అన్వేషించండి

Life Style: కోపం వస్తే కాళ్లు చేతులు ఎందుకు వణుకుతాయి? నియంత్రించుకోవడం ఎలా?

Anger Control Tips: కోపం రావడం నార్మల్. అయిన కొందరు దాన్ని నియంత్రించుకుంటే మరికొందరు బయటపడుతుంటారు. అయితే కొందరు కోపంతో ఊగిపోతుంటారు. ఎందుకలా జరుగుతుందీ?

Body Shaking During Anger Causes : కోపం... మనిషిలో కనిపించే సాధారణ భావోద్వేగం. మనకు నచ్చని ఎవరైనా చేసినా ఇష్టం లేని విషయం చూసినా, లేకుండా చిన్న వివాదం వచ్చినా కోపంతో చాలా ఊగిపోతుంటారు. వాళ్లు కాళ్లు చేతులు గజగజ వణికిపోతాయి. భయంతో వణికిపోవడం వేరు, కోపంతో వణికిపోవడం వేరు. రెండింటికీ చాలా తేడా ఉంది. 

కోపంతో ఊగిపోవాళ్లు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తుంటారు. చేతిలో ఏది ఉంటే దాన్ని విసిరేస్తుంటారు. నేలకేసి కొడుతుంటారు. మీది మీదికి వస్తుంటారు. కోపంలో వారిని వారు నియంత్రించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇంతకీ కోపం  వచ్చిన వ్యక్తిలో ఎలాంటి మార్పులు జరుగుతాయి. ఆవేశం వచ్చినప్పుడు మనుషులు ఎందుకు ఊగిపోతారు. వణికిపోతుంటారు. 

కోపం వస్తే చేతులు, కాళ్లు ఎందుకు వణుకుతున్నాయి?

1. అడ్రినలిన్ హార్మోన్ విడుదల 
కోపంగా ఉన్నప్పుడు శరీరం ఫైట్‌ మోడ్‌లోకి వెళ్తుంది. మెదడుకు సంకేతాలు వెళ్లిన వెంటనే ప్రతి చర్యగా ఆడ్రినలిన్ హార్మోన్‌ విడుదల అవుతుంది. ఇది ప్రతికూల పరిస్థితి ఎదురైనప్పుడు అక్కడ ఉండి ఫైట్ చేయడమా లేకుండా అక్కడి నుంచి వెళ్లిపోవడమా అనే స్థితిలో ఉంటుంది. కొందరు కోపం వస్తే అక్కడి నుంచి వెళ్లిపోతారు. మరికొందరు అక్కడే ఉండి అవతలి వ్యక్తితో తలపడతారు. కోపంతో ఊగిపోతారు. దీనికి ఈ అడ్రినలిన్ హార్మోన్ ప్రధాన కారణం. ఇది ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి స్థితి ఉంటుంది. శరీరం వణుకుతుంది, కాళ్లు చేతులు వణుకుతూ ఉంటాయి. అడ్రినలిన్ తక్కువగా ఉంటే గొడవ జరిగినప్పుడు కోపం వచ్చినప్పటికీ వ్యక్తి స్పాట్ నుంచి వెళ్లిపోతాడు. అంతే కానీ ఎదురు నిలబడి పోరాడే ధైర్యం చేయడు. 

2. కండరాల ఒత్తిడి
కోపం సమయంలో కండరాలు బిగుసుకుపోతాయి. దీని వల్ల చేతులు, కాళ్లు, శరీరం వణుకుతాయి. కోపంతో నియంత్రణను కోల్పోయినప్పుడు ఇలా తరచుగా జరుగుతుంది. అటువంటి పరిస్థితిలో అనేక సమస్యలు తలెత్తుతాయి. ఆ వ్యక్తి ఏం చేస్తాడో తెలియని పరిస్థితి ఉంటుంది. 

