News
News
X

కుక్కలతో జర భద్రం - ఈ సీజన్‌లో మరింత డేంజర్, ఈ జాగ్రత్తలు పాటించండి

సాధారణంగా కుక్క కాటు కేసులు ఎక్కువగా వేసవిలోనే కనిపిస్తాయి? కుక్కలు ఇలా వేసవిలోనే పేట్రేగిపోవడానికి కారణం ఏమిటి? కుక్క కరిస్తే ఏం చెయ్యాలి?

FOLLOW US: 
Share:

హైదరాబాద్‌లోని అంబర్ పేటలో నాలుగేళ్ల బాలుడు వీధి కుక్కల దాడిలో మరణించిన ఘటన ప్రజలను ఉలిక్కిపాటుకు గురిచేసింది. ఆ సమయంలో పిల్లాడి ఎంత బాధను అనుభవించి ఉంటాడనే బాధ ప్రతి ఒక్కరినీ వెంటాడింది. ఆ పిల్లాడి పరిస్థితి మరెవ్వరికీ రాకూడదంటే.. కనీస జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా పిల్లలను ఒంటరిగా వదలకూడదు. సాధారణంగా కుక్క కాటు కేసులు ఎక్కువగా వేసవిలోనే కనిపిస్తాయి? అసలు ఎందుకు కుక్కలు ఇలా వేసవిలోనే పేట్రేగిపోతాయి? ఇందుకు కారణం ఏమిటీ కుక్క కరిస్తే ఏం చెయ్యాలి? తదితర వివరాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. 

ఎండాకాలంలో ఎండ వేడి వల్ల కుక్కలు చాలా చికాకు పడుతుంటాయని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. ఆ మాటకు ఊతమిస్తున్నట్టే నారాయణగూడలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్‌లో కుక్కకాటుకు గురై చికిత్స కోసం వచ్చే వారి సంఖ్య కూడా పెరుగుతోందట. దాదాపుగా 250 నుంచి 300 మంది కుక్కకాటు చికిత్స కోసం వేసవిలో ప్రతి రోజు వస్తుంటారని అక్కడి అధికారులు అంటున్నారు.

మనుషుల లాగే కుక్కలు కూడా వేసవిలో వేడి తట్టుకోలేవని అందువల్ల కుక్కలు చాలా దూకుడుగా ఉంటాయని ‘సైకాలజీ టుడే’ అనే మ్యాగజైన్ కామెంట్ చేస్తోంది. వేసవిలో తిండి, నీళ్లు తగినంత దొరకనందువల్లే కుక్కల్లో ఇలాంటి స్థితి ఏర్పడుతుందని చెబుతున్నారు. డీహైడ్రేషన్ వల్ల వీధికుక్కలు ఎక్కువ మందిని కరుస్తాయట. వీధి కుక్కలు మాత్రమే ఇలా ఉంటాయనుకుంటే తప్పే. పెంపుడు కుక్కల్లో కూడా 28 శాతం వరకు వేసవిలో ఇలా అగ్రెసివ్ గా ఉంటాయని నిపుణులు హెచ్చిరిస్తున్నారు. వేసవిలో వీలైనంత వరకు కుక్కలకు దూరంగా ఉండడమే మంచిది. పెంపుడు కుక్కలైతే డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు వ్యాక్సిన్లు వేయించి జాగ్రత్తగా చూసుకోవాలి. వీధుల్లో కుక్కల బెడద ఎక్కువగా ఉన్నట్లయితే.. మున్సిపాలిటీ అధికారులకు ఫిర్యాదు చేయాలి. లేదా వాటి కోసం ప్రత్యేకంగా నీరు అందుబాటులో ఉంచాలి. దానివల్ల అవి డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉంటాయి. ప్రజలు కూడా సేఫ్. 

కుక్క కరిస్తే ఏం చేయాలి?

కుక్క కాటు చిన్నగా ఉన్నపుడు ఇంట్లోనే చికిత్స తీసుకోవచ్చు. కానీ డాక్టర్ ను తప్పనిసారిగా డాక్టర్ ను సంప్రదించాలి. కుక్కకాటు గాయాలు చాలా బలంగా, పెద్దగా ఉన్నపుడు అత్యవసర చికిత్స అవసరం అవుతుంది. కుక్కకాటు గాయాన్ని వెంటనే నీటితో శుభ్రపరచాలి, పదినిమిషాల పాటు ధారగా పడుతున్న నీటి కింద గాయాన్ని కడగాలి. తర్వాత రెండు మూడు చుక్కల హైడ్రోజన్ పెరాక్సైడ్ ద్రావణంతో కడగాలి. శుభ్రమైన గుడ్డతో గాయాన్ని సున్నితంగా తుడవాలి. అందుబాటులో ఉన్న యాంటీ బయోటిక్ క్రీమ్ రాయాలి. స్టెరైల్ బ్యాండేజ్‌ని గాయం చుట్టూ గట్టిగా కాకుండా కట్టాలి.

