Health benfits of Sports: ఆయుష్సు కావాలా నాయనా? అయితే స్పోర్ట్స్ చూడండి - జపాన్ శాస్త్రవేత్తల ఆసక్తికర సర్వే
Health benefits of Sports: క్రీడలను ఆస్వాదించడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని.. మెదడులో మంచి అనుభూతిని కలిగించే హార్మోన్‌లు విడుదలై, ఆయుష్షు పెరుగుతుందని తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది.
Health benfits of Sports: మీరు ఆరోగ్యంగా నిండు నూరేళ్లు బతకాలంటే.. ఆటలే ఆడక్కర్లేదు. కనీసం చూసినా చాలు. అదేంటీ.. చూస్తేనే ఆరోగ్యం వచ్చేస్తుందా? అనేగా మీ ప్రశ్నా? జపాన్ శాస్త్రవేత్తలు అదే అంటున్నారు. స్పోర్ట్స్ వీక్షించినట్లయితే.. మీ ఆయుష్షు పెరుగుతుందట. అందుకు కారణాలు కూడా చెప్పారు.
క్రీడలను ఆశ్వాదించడంవల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని జపాన్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. నిరంతరం ఆటలను చూడటం వల్ల మెదడులో మంచి ఆనందాన్ని అందించే హార్మోన్‌లు విడుదలవుతాయని, వాటి వల్ల ఆయుష్షు కూడా పెరిగే అవకాశం ఉందని తాజా అధ్యయనంలో పేర్కొన్నారు. క్రీడలు శారీరకంగా ఎంతో మేలు చేస్తాయి. అనారోగ్యం బారిన పడకుండా కాపాడుతాయి. చిన్న చిన్న వ్యాధులు అటాక్ చేయకుండా మనలో ఇమ్యునిటీ పవర్ పెంచుతాయనే సంగతి తెలిసిందే. అయితే, వాటిని చూడటం కూడా ఆరోగ్యకరమని శాస్త్రవేత్తలు చెప్పడం ఇదే ఫస్ట్ టైమ్.
ఈ మేరకు జపాన్‌లోని వాసెడా యూనివర్శిటీ చేపట్టిన తాజా అధ్యయనంలో గేమ్స్ ను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఆశ్వాదించడంవల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. మైదానంలో లేదా టీవీల్లో ఒక ప్రేక్షకుడిగా ఆటలను చూడటం వల్ల మెదడులో మంచి అనుభూతిని కలిగించే హార్మోన్‌లు విడుదలవుతాయని పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన రగ్బీతోపాటు మరికొన్ని క్రీడలు ప్రత్యక్షంగా మానవ మెదడుపై ప్రభావం చూపుతున్నట్లు తెలిపారు. ‘‘ఫుట్‌బాల్, రగ్బీ వంటి ప్రజాధరణ పొందిన క్రీడలు అత్యంత ఆనందాన్ని పంచుతున్నాయి. తామంతే ఒకే వర్గానికి చెందిన వ్యక్తులమనే భావాన్ని పెంపొందిస్తున్నాయి. అధ్యయంలో భాగంగా సుమారు 20వేల మంది క్రీడాభిమానుల. ఆటలు చూడని వారికంటే.. చూసేవాళ్ల మానసిక ఆరోగ్యం చురుకుగా ఉన్నట్లు కనుగొన్నాం’’ అని జపాన్‌లోని వాసెడా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ షింటారో సాటో తెలిపారు.
ఆటలు కేవలం ఆనందాన్ని ఇవ్వడమే కాదు.. మనలో ఒక సానుకూల భావాలను కలిగిస్తాయని, ఆటలను ప్రోత్సహించే వారి మెదడు నిర్మాణం కాలక్రమేణా అభివృద్ధి చెందుతున్నట్లు గమనించామని ప్రొఫెసర్ సాటో వెల్లడించారు. నేరుగా మైదానంలో ఆశ్వాదించలేని వారు ఇంట్లోనూ చూడటం వల్ల కూడా ప్రయోజనాలు పొందుతారని చెప్పారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి చూసినప్పుడు మరింత మెరుగైన ప్రయోజనాలుంటాయన్నారు. అలాగే జనాలతో కిక్కిరిసిన స్టేడియంలో కూర్చొని ఫుట్ బాల్, రగ్బీ, క్రికెట్ లాంటి ఆటలు చూసేవారిలో కూడా ఫలితాలు మెరుగ్గా ఉన్నాయని వివరించారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా వెంటనే స్పోర్ట్స్‌ను చూసేయండి మరి.
Also Read : Eye care tips: వేసవిలో ఒళ్లే కాదు.. కళ్లు కూడా జర భద్రం - ఈ పనులు అస్సలు చేయొద్దు, ఈ చిట్కాలు పాటించండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.