By: Haritha | Updated at : 14 Feb 2023 01:27 PM (IST)
(Image credit: Pixabay)
ఫిబ్రవరి 14 ఎంతో ప్రత్యేకమైనది. ఆ రోజు కోసం ఎన్నో కళ్లు ఆశగా చూస్తుంటాయి. తమ గుండెల్లో దాచుకున్న ప్రేమను వెల్లువలా తన ప్రేయసి లేదా ప్రియుని పై కుమ్మరించాలని వారి ఆకాంక్ష. ఆ రోజు రానే వచ్చింది. వాలెంటైన్స్ డే రోజు మీరు మెచ్చిన వ్యక్తికి మీ మదిలోని ప్రేమను తెలియజేసేందుకు కింద మేము ఇచ్చిన శుభాకాంక్షల్లో మీకు నచ్చిన దాన్ని ఎంపిక చేసుకోండి.దాన్ని కాపీ చేసి వాట్సాప్ చేసేయండి. మీ ప్రేమ సులువుగా ఎదుటివారికి అర్ధమైపోతుంది. ప్రేమను అందంగా వర్ణించగలిగేది అమ్మ భాషలోనే. అందుకే ఇక్కడ అన్నీ తెలుగు కవితలనే అందించాం. మీ మనసుకు నచ్చినది ఎంచుకోండి.
1. కాలాలు మారవచ్చు
కలలు మారవచ్చు
కానీ నీపట్ల నా మనసులో ఉన్న
ప్రత్యేక స్థానం ఎప్పటికీ మారిపోదు
ప్రేమికుల రోజు శుభాకాంక్షలు
2. సెకను చాలు నీ గుండె సవ్వడి తెలుసుకోవడానికి
క్షణము చాలు నీ కంటిపాపలో నన్ను చూసుకోవడానికి
కానీ జీవితం కూడా సరిపోదు
నా ప్రేమను వ్యక్తం చేయడానికి
ఈ యుగం సరిపోదు
నా ప్రేమను నీకు పూర్తిగా పంచివ్వడానికి
ప్రేమికుల రోజు శుభాకాంక్షలు
Vale
3. నీవు లేని నిన్న నాకు శూన్యం
నీవు రాని రేపు నాకొక నరకం
నీవు లేని నిన్నను ఊహించలేను
నీవు రాని రేపు కోరుకోలేను
నీతో ఉన్న ఈ క్షణాలే నాకు స్వర్గం
ప్రియతమా... వాలెంటైన్స్ డే విషెస్
4. ప్రేమించిన వ్యక్తితో
జీవితాన్ని పంచుకోవడంలో
ఉండే ఆనందం వెలకట్టలేనిది
ప్రేమికుల రోజు శుభాకాంక్షలు
5. నా ఎద నిండా నీ రూపం నింపేస్తా
నీ మది నిండా నా ప్రేమను కురిపిస్తా
నీ తోడునై నిను ముందుకు నడిపిస్తా
నీ నీడనై నీ వెంట నేను నడిచొస్తా
నా ప్రేమను నీకు అందిస్తా
ప్రేమికుల రోజు శుభాకాంక్షలు
6. ఎవరికైనా జీవితకాలం అంటే
జనన మరణాల మధ్య కాలం
నాకు మాత్రం నీతో గడిపిన కాలమే
నా జీవిత కాలం
7. నన్ను నీ కళ్లలో పెట్టుకోకు
కన్నీళ్లలో కొట్టుకుపోతాను
గుండెలో ఉంచుకో
ప్రతి స్పందనకు గుర్తుంటాను
ప్రేమికుల రోజు శుభాకాంక్షలు
8. నిజమైన ప్రేమికులు
ఎప్పటికీ విడిపోరు
ఒకవేళ విడిపోతే అది ప్రేమ
అనిపించుకోదు
ప్రేమికుల రోజు శుభాకాంక్షలు
9. నా ప్రేమను తెలుపుతూ...
నీకొక రోజా పువ్వు ఇవ్వగలను
కానీ మొక్కకు పూవుని దూరం చేసి
నా ప్రేమకు ఒక పుష్పాన్ని బాధించలేను
నా ప్రేమకు గుర్తుగా ఒక రోజా మొక్కను నాటుతాను
ఆ మొక్కలా నా ప్రేమ కూడా వికసించాలని
హ్యాపీ వాలెంటైన్స్ డే
10. పరిస్థితుల్ని బట్టి మారిపోయేది ప్రేమ కాదు
పరిస్థితుల్ని అర్థం చేసుకునేది అసలైన ప్రేమ..
హ్యాపీ వాలెంటైన్స్ డే
11. నా బలం నువ్వే
నా బలహీనతా నువ్వే
నా సంతోషం నువ్వే
నా దు:ఖం నువ్వే
కాలాలు మారినా,
నిన్నెప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను.
12. బంధం నువ్వే - గ్రంధం నువ్వే
బాణం నువ్వే - గాయం నువ్వే
గానం నువ్వే - గేయం నువ్వే
వేదం నువ్వే - ఆవేదన నువ్వే
సాయం నువ్వే - ప్రాయం నువ్వే
దేహం నువ్వే - ప్రాణం నువ్వే
ఆశ నువ్వే -శ్వాస నువ్వే
ఆకాంక్ష నువ్వే - నాకు అన్నీ నువ్వే
13. ఈ ప్రపంచంలో నాకంటూ
విలువైనదేవీ లేదు
నీ నుండి పొందే ప్రేమ తప్ప
హ్యాపీ వాలెంటైన్స్ డే
14. కళ్లకు నచ్చినవారిని కనుమూసి తెరిచేలోపు మరిచిపోవచ్చు, కానీ
మనసుకు నచ్చిన వారిని మరణం వరకు మరిచిపోలేవు
నువ్వు నా మనసుకు నచ్చావు
ప్రేమికుల రోజు శుభాకాంక్షలు ప్రియతమా
Also read: ముద్దు ప్రేమని పెంచడమే కాదు - ఆరోగ్యాన్నీ పెంచుతుంది
Ice Apple: వేసవిలో ఐస్ యాపిల్స్ తింటే చాలా మంచిదట - ప్రయోజనాలివే!
World Tuberculosis Day: క్షయ వ్యాధి లక్షణాలేమిటీ? ఎవరికి ఎక్కువ ప్రమాదం?
Ramadan Food: రంజాన్ ఉపవాసం విరమించిన తర్వాత ఏయే ఆహార పదార్థాలు తీసుకుంటారో తెలుసా?
Haleem: హలీమ్ అంటే ఏంటి? ఎలా చేస్తారు? ఆరోగ్యానికి మంచిదేనా?
High Blood Pressure: అధిక రక్తపోటు అదుపులో ఉంచాలా? అయితే ఇవి తినండి, వీటిని తినకండి
YSRCP Reverse : దెబ్బ మీద దెబ్బ - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్సీపీకి నష్టం చేస్తున్నాయా ?
MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!
AP Cag Report : 13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు
రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ, మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల