Calling Sahasra Review - కాలింగ్ సహస్ర రివ్యూ: కంఫర్ట్ జోన్ బయటకు 'సుడిగాలి' సుధీర్ - సినిమా ఎలా ఉందంటే?
Calling Sahasra Movie Review In Telugu: 'సుడిగాలి' సుధీర్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'కాలింగ్ సహస్ర'. తన కంఫర్ట్ జోన్ నుంచి సుధీర్ బయటకు వచ్చి సినిమా చేసినట్లు ఉంటుంది.
అరుణ్ విక్కిరాలా
సుడిగాలి సుధీర్, డాలీ షా, స్పందన పల్లి, శివబాలాజీ తదితరులు
సినిమా రివ్యూ: కాలింగ్ సహస్ర
రేటింగ్: 2.5/5
నటీనటులు: సుధీర్ ఆనంద్ భయానా (సుడిగాలి సుధీర్), డాలీ షా, స్పందన పల్లి, శివబాలాజీ, రవితేజ నన్నిమాల తదితరులు
ఛాయాగ్రహణం: సన్నీ
నేపథ్య సంగీతం: మార్క్ కె రాబిన్
స్వరాలు: మోహిత్ రెహమానియక్
నిర్మాతలు: వెంకటేశ్వర్లు కాటూరి, విజేష్ తయల్, చిరంజీవి పమిడి
రచన, దర్శకత్వం: అరుణ్ విక్కిరాలా
విడుదల తేదీ: డిసెంబర్ 1, 2023
Calling Sahasra Movie Review Telugu: 'జబర్దస్త్', 'ఢీ', 'పోవే పోరా', 'పటాస్' షోలతో బుల్లితెరపై 'సుడిగాలి' సుధీర్ (Sudigali Sudheer)కు మంచి ఫాలోయింగ్ వచ్చింది. తర్వాత 'సాఫ్ట్‌వేర్ సుధీర్', 'గాలోడు' సినిమాలతో సిల్వర్ స్క్రీన్ మీద సోలో హీరోగా ఎదిగారు. ఆయన హీరోగా నటించిన తాజా సినిమా 'కాలింగ్ సహస్ర'.
కథ (Calling Sahasra Movie Story): అజయ్ శ్రీవాత్సవ్ (సుడిగాలి సుధీర్) సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. బెంగళూరు నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అవుతాడు. ఆఫీసులో బాస్ కొత్త సిమ్ తీసుకోమని చెప్పడంతో 'కాలింగ్' మొబైల్ నెట్వర్క్ సిమ్ తీసుకుంటాడు. ఫోనులో వేస్తాడు. సహస్ర అంటూ వరుసగా ఫోనులు వస్తాయి. తనకు సహస్ర తెలియదని, తాను కొత్త సిమ్ తీసుకున్నానని చెప్పినా వినిపించుకోరు. ఫోనులు ఆగవు. ఒక రోజు సహస్ర ఎవరో తెలుసుకోవాలని వెళ్లిన అజయ్ చేతిలో ఒకరు మరణిస్తారు. పోలీస్ దర్యాప్తులో ఆ నంబర్ యాక్టివేట్ కాలేదని ఒక రోజు తెలుస్తుంది.
నంబర్ యాక్టివేట్ కాకపోతే ఫోన్లు ఎలా వస్తున్నాయి? అజయ్ చేతిలో మరణించిన వ్యక్తి ఎవరు? అసలు, సహస్ర ఎవరు? అజయ్, స్వాతి (డాలీ షా) మధ్య ప్రేమకథ ఏమిటి? రెడ్ రూమ్స్, లూసిఫర్ యాప్ కొందరి జీవితాల్లో ఎటువంటి మార్పులు తీసుకు వస్తున్నాయి? అక్కడ ఎటువంటి అరాచకాలు జరుగుతున్నాయి? రెడ్ రూమ్స్ నుంచి బయట పడిన శివ (శివ బాలాజీ) పోలీసుల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? అనేది మిగతా సినిమా.
విశ్లేషణ (Calling Sahasra Telugu Movie Review): 'సుడిగాలి' సుధీర్ ఇంతకు ముందు చేసిన సినిమాలకు విమర్శకుల నుంచి గొప్ప రివ్యూలు రాలేదు. కానీ, వసూళ్లు వచ్చాయి. అందుకు కారణం సుధీర్ ఇమేజ్ బేస్ చేసుకుని సినిమాలు కావడమే! అయితే... 'కాలింగ్ సహస్ర' కోసం తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చారు.
'కాలింగ్ సహస్ర'లో సుధీర్ కామెడీ చేయలేదు. ఆయనతో నవ్వించే ప్రయత్నాలు దర్శకుడు అరుణ్ విక్కిరాలా కూడా చేయలేదు. కథ, క్యారెక్టర్ నుంచి బయటకు రాకుండా సినిమా తీశారు. అందుకు ఆయన్ను మెచ్చుకోవాలి. నిజానికి సుధీర్ & రవితేజ నన్నిమాల కలయికలో కామెడీ చేసే ఛాన్స్ ఉంది. కానీ, ఎందుకో ఆ దిశగా దృష్టి పెట్టలేదు. సినిమా స్టార్టింగులో రవితేజను అంకుల్ అని పిలుస్తూ చేసిన ఫన్ వర్కవుట్ కాలేదు.
