అన్వేషించండి

Valentines Day: ప్రేమించండి, ప్రేమను పంచండి - ఇలా చెప్పినందుకే సెయింట్ వాలెంటైన్ ప్రాణాలు తీశారా?

వాలెంటైన్స్ డే వచ్చిందంటే వాలెంటైన్ ఎవరో తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తారు.

సెయింట్ వాలెంటైన్... ప్రేమికుల రోజు వచ్చిన ప్రతిసారి వినపడే పేరు. వాలెంటైన్ అనే వ్యక్తి ఈ ప్రేమికుల రోజుకు పునాది అని చెబుతారు. ఒక మత ప్రవక్త.. ప్రియుడిగా, ప్రేమకు చిహ్నంగా ఎలా మారాడు? దానికి అతను జీవించిన కాలంలో జరిగిన సంఘటనలు, ఎదురైన పరిస్థితులే కారణం. చరిత్ర ప్రకారం సెయింట్ వాలెంటైన్ మూడో శతాబ్దంలో జీవించాడు. అతడు రోమ్ నగరంలో నివసించేవాడు. ఆ కాలంలో రోమన్ రాజ్యాన్ని రెండో క్లాడియస్ అనే చక్రవర్తి పాలించేవాడు. ఆయన ఎంత స్వార్థపరుడంటే తనకు మంచి సైనికులు కావాలని ఎంతో కోరుకునేవాడు. అందుకోసం మగవారు పెళ్లిళ్లు చేసుకోకూడదని నియమాన్ని పెట్టాడు. దీనికి కారణం మగవారు పెళ్లి చేసుకుంటే బంధాలు, బంధుత్వాలతో బందీ అయిపోతారని, వారి ఆలోచనల్లో భార్యా పిల్లలే ఉంటారని, అప్పుడు మంచి సైనికులు కాలేరని ఆయన అభిప్రాయం. అందుకే పెళ్లిళ్లను నిషేధించారు. ఇది ఆ కాలంలో జీవించిన సెయింట్ వాలెంటైన్‌కు నచ్చలేదు. ఇలా పెళ్లిళ్లను నిషేధించడం సృష్టికే విరుద్ధమని ఆయన భావించాడు. పెళ్లిళ్లు చేసుకోమని ప్రజల్లో చైతన్య కార్యక్రమాలు నిర్వహించేవాడు. అంతే కాదు ఆ చక్రవర్తికి తెలియకుండా రహస్యంగా పెళ్లిళ్లు కూడా చేసేవాడు. ఈ విషయం చక్రవర్తి దాకా చేరింది.

జైల్లో కూడా...
విపరీతమైన అహం కలిగిన క్లాడియస్, వాలెంటైన్ చేసిన పనికి కోపోద్రిక్తుడయ్యాడు. వెంటనే అతడిని పట్టుకొని జైల్లో పెట్టమని, కొన్ని రోజులకు మరణశిక్ష విధించమని ఆదేశించాడు. దీంతో సైనికులు వాలంటైన్‌ను జైల్లో పెట్టారు.  ఆ జైలుకి చెందిన జైలర్ కూతురు తరచూ వాళ్ళ నాన్నను కలిసేందుకు వస్తుండేది. అలా ఆమెను చూసి వాలెంటైన్ ప్రేమలో పడ్డాడు. అలాగే తన ప్రేమను వ్యక్తపరుస్తూ ఒక లవ్ లెటర్ రాశాడు. అది జైలర్ వద్దకు చేరింది. దీంతో అతన్ని మరింత ముందుగా ఫిబ్రవరి 14నే శిక్ష విధించారు. వాలెంటైన్ ఫిబ్రవరి 14న మరణించడంతో వాలెంటైన్స్ డే ని కూడా అదే రోజు ప్రజలు చేసుకోవడం మొదలుపెట్టారు అని చెబుతారు.

అలాగే లూపర్ కాలియా అనే వేడుకను కూడా వాలెంటైన్స్ డే రోజే నిర్వహించుకునేవారు రోమన్లు. ఇందులో భాగంగా కాగితాలపై అమ్మాయిల పేర్లు రాసి ఒక బాక్స్‌లో వేసేవారు. అబ్బాయిలు వచ్చి ఒక్కో చీటీ తీసేవారు. ఆ చీటీలో ఏ అమ్మాయి పేరైతే ఉంటుందో ఆ అమ్మాయి ఈ పండుగలో అతనికి ప్రేయసిగా ఉండాలి. వారిద్దరికీ నచ్చితే భవిష్యత్తులో పెళ్లి కూడా చేసుకోవచ్చు. ఇది కూడా సెయింట్ వాలెంటైన్స్ చిహ్నంగానే జరుపుకుంటారని అంటారు. 

ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం ప్రేమికుల రోజుకు ఆదరణ ఎక్కువగానే ఉంది. ఎంతో మంది ప్రేయసి ప్రియులు తమ ప్రేమను వ్యక్తపరిచేందుకు వాలెంటెన్స్ డే కోసం ఏడాదంతా ఎదురుచూస్తూ ఉంటారు. అయితే చాలా చోట్ల ప్రేమికుల రోజుపై నిషేధం ఉంది. కొన్ని దేశాల్లో అధికారికంగా నిషేధం విధించనప్పటికి వాలెంటెన్స్ డే వ్యతిరేక దళం ఆ రోజున ప్రేమికులకు ఇబ్బందులు కలుగ చేస్తూనే ఉంటుంది. పాకిస్థాన్లో వాలెంటెన్స్ డే పై పూర్తిగా నిషేధం ఉంది. ఎందుకంటే ఇలాంటి రోజులు జరుపుకోవడం ఇస్లాంకు వ్యతిరేకంగా భావిస్తారు. సౌదీ అరేబియా కూడా ఈ దినోత్సవం పై నిషేధం విధించింది. ముస్లిం జనాభా అధికంగా ఉండే దేశాల్లో ఈ ప్రేమికుల రోజు పై వ్యతిరేకత ఎక్కువగా ఉంది. 

Also read: మీ ప్రేమను ఇలా అందంగా చాటి చెప్పండి - ఎవరి మనసైనా కరిగిపోతుంది

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget