అన్వేషించండి

Heart Attack: యువతలో పెరుగుతున్న గుండెపోటు మరణాలు - ఈ లక్షణాలు కనిపిస్తే అప్రమత్తం కావాల్సిందే!

గతంలో వృద్ధులకే పరిమితమైన గుండెపోటు ముప్పు, ఇప్పుడు యువతను కలవరపెడుతోంది. 30 ఏళ్ల యువకులు సైతం గుండెపోటుతో చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది.

Young People To Have A Heart Attack: గుండెపోటు ముప్పు ఒకప్పుడు 50 ఏండ్లు పైబడిన వారిలోనే కనిపించేది. కానీ, ఇప్పుడు వయసుతో సంబంధ లేకుండా గుండెపోటు ప్రాణాలను తీస్తోంది. గత కొద్దికాలంగా గుండెపోటుతో సిద్ధార్థ్ శుక్లా (40), పునీత్ రాజ్‌కుమార్ (46) లాంటి నటులు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో గుండెపోటు అనేది వయసుతో సంబంధం లేకుండా వస్తున్నదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హార్ట్ ఎటాక్  ఏ వయసులోని వారికి ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉందంటున్నారు. గుండెపోటు ప్రారంభ లక్షణాల గురించి అవగాహన తెచ్చుకోవడంతో పాటు ప్రాణాలు కాపాడుకోవాలని సూచిస్తున్నారు.   

యువత గుండెపోటుకు ఎందుకు గురవుతున్నారు?

గత కొంతకాలంగా వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు వేధిస్తోంది. జీవన విధానంలో మార్పులు, అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, ఊబకాయం, ధూమపానం, మద్యపానం, ఒత్తిడి సహా పలు కారణాలతో యువతలో గుండెపోటు సమస్య తీవ్రం అవుతున్నది. కొన్నిసార్లు యువతలోని అంతర్లీన ఆరోగ్య పరిస్థితులు కూడా గుండెపోటుకు దారితీస్తున్నాయి. కోవిడ్-19 మహమ్మారి సోకిన యువతలో గుండెపోటు ముప్పు మరింత ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు వెల్లడిస్తున్నారు.  గుండెపోటుతో చనిపోయిన యువతలో ఎక్కువగా కరోనా సోకినవారే ఉన్నట్లు పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. అంతేకాదు, కరోనా ప్రారంభం తర్వాత అమెరికా సహా పలు దేశాల్లో అన్ని వయసుల వారిలో గుండెపోటు మరణాలు గణనీయంగా పెరిగినట్లు వెల్లడిస్తున్నాయి. ఈ మరణాలు 25 నుంచి 44 సంవత్సరాల వయస్సు గలవారిలో ఎక్కువగా కనిపిస్తున్నాయని పరిశోధకులు వెల్లడించారు. వృద్ధులతో పోలిస్తే మరణాల రేటు 23 నుంచి 34% పెరిగినట్లు వివరించారు.   

యువతలో గుండెపోటు లక్షణాలు   

గుండెపోటుకు సంబంధించిన లక్షణాల విషయానికి వస్తే ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి మారే అవకాశం ఉంటుంది.  ఈ లక్షణాలు స్త్రీ, పురుషులలో భిన్నంగా ఉంటాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. గుండెపోటుకు సంబంధించి కొన్ని సాధారణ లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

1. ఛాతీలో నొప్పి లేదంటే అసౌకర్యం

2. మెడ, దవడ, చేతులతో సహా ఛాతి పైభాగంలో నొప్పి

3. శ్వాస ఆడకపోవడం

4. కళ్లు మసకగా కనిపించడం  

5. చల్లని చెమటలు పట్టడం

6. విపరీతమైన అలసట

7. వికారం, వాంతులు

8. తీవ్రమైన ఆందోళన, భయం

9. లో ఫీవర్  

గుండెపోటు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు

గుండెపోటు వచ్చిన సమయంలో తీసుకునే తక్షణ చర్యలు వ్యక్తి మరణాన్ని ఆపే అవకాశం ఉంటుంది.  గుండెపోటు సమయంలో వెంటనే వైద్యులకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించాలి. ఈ సమయంలో ఆస్పిరిన్‌ ను నమలడం లేదంటే మింగడం వల్ల గుండెపోటు నుంచి ప్రాణాలు కాపడుకునే అవకాశం ఉంటుంది. గుండెపోటుతో బాధపడుతున్న వ్యక్తి స్పందించకపోతే కార్డియోపల్మోనరీ రిససిటేషన్ (CPR) చేయాలి. మెరికన్ హార్ట్ అసోసియేషన్ (AHA) ప్రకారం, ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ ఉన్నవారిని ప్రాణాపాయం నుంచి కాపాడేందుకు CPR చేయడం ఉత్తమమైన మార్గం అని సూచిస్తున్నది. CPR అనేది మనిషి మరణాన్ని సమర్థవంతంగా అడ్డుకునే అవకాశం ఉంటుంది. CPR చేస్తూనే గుండెపోటు సోకిన వ్యక్తిని సమీప ఆస్పత్రికి తరలించడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