'కాలింగ్ సహస్ర' సినిమాకు వస్తే... అరుణ్ విక్కీరాలా ఎంపిక చేసుకున్న కాన్సెప్ట్ బావుంది. దాన్ని బేస్ చేసుకుని బలమైన స్క్రిప్ట్ రాసుకోవడంలో ఫెయిలయ్యారు. రెడ్ రూమ్స్, సిమ్ యాక్టివేట్ కాని నంబరుకు ఫోన్స్ రావడం ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే అంశాలు. సుధీర్ ఫ్లాట్‌కు హీరోయిన్ వచ్చే సీన్స్ జనాల్ని భయపెడతాయి. అవి చూసి షాక్ అవుతారు. అయితే... రైటింగ్ లోపల వల్ల అనుకున్న స్థాయిలో సస్పెన్స్ మైంటైన్ చేయడంలో, థ్రిల్ ఇవ్వడంలో 100 పర్సెంట్ సక్సెస్ కాలేదు.
దర్శకుడిపై హాలీవుడ్ ఫిల్మ్స్ ప్రభావం కనిపించింది. అయితే... స్క్రిప్ట్ దశలో మరింత వర్క్ చేసి ఉంటే బావుండేది. ఫర్ ఎగ్జాంపుల్... మాటలు రాని చిన్నపిల్లాడి దగ్గర హీరో ఫ్లవర్స్ కొంటారు. అతనికి, సహస్రకు కనెక్షన్ ఉంది. దానిని సరిగా ఎస్టాబ్లిష్ చేయలేదు. సూపర్ నేచురల్ ఎలిమెంట్‌ను పూర్తి స్థాయిలో వినియోగించుకోలేదు. స్క్రీన్ ప్లే రేసీగా లేదు. థ్రిల్లర్ సినిమాలకు అది అవసరం.
రైటింగ్ పరంగా లవ్ సీన్స్ కొంత వరకు బాగా రాశారు అరుణ్. మంచి ముసుగులో అనాథలను టార్గెట్ చేసే రైటింగ్ లోపాలను మార్క్ కె రాబిన్ నేపథ్య సంగీతం కవర్ చేసింది. సాంగ్స్ జస్ట్ ఓకే. క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ చక్కగా కుదిరింది. నిర్మాణ విలువలు పర్వాలేదు. ఎడిటింగ్ టేబుల్ మీద కొన్ని సీన్లకు కత్తెర వేయాల్సింది.
నటీనటులు ఎలా చేశారంటే: 'కాలింగ్ సహస్ర'లో 'సుడిగాలి' సుధీర్ కాస్త కొత్తగా కనిపిస్తారు. తన కామెడీ ఇమేజ్ నుంచి బయటపడే ప్రయత్నం చేశారు. ఓవర్ ది బోర్డు వెళ్లకుండా డీసెంట్‌గా క్యారెక్టర్ డిమాండ్ మేరకు నటించారు. యాక్షన్ సీన్స్ బాగా చేశారు. డాలీషా రెగ్యులర్ హీరోయిన్ రోల్ చేశారు. సినిమాకు కాస్త గ్లామర్ అద్దారు.
Also Read : యానిమల్ రివ్యూ: ఇంటర్వెల్‌కే క్లైమాక్స్ 'హై' ఇచ్చిన రణబీర్, సందీప్ రెడ్డి వంగా - మరి, ఆ తర్వాత?
స్పందన పల్లి క్యారెక్టర్ గురించి ఎక్కువ చెప్పలేం. కానీ, సహస్ర పాత్రకు ఆమె న్యాయం చేశారు. శివ బాలాజీ క్యారెక్టర్‌లో వేరియేషన్స్ ఉన్నాయి. స్టిక్ పట్టుకుని నడుస్తూ కొత్తగా కనిపించారు. క్లైమాక్స్‌లో ట్విస్ట్ ఇచ్చారు.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply
చివరగా చెప్పేది ఏంటంటే: పార్టు పార్టులుగా చూస్తే 'కాలింగ్ సహస్ర'లో థ్రిల్లింగ్ సీన్స్ బావుంటాయి. 'సుడిగాలి' సుధీర్ ఉన్నాడని కామెడీ ఆశించకండి. సూపర్ నేచురల్ / హారర్ థ్రిల్లర్ ఇది. కొన్ని థ్రిల్స్ ఇస్తుంది.
Also Read: దూత రివ్యూ: అమెజాన్‌లో నాగ చైతన్య ఫస్ట్ వెబ్ సిరీస్ - బావుందా? బాలేదా?