అన్వేషించండి

Curd: పెరుగు భోజనానికి ముందు తింటే మంచిదా? లేక తరువాత తింటే మంచిదా?

చలికాలంలో పెరుగు తినడం వల్ల జలుబు, దగ్గు వస్తాయని అంటారు. అది ఎంతవరకు వాస్తవం.

పెరుగు ఆరోగ్యానికి ఎంత మంచిదో అందరికీ తెలిసిందే. కొన్ని రకాల స్నాక్స్, టిఫిన్స్, కూరల్లో పెరుగు వేసుకొనిదే వాటికి రుచి రాదు. భారతీయులకి అయితే పెరుగు ఆహారంలో విడదీయరాని భాగం. పెరుగుతో భోజనం ముగించనిదే కొందరికి కడుపు నిండినట్టు అనిపించదు. అందుకే తప్పనిసరిగా పెరుగు ఇళ్ళల్లో ఉండాల్సిందే. అయితే పెరుగు ఎప్పుడు తీసుకోవాలి, చలికాలంలో పెరుగు తీసుకుంటే ఆరోగ్య సమస్యలు ఏవైనా వస్తాయా అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి. వాస్తవానికి చలికాలంలో పెరుగు తినడం కూడా మంచిదే.

రోజు పెరుగు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

పెరుగు రోజువారీ ఆహారంలో ఒక ముఖ్యమైన భాగం. పెరుగు కడుపుని చల్లగా ఉంచడమే కాదు శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది. రోజు పెరుగు తినడం వల్ల జీవక్రియని వేగవంతమ చేయడంలో సహాయపడుతుంది. ఆహారం నుండి పోషకాలని శోషించుకుంటుంది. ఎముకల ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తుంది. పేరుగులో ఉండే ప్రోబయాటిక్స్, ప్రీబయాటిక్స్ ఉండటం వల్ల పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. జీర్ణక్రియని మెరుగుపరిచి, మంటని తగ్గిస్తుంది.

పెరుగు ఎప్పుడు తినాలి?

ఆయుర్వేదం ప్రకారం కూడా పెరుగు తినడానికి నిర్ధిష్ట సమయం ఉంటుంది. పెరుగు భోజనానికి ముందు తినడం మంచిదని కొత్త అధ్యయనం వెల్లడించింది. విస్కాన్సిన్ మాడిసన్ విశ్వవిద్యాలయం జీవక్రియ పరిస్థితులపై చేసిన పరిశోధన ప్రకారం భోజనం తర్వాత తినడం కంటే పెరుగు భోజనానికి ముందు తినడం మంచి ఆలోచన అని చెప్తున్నారు. భోజనానికి ముందు పెరుగు తినే స్త్రీలు గత ఇన్ఫ్లమేషన్లో గణనీయమైన మార్పులు గుర్తించినట్టు తెలిపారు. దీని వల్ల జీర్ణక్రియ మెరుగుపడిందని పరిశోధకులు కనుగొన్నారు.

చలికాలంలో పెరుగు తీసుకోకూడదా?

పెరుగు చలికాలంలో తీసుకుంటే దాని చల్లదనం వల్ల జలుబు, దగ్గు వంటివి వస్తాయని అంటారు. అయితే అదంతా అపోహ మాత్రమే అని వైద్యులు కొట్టి పడేస్తున్నారు. చలికాలంలో పెరుగు తినాలని అనుకుంటే దానిలో తేనె, నల్ల మిరియాలు లేదా వేయించిన జీలకర్ర పొడి కలుపుకుని తీసుకోవచ్చు. ఇది ఆరోగ్యాన్ని సురక్షితంగా చేస్తుంది. శరీరానికి అవసరమైన శక్తిని ఇవ్వడంలో సహాయపడుతుంది. శరీరంలో శ్లేష్మం ఏర్పడతాన్ని తగ్గిస్తుంది. జీర్ణక్రియ, మలబద్ధకం సమస్యని నివారిస్తుంది.

చలికాలంలో పెరుగు తినడం వల్ల ప్రయోజనాలు

పెరుగులో విటమిన్స్ తో పాటు పొటాషియం, మెగ్నీషియం, ప్రోటీన్ ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ సి జలుబు, దగ్గుని నియంత్రిస్తుంది. కడుపులో ఎసిడిటీ ఏర్పడకుండా pH స్థాయిని సమతుల్యం చేస్తుంది. ఇది తక్కువ కొవ్వు, కేలరీలు కలిగి ఉండటం వల్ల బరువు పెరుగుతారనే భయం కూడా అక్కర్లేదు. చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది. చలికాలంలో పెరుగు తీసుకున్నా, చర్మానికి రాసుకున్నా మంచిదే.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also read: ఈ నాలుగు పదార్థాలతో మీ తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు

టాప్ హెడ్ లైన్స్

Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Breastfeeding Myths vs Facts : తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
Embed widget