3. హృదయ స్పందన రేటు పెరుగుదల
కోపం వచ్చినప్పుడు, హృదయ స్పందన కూడా పెరుగుతుంది, ఇది రక్త ప్రసరణ పెంచుతుంది. దీని కారణంగా, చేతులు, శరీరంలో ఓ విధమైన వణుకు వస్తుంది. గుండె కొట్టుకునే వేగం పెరగడంతో శరీరంలో ఉత్సాహం పెరుగుతుంది, ఇది నియంత్రణ కోల్పోయే అనుభూతికి తీసుకెళ్తుంది. ఆ టైంలో మెదడు ఆలోచన కోల్పోయి మనిషి ఏం చేస్తాడో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. 

 4. ఒత్తిడి లేదా ఆందోళన
కోపం తరచుగా ఒత్తిడి, ఆందోళనతో ముడిపడి ఉంటుంది. ఒక వ్యక్తి ఎక్కువ కాలం ఒత్తిడిలో ఉన్నప్పుడు కోపంగా లేదా చిరాకుగా ఉంటాడు. అటువంటి స్థితిలో శరీరం ,చేతులు, కాళ్ళు వణుకుతున్నాయి. మానసిక, శారీరక అలసట వల్ల కూడా ఇది జరగవచ్చు.

 కోపంలో కాళ్లు, చేతులు వణుకులేకుండా ఎలా నియంత్రించాలి
1. మీకు కోపం వచ్చినప్పుడు దీర్ఘ శ్వాస తీసుకోండి. ఇది శరీరంలో ఆక్సిజన్ స్థాయిని పెంచుతుంది. కోపాన్ని, వణుకును తగ్గిస్తుంది. 
2. ప్రతిరోజూ ధ్యానం చేయడం అలవాటు చేసుకోండి. ఎలాంటి పరిస్థితిలోనైనా ప్రశాంతంగా ఉండేలా ప్రయత్నించండి. దీంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది.
3. రోజూ వ్యాయామం చేయడం దినచర్యగా మార్చుకోండి. 
4. కోపంతో చేతులు, కాళ్లు వణికిపోతుంటే కాసేపు ఆగి నీళ్లు తాగడం మంచిది. దీని వల్ల మేలు జరుగుతుంది. 
5. కోపంతో శరీరం, చేతులు వణుకుట ఒక సాధారణ ప్రతిచర్య కానీ ఏ స్థాయి వరకు దాన్ని మన కంట్రోల్‌లో ఉంచుకోవచ్చో తెలుసుకోవాలి. ఎందుకు కోపం వస్తుంది. ఎందుకు అలాంటి పరిస్థితి వస్తుందో గ్రహించాలి. ఫలితంగా వాటిని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలి.

హెచ్చరిక: వార్తలలో ఇచ్చిన కొంత సమాచారం మీడియా నివేదికల ఆధారంగా ఉంటుంది. ఏదైనా సూచనను అమలు చేయడానికి ముందు, మీరు తప్పనిసరిగా సంబంధిత నిపుణులను సంప్రదించాలి. 