Read Also: ఎవరికైనా గుండెపోటు వస్తే వెంటనే ఇలా చేయండి, ప్రాణం కాపాడినట్టే

టాప్ హెడ్ లైన్స్

Eating on Time : టైమ్‌కి తింటున్నారా? ఆలస్యంగా భోజనం చేస్తే వచ్చే సమస్యలివే.. సమయానికి తింటే ఎన్ని లాభాలో తెలుసా?
టైమ్‌కి తింటున్నారా? ఆలస్యంగా భోజనం చేస్తే వచ్చే సమస్యలివే.. సమయానికి తింటే ఎన్ని లాభాలో తెలుసా?
Henna for Grey Hair : తెల్లజుట్టుకు సహజమైన రంగు కావాలా? హెన్నాలో ఈ 5 పదార్థాలు కలిపి అప్లై చేయండి
తెల్లజుట్టుకు సహజమైన రంగు కావాలా? హెన్నాలో ఈ 5 పదార్థాలు కలిపి అప్లై చేయండి
Snoring in Men : గురకను తేలిగ్గా తీసుకోకండి? పురుషుల్లో అది స్లీప్ అప్నియా కావచ్చు.. ఈ సంకేతాలను గమనించండి
గురకను తేలిగ్గా తీసుకోకండి? పురుషుల్లో అది స్లీప్ అప్నియా కావచ్చు.. ఈ సంకేతాలను గమనించండి
Calcium and Protein Rich Foods : కాల్షియం, ప్రోటీన్ కోసం వీటిని తినండి.. పాలు తాగడం ఇష్టం లేనివారికి బెస్ట్ ఆప్షన్స్ ఇవే
కాల్షియం, ప్రోటీన్ కోసం వీటిని తినండి.. పాలు తాగడం ఇష్టం లేనివారికి బెస్ట్ ఆప్షన్స్ ఇవే

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bellampalli Police Video: బెల్లంపల్లి పోలీసుల ఫామ్ హౌస్ పార్టీ కలకలం.. రామగుండం సీపీ విచారణకు ఆదేశం
బెల్లంపల్లి పోలీసుల ఫామ్ హౌస్ పార్టీ కలకలం.. రామగుండం సీపీ విచారణకు ఆదేశం
Harish Rao: కాంగ్రెస్ మేనిఫెస్టోకు మూడేళ్లు.. అభయహస్తం మొండి హస్తంగా మారింది- హరీష్ రావు విమర్శలు
కాంగ్రెస్ మేనిఫెస్టోకు మూడేళ్లు.. అభయహస్తం మొండి హస్తంగా మారింది- హరీష్ రావు విమర్శలు
US Federal Court Visa Ruling: ట్రంప్‌నకు బిగ్ షాక్.. విదేశీ విద్యార్థులు, జర్నలిస్టులకు భారీ ఊరట.. వీసా ఆంక్షలు ఆర్డర్ కొట్టివేసిన ఫెడరల్ కోర్టు!
ట్రంప్‌నకు బిగ్ షాక్.. విదేశీ విద్యార్థులు, జర్నలిస్టులకు భారీ ఊరట.. వీసా ఆంక్షలు ఆర్డర్ కొట్టివేసిన ఫెడరల్ కోర్టు!
Shubman Gill Strategy:  కివీస్ తో తొలి టెస్టుకు కెప్టెన్ గిల్ మాస్టర్ ప్లాన్.. ఆ ఫార్ములాతో బరిలోకి టీమిండియా,  పంత్ ఫామ్‌పై కీలక ప్రకటన
కివీస్ తో తొలి టెస్టుకు కెప్టెన్ గిల్ మాస్టర్ ప్లాన్.. ఆ ఫార్ములాతో బరిలోకి టీమిండియా,  పంత్ ఫామ్‌పై కీలక ప్రకటన
Amaravati Financial Plan: అమరావతి నిర్మాణానికి 20 ఏళ్ల ఆర్థిక ప్రణాళిక.. రూ. 27,954 కోట్ల ఆర్థిక లోటు.. నిధుల కోసం ఉన్నత స్థాయి కమిటీ!
అమరావతి నిర్మాణానికి 20 ఏళ్ల ఆర్థిక ప్రణాళిక.. రూ. 27,954 కోట్ల ఆర్థిక లోటు.. నిధుల కోసం ఉన్నత స్థాయి కమిటీ!
Khairatabad By-Election Suspense: ఖైరతాబాద్ ఉపఎన్నిక ఉంటుందా, ఉండదా? విజయారెడ్డి పిటిషన్‌కు చింతల రామచంద్రారెడ్డి చెక్ పెడతారా?
ఖైరతాబాద్ ఉపఎన్నిక ఉంటుందా, ఉండదా? విజయారెడ్డి పిటిషన్‌కు చింతల రామచంద్రారెడ్డి చెక్ పెడతారా?
Rahul Gandhi Fake Name: మారు పేరుతో రాహుల్ గాంధీని చదివించా.. రాజీవ్ గాంధీ హత్య రోజులను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ
మారు పేరుతో రాహుల్ గాంధీని చదివించా.. రాజీవ్ గాంధీ హత్య రోజులను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ
Cyclone Akvan: తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం, పలు జిల్లాలకు మరో ముప్పు.. మత్స్యకారులకు వార్నింగ్
తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం, పలు జిల్లాలకు మరో ముప్పు.. మత్స్యకారులకు వార్నింగ్
Embed widget