(Source: ECI/ABP News/ABP Majha)
The Sixth Ocean: భూమిని చీల్చుకుని పుడుతోన్న మరో మహా సముద్రం - ఆ దేశంలో భారీ పగుళ్లు, మరో ఖండం ఏర్పడనుందా?
భూమ్మీద మరో సముద్రం ఏర్పడబోతుందా? ఐదు మహాసముద్రాలకు మరొకటి తోడుకాబోతుందా? ఇప్పటికే కొత్త మహాసముద్రానికి బీజం పడిందా? అవుననే అంటున్నారు పరిశోధకులు.
Earth Get A New Ocean?: భూగ్రహం మీద ఇప్పటి వరకు 5 మహా సముద్రాలు ఉన్నాయి. అట్లాంటిక్ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం, దక్షిణ మహాసముద్రం గురించి చిన్నప్పటి నుంచే చదువుకుంటున్నాం. కానీ, వీటికి ఇప్పుడు మరో సముద్రం యాడ్ కాబోతుంది. భూగ్రహం మీది ఆరో సముద్రం అవతరించబోతోందా? ఈ విషయాన్ని పలువురు పరిశోధకులు బల్లగుద్ది మరీ చెప్తున్నారు.
ఆఫ్రికాలో కొత్త మహాసముద్రానికి బీజం పడిందా?
నిజానికి భూ అంతర్భాగంలో టెక్టోనిక్ ప్లేట్ల కదలిక అనేది సాధారణంగా కొనసాగుతుంది. భూమికి సంబంధించిన లిథోస్పియర్ ను రూపొందించే ఈ భారీ, దృఢమైన రాతి స్లాబ్‌లు స్థిరమైన కదలికలను కలిగి ఉంటాయి. కానీ, శాస్త్రవేత్తలు ఆఫ్రికా ఆగ్నేయ భాగంలో ఓ భారీ భూ చీలికను గుర్తించారు. ఈ చీలక నెమ్మదిగా ఆఫ్రికా ఖండాన్ని రెండుగా విభజించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదే సమయంలో ఆరవ మహాసముద్రం ఉద్భవిస్తుందని అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు, ఆరవ మహాసముద్రం ఏర్పడితే భూగ్రహం భౌగోళికంగా భారీ మార్పులకు గురయ్యే అవకాశం ఉందంటున్నారు.
22 మిలియన్ సంవత్సరాల క్రితమే ప్రారంభం?
సముద్ర చీలికగా భావిస్తున్నఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ సిస్టమ్ (EARS)ను 2005లో పరిశోధకులు గుర్తించారు. అయితే, ఈ చీలికకు బీజం సుమారు 22 మిలియన్ సంవత్సరాల క్రితం ప్రారంభం అయినట్లు భావిస్తున్నారు. ఈ చీలిక అనేది రెండు టెక్టోనిక్ ప్లేట్ల ఫలితంగా ఏర్పడినట్లు అభిప్రాయపడుతున్నారు. తూర్పున సోమాలి ప్లేట్, పశ్చిమాన నుబియన్ ప్లేట్ ఏర్పడడ్డాయని.. వీటి చీలిక రోజు రోజుకు పెరుగుతున్నట్లు వెల్లడించారు. చాలా సంవత్సరాల క్రితం దక్షిణ అమెరికా, ఆఫ్రికా వేర్వేరు ఖండాలుగా విడిపోయినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురయ్యిందంటున్నారు.
కొత్త మహాసముద్రం ఏర్పాటుకు 10 లక్షల సంవత్సరాలు పట్టే అవకాశం?
ఆఫ్రికాలో ఏర్పడిన లోతైన పగుళ్లు.. ఇథియోపియా, ఉగాండా దేశాలు ల్యాండ్ లాక్‌లో ఉన్నట్లు తెలిపారు. ఈ పగుళ్లు గల్ఫ్ ఆఫ్ ఏడెన్, ఎర్ర సముద్రం మీదుగా తూర్పు ఆఫ్రికా రిఫ్ట్ వ్యాలీలోకి ప్రవహిస్తాయి. ఈ ప్రాంతాలను చీల్చుకుంటూ కొత్త మహా సముద్రం ఏర్పడే అవకాశం ఉంది. అంతేకాదు, ఈ మహాసముద్రం కారణంగా తూర్పు ఆఫ్రికాలోని ఓ చిన్న ఖండంగా మారే అవకాశం ఉన్నట్లు అమెరికన్ భౌతిక శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. టెక్టోనిక్ ప్లేట్ల సంవత్సరానికి కొన్ని మిల్లీమీటర్లు దూరం జరుగుతాయని పరిశోధకులు వెల్లడించారు. అయితే, కొత్త మహా సముద్రంతో పాటు సరికొత్త ఖండం ఏర్పడటానికి సుమారు 5 నుంచి 10 లక్షల సంవత్సరాలు పడుతుందని వెల్లడించారు.
గతంలోనూ జర్మన్, ఇటాలియన్, అమెరికన్ ఉమ్మడి పరిశోధన బృందం సైతం కొత్త మహాసముద్రం ఏర్పడబోతున్నట్లు అభిప్రాయపడింది. భూమి ఎగువ, దిగువ ఆవరణ మధ్య భారీ పరిమాణంలో నీరు ఉన్నట్లు గుర్తించింది. భూమి ఉపరితలం నుంచి 660 కిలోమీటర్ల దిగువన ఏర్పడిన డైమండ్ ను విశ్లేషించి ఈ విషయాన్ని వెల్లడించింది. భూమి ఎగువ, దిగువ ఆవరణను వేరు చేసే సరిహద్దు పొర ట్రాన్సిషన్ జోన్ నుంచి ఈ సముద్రం ఉద్భవించే అవకాశం ఉందని అభిప్రాయపడింది.
Read Also: మామా నీ ‘టైమ్’ ఎంత? చంద్రుడికి టైమ్ జోన్ సెట్ చేస్తున్న నాసా, వైట్ హౌస్ కీలక ఆదేశాలు