World Rose Day 2021: ఈ రోజు వరల్డ్ రోజ్ డే... దీన్ని ఎందుకు నిర్వహిస్తారు? మిలిందా రోజ్ కథేంటి?
ఐక్యరాజ్యసమితి ‘వరల్డ్ రోజ్ డే’ అనే ప్రతిపాదన తీసుకువచ్చింది. ఏటా సెప్టెంబర్ 22న ప్రపంచ గులాబీ దినోత్సవం (World Rose Day) నిర్వహిస్తారు.
క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతూ పోరాడుతూ ఏటా వేలాది మంది చనిపోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖులు, చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఈ ప్రాణాంతక వ్యాధి బారినపడుతున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధునిక టెక్నాలజీ సాయంతో క్యాన్సర్‌ని మొదటి దశలో గుర్తించి ప్రాణాలు కాపాడుకోగలుతున్నాం. కానీ, క్యాన్సర్‌ను జయించాలంటే మాత్రం మెరుగైన వైద్యంతో పాటు మనో ధైర్యం కూడా అవసరం.
ఇప్పుడు ఇదంతా ఎందుకంటే... ఈ రోజు (సెప్టెంబరు 22) World Rose Day. క్యాన్సర్‌ని జయించే క్రమంలో ప్రజలకు మనో ధైర్యంతో పాటు చైతన్య వంతులను చేసే విధంగా అడుగులు వేసేందుకు ఐక్యరాజ్యసమితి ‘వరల్డ్ రోజ్ డే’ అనే ప్రతిపాదన తీసుకువచ్చింది. ఏటా సెప్టెంబర్ 22న ప్రపంచ గులాబీ దినోత్సవం (World Rose Day) నిర్వహిస్తారు.
On this World Rose Day, let's try to spread cheer and hope in the lives among people fighting cancer. Also, let's raise awareness on cancer as timely quality diagnosis and treatment cures many types of cancers.#worldroseday pic.twitter.com/SsAPyzuXc7
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) September 22, 2021
ఈ రోజే ఎందుకు?
కెనడాకు చెందిన మెలిందా రోజ్ 12సంవత్సరాల వయస్సులో అస్కిన్స్ ట్యూమర్ అనే అరుదైన బ్లడ్ క్యాన్సర్ బారిన పడింది. రోజ్ కొన్ని రోజులు మాత్రమే బతుకుతుందని వైద్యులు తెలిపారు. మనోధైర్యంతో రోజ్ క్యాన్సర్ తో పోరాడుతూ వచ్చింది. అలా ఆమె ఆరు నెలలు బతికింది. ఈ ఆరు నెల్లలో ఆమె క్యాన్సర్ నుంచి బయటపడాలని ఎంతో పోరాడింది. ఏ మాత్రం అధైర్యపడకుండా రోజ్ ఎలాగైతే పోరాడిందో... అలాగే క్యాన్సర్ బారిన పడిన వారు పోరాడాలని ధైర్యాన్ని, క్యాన్సర్ రోగుల్లో ఆమె స్ఫూర్తిని నింపేలా ప్రతి ఏడాది ఒక సరి కొత్త థీమ్‌తో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ ఏడాది థీమ్ ఏంటంటే: "జీవించే సమయం తగ్గిపోవచ్చు.. ప్రతి రోజు ఉదయించే సూర్యుడ్ని చూసినప్పుడు.. ఈ రోజు గెలిచాను, జీవిస్తున్నాను అనే అనుభూతిని పొందండి. అలా ఆ రోజుని ఆనందంగా గడపండి, ఆస్వాదించండి". ఇది ఈ ఏడాది థీమ్.