లోతైన గాయాలైతే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. గాయాన్ని డాక్టర్ పరిశీలించాక బ్యాండేజ్‌ని రోజుకు కనీసం మూడుసార్లైనా మార్చుతూ ఉండాలి. గాయాన్ని గమనిస్తూ ఉండాలి. దురద వస్తుందా, ఎర్రగా అవుతోందా, చెమట పడుతోందా, నొప్పి పెరుగుతోందా, జ్వరం వస్తోందా వంటివి గమనిస్తూ డాక్టర్ సలహాలు పాటించాలి. వెంటనే గాయాలకు చికిత్స అందించకుంటే చాలా రకాల ఇన్ఫెక్షన్లకు కారణం కావచ్చు. కొన్ని సార్లు రేబీస్ వంటి ప్రాణాంతక ప్రమాదాలకు కుక్కకాటు కారణం అవుతుంది. కనుక రేబీస్ సోకకుండా యాంటీ రేబీస్ ఇంజెక్షన్ ఇస్తారు. కరిచిన కుక్కను బట్టి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. గాయం మానడానికి 7 రోజుల నుంచి కొన్ని నెలలు పట్టవచ్చు.

ఇన్ఫెక్షన్ సోకిందని ఎలా తెలుసుకోవాలి?

కుక్క కరిచిన చోట తీవ్రమైన నొప్పి, వాపుతో పాటు గాయం చుట్టూ ఎర్రగా మారుతుంది. ఈ గాయం నుంచి ఆగకుండా రక్తస్రావం అవుతుంది. చీము కూడా పట్టొచ్చు. గాయం చుట్టూ తిమ్మిరిలా అనిపిస్తుంది. జ్వరం, తల తిరగడం, చెమట ఎక్కువగా పోయడం వంటి లక్షణాలు కనిపిస్తే ఇన్ఫెక్షన్ సోకిందని అనుమానించాల్సిందే. కాబట్టి కుక్క కరిచిన తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తే, వెంటనే డాక్టర్‌ను కలవడం మంచిది.

Published at : 23 Feb 2023 07:04 AM (IST) Tags: DOG dog bite rise of dog bites in summer

సంబంధిత కథనాలు

Banana Coffee: సోషల్ మీడియాలో కొత్త ట్రెండ్ బనానా కాఫీ- ఇది ఎలా తయారు చేస్తారంటే!

Banana Coffee: సోషల్ మీడియాలో కొత్త ట్రెండ్ బనానా కాఫీ- ఇది ఎలా తయారు చేస్తారంటే!

ఆ వ్యక్తి గొంతులో మొక్కలు మొలిచేశాయ్, ఇదో విచిత్రమైన ఆరోగ్య సమస్య - ప్రపంచంలోనే ఇది తొలికేసు

ఆ వ్యక్తి గొంతులో మొక్కలు మొలిచేశాయ్, ఇదో విచిత్రమైన ఆరోగ్య సమస్య - ప్రపంచంలోనే ఇది తొలికేసు

Diabetes: ఓట్స్ ఇడ్లీ - డయాబెటిస్ వారి కోసం ప్రత్యేకం ఈ బ్రేక్‌ఫాస్ట్

Diabetes: ఓట్స్ ఇడ్లీ - డయాబెటిస్ వారి కోసం ప్రత్యేకం ఈ బ్రేక్‌ఫాస్ట్

రోటీని నేరుగా మంట మీద కాల్చడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా?

రోటీని నేరుగా మంట మీద కాల్చడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా?

Ragi Cake Recipe: రాగి పిండితో చేసే ఆరోగ్యకరమైన చాక్లెట్ కేక్ - పిల్లలకు హెల్తీ రెసిపీ

Ragi Cake Recipe: రాగి పిండితో చేసే ఆరోగ్యకరమైన చాక్లెట్ కేక్ - పిల్లలకు హెల్తీ రెసిపీ

టాప్ స్టోరీస్

YS Sharmila: బండి సంజయ్, రేవంత్ రెడ్డికి షర్మిల ఫోన్ - ఏం మాట్లాడుకున్నారంటే?

YS Sharmila: బండి సంజయ్, రేవంత్ రెడ్డికి షర్మిల ఫోన్ - ఏం మాట్లాడుకున్నారంటే?

శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో టెన్షన్ టెన్షన్ - పల్లె రఘునాథ్ రెడ్డి వర్సెస్‌ శ్రీధర్ రెడ్డి

శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో టెన్షన్ టెన్షన్ - పల్లె రఘునాథ్ రెడ్డి వర్సెస్‌ శ్రీధర్ రెడ్డి

నిజామాబాద్‌లో ఫ్లెక్సీ వార్- నిన్న పసుపు బోర్డుపై బీఆర్‌ఎస్‌ సైటర్‌- నిరుద్యోగ భృతి ఎక్కడా అంటూ బీజేపీ కౌంటర్

నిజామాబాద్‌లో ఫ్లెక్సీ వార్- నిన్న పసుపు బోర్డుపై బీఆర్‌ఎస్‌ సైటర్‌-  నిరుద్యోగ భృతి ఎక్కడా అంటూ బీజేపీ కౌంటర్

Tollywood: మహేశ్ తర్వాత నానినే - మిగతా స్టార్స్ అంతా నేచురల్ స్టార్ వెనుకే!

Tollywood: మహేశ్ తర్వాత నానినే - మిగతా స్టార్స్ అంతా నేచురల్ స్టార్ వెనుకే!