World Lung Cancer Day 2024 : ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మరణాలకు కారణమవుతున్న క్యాన్సర్ ఇదే.. రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నివారణ చర్యలు ఇవే
Lung Cancer Awareness Month : ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ మరణానికి ప్రధాన కారణమవుతోంది లంగ్స్ క్యాన్సర్. ఈ మహమ్మారిపై అవగాహాన కలిపించేందుకు ఏటా ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవాన్ని జరుపుతున్నారు.
Lung Cancer Prevention and Treatment : క్యాన్సర్ మహమ్మారితో ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా ఊపిరితిత్తుల(లంగ్స్) క్యాన్సర్‌తో ఎందరో ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. అందుకే ఈ క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు ఏటా ఆగస్ట్ 1 వ తేదీన ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవాన్ని(World Lung Cancer Day 2024) నిర్వహిస్తున్నారు. లంగ్స్ క్యాన్సర్ కారకాలు, నివారణ, చికిత్స వంటి విషయాలపై అవగాహన కల్పించేందుకు దీనిని ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నారు.
లంగ్స్ క్యాన్సర్ అనేది అత్యంత సాధారణమైన క్యాన్సర్. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న క్యాన్సర్ మరణాలకు ఇదే ప్రధానకారణమవుతుంది. దాదాపు 1.6 మిలియన్ల మంది ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో చనిపోతున్నారు. దీనికి ప్రధానకారణం స్మోకింగ్ (ధూమపానం) అయినా.. స్మోకింగ్ అలవాటు లేనివారు కూడా దీనిబారిన పడి ప్రాణాలు వదులుతున్నారు. దాదాపు 15 శాతం మందికి పొగాకు అలవాటు లేకపోయినా ఈ క్యాన్సర్ వస్తున్నట్లు పరిశోధనల్లో గుర్తించారు. గాలి కాలుష్యం, ధూమపానం చేసే చోట ఎక్స్పోజర్ కావడం, వివిధ కారణాల వల్ల ఈ క్యాన్సర్ వస్తుంది.
ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవం చరిత్ర (World Lung Cancer Day History)
క్యాన్సర్ దినోత్సవాన్ని ఏటా ఆగస్టు 1వ తేదీన జరుపుతున్నారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రభావం గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించేందుకు ఫోరమ్ ఆప్ ఇంటర్నేషనల్ రెస్పిరేటరీ సొసైటీస్ 2012లో దీనిని ప్రారంభించింది. లంగ్స్ క్యాన్సర్ ద్వారా సంభవిస్తున్న మరణాలపై ప్రజలకు అవగాహన కల్పించి.. అది రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలను, వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తున్నారు.
ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవం థీమ్ (World Lung Cancer Day Theme)
ఈ క్యాన్సర్ వల్ల ఎక్కువమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సమస్యను తగ్గించాలనే నేపథ్యంలో ఏటా ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం కొత్త థీమ్‌తో ప్రజల ముందుకు వస్తూ.. క్యాన్సర్‌కు సంబంధించిన వివిధ అంశాలపై అవగాహన ఇస్తున్నారు. ఈ సంవత్సరం ముందస్తుగానే క్యాన్సర్ గుర్తించాలని, ఈ క్యాన్సర్ బారిన పడినవారికి మద్ధతుగా ఉండాలనే థీమ్‌తో ముందుకు వచ్చారు.
క్యాన్సర్ కారకాలు (Lung Cancer Triggering Points)
ధూమపానం, పొగాకు వాడకం అతి ముఖ్యమైన, ప్రధానమైన కారకాలు. స్మోకింగ్ చేసేవారిలో ఎక్కువమంది ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు గురి అవుతున్నారు. రాడాన్, ఆస్బెస్టాస్లకు గురికావడం, వాయుకాలుష్యం కూడా లంగ్స్ క్యాన్సర్‌కు కారణమవుతుంది. కొందరికి ఫ్యామిలీ నుంచి కూడా వచ్చే అవకాశముంది. రేడియేషన్ థెరపీ, హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) ఇన్ఫెక్షన్లు కూడా ఈ క్యాన్సర్‌ను ప్రేరేపిస్తాయి. క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD) కూడా క్యాన్సర్‌కు ట్రిగర్ పాయింట్ అవుతుంది.
నివారణ చర్యలు (Lung Cancer Prevention Tips)
ధూమపానం చేసే అలవాటు ఉంటే వీలైనంత తొందరగా మానేయాలి. అలాగే స్మోకింగ్ చేసేవారికి దూరంగా ఉండాలి. HPV, ఇన్ఫ్లూఎంజా టీకాలు వేయించుకోవాలి. ఇవి క్యాన్సర్ రాకుండా కాపాడే సత్తా కలిగి ఉంటాయి. పండ్లు, కూరగాయలను ఎక్కువగా డైట్‌లో తీసుకోవాలి. సమతుల్యమైన హెల్తీ ఆహారాన్ని తీసుకోవాలి. ఇమ్యూనిటీని పెంచే ఫుడ్స్‌ని తీసుకోవడంతో పాటు రెగ్యూలర్‌గా వ్యాయామం చేయాలి.
ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ మరణాలకు ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రధాన కారణమవుతుంది. కాబట్టి దీనిని ముందుగా గుర్తించడం చాలా అవసరం. కాబట్టి రెగ్యూలర్ చెకప్స్ చేయించుకోవాలి. ముందుగానే క్యాన్సర్‌ను గుర్తించడం వల్ల చికిత్స త్వరగా అందుతుంది. ఇది లైఫ్ స్పామ్‌ని పెంచుతుంది. రోగనిర్ధారణ ఎంత త్వరగా చేస్తే ప్రాణాలు అంత త్వరగా కాపాడుకోవచ్చు.
Also Read : మూర్ఛవస్తే ఫస్ట్ ఎయిడ్ ఇలా చేయండి.. సమస్యను దూరం చేసేందుకు ఈ టిప్స్‌ను ఫాలో అయిపోండి