Also Read: ఉసిరికాయలను ఇలా తీసుకుంటే డయాబెటిస్ కంట్రోల్ అవుతుందట

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News: నడిరోడ్డుపై ఉరి తీస్తే బుద్ది వస్తుంది- ఆడపిల్లలపై చెయ్యి వేసే వాళ్లకు చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్
నడిరోడ్డుపై ఉరి తీస్తే బుద్ది వస్తుంది- ఆడపిల్లలపై చెయ్యి వేసే వాళ్లకు చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్
Revanth To Modi: మోడీగారూ మీరు చెప్పేవన్నీ అబద్దాలే ఇవిగో నిజాలు - తెలంగాణ సీఎం రేవంత్ రిప్లై వైరల్
మోడీగారూ మీరు చెప్పేవన్నీ అబద్దాలే ఇవిగో నిజాలు - తెలంగాణ సీఎం రేవంత్ రిప్లై వైరల్
YS Sharmila: ఉచిత సిలిండర్లు అని గప్పాలు, కరెంట్ ఛార్జీల పెంపుతో వాతలు - ప్రభుత్వంపై షర్మిల సెటైర్లు
ఉచిత సిలిండర్లు అని గప్పాలు, కరెంట్ ఛార్జీల పెంపుతో వాతలు - ప్రభుత్వంపై షర్మిల సెటైర్లు
EID 2025 Releases: రంజాన్ బరిలో రసవత్తరమైన పోరు - పవన్ కళ్యాణ్ VS సల్మాన్ ఖాన్ VS మోహన్ లాల్!
రంజాన్ బరిలో రసవత్తరమైన పోరు - పవన్ కళ్యాణ్ VS సల్మాన్ ఖాన్ VS మోహన్ లాల్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మహిళలు ఒకరి మాటలు వినకూడదు, తాలిబన్ల వింత రూల్స్లెబనాన్‌లోని బీరట్‌ సిటీపై దాడులు చేసిన ఇజ్రాయేల్Kithampeta Village No Diwali Celebrations |  70ఏళ్లుగా దీపావళి పండుగకు దూరమైన కిత్తంపేట | ABP DesamKTR Padayatra Announced | పాదయాత్ర చేస్తానన్న కేటీఆర్..గులాబీ పార్టీ కొత్త అధినేతగా అడుగులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News: నడిరోడ్డుపై ఉరి తీస్తే బుద్ది వస్తుంది- ఆడపిల్లలపై చెయ్యి వేసే వాళ్లకు చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్
నడిరోడ్డుపై ఉరి తీస్తే బుద్ది వస్తుంది- ఆడపిల్లలపై చెయ్యి వేసే వాళ్లకు చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్
Revanth To Modi: మోడీగారూ మీరు చెప్పేవన్నీ అబద్దాలే ఇవిగో నిజాలు - తెలంగాణ సీఎం రేవంత్ రిప్లై వైరల్
మోడీగారూ మీరు చెప్పేవన్నీ అబద్దాలే ఇవిగో నిజాలు - తెలంగాణ సీఎం రేవంత్ రిప్లై వైరల్
YS Sharmila: ఉచిత సిలిండర్లు అని గప్పాలు, కరెంట్ ఛార్జీల పెంపుతో వాతలు - ప్రభుత్వంపై షర్మిల సెటైర్లు
ఉచిత సిలిండర్లు అని గప్పాలు, కరెంట్ ఛార్జీల పెంపుతో వాతలు - ప్రభుత్వంపై షర్మిల సెటైర్లు
EID 2025 Releases: రంజాన్ బరిలో రసవత్తరమైన పోరు - పవన్ కళ్యాణ్ VS సల్మాన్ ఖాన్ VS మోహన్ లాల్!
రంజాన్ బరిలో రసవత్తరమైన పోరు - పవన్ కళ్యాణ్ VS సల్మాన్ ఖాన్ VS మోహన్ లాల్!
Telangana Half Day School: తెలంగాణలో ఒంటిపూట బడులు, సమ్మర్ కాకున్నా ఇప్పుడు ఎందుకంటే!
తెలంగాణలో ఒంటిపూట బడులు, సమ్మర్ కాకున్నా ఇప్పుడు ఎందుకంటే!
Andhra Pradesh News: మంచి రోజులు వచ్చాయి- మంచి రోడ్లు వస్తాయి- కానీ ప్రజలు చేయాల్సింది ఒక్కటే: చంద్రబాబు 
మంచి రోజులు వచ్చాయి- మంచి రోడ్లు వస్తాయి- కానీ ప్రజలు చేయాల్సింది ఒక్కటే: చంద్రబాబు 
Prashant Kishor: నా ఫీజు వంద కోట్లు - ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రకటన !
నా ఫీజు వంద కోట్లు - ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రకటన !
Asad Vs BJP: టీటీడీ బోర్డుతో వక్ఫ్ బిల్లును పోల్చిన అసదుద్దీన్ ఓవైసీ - ఘర్ వాపసీకి స్వాగతిస్తామని బీజేపీ కౌంటర్
టీటీడీ బోర్డుతో వక్ఫ్ బిల్లును పోల్చిన అసదుద్దీన్ ఓవైసీ - ఘర్ వాపసీకి స్వాగతిస్తామని బీజేపీ కౌంటర్
Embed widget