో బీజేపీ గెలుస్తుందని జోస్యం

PM Modi Hyderabad Tour: కేసీఆర్‌పై ప్రధాని మోదీ హాట్ కామెంట్స్- తెలంగాణలో బీజేపీ గెలుస్తుందని జోస్యం

May 26 Records in Cricket: మే 26తో భారత క్రికెట్‌కు ప్రత్యేక కనెక్షన్ - రెండు మర్చిపోలేని రికార్డులు - ద్రవిడ్‌కు కూడా!

May 26 Records in Cricket: మే 26తో భారత క్రికెట్‌కు ప్రత్యేక కనెక్షన్ - రెండు మర్చిపోలేని రికార్డులు - ద్రవిడ్‌కు కూడా!