రైస్ టీ ఎప్పుడైనా తాగారా? ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే ఆశ్చర్యపోతారు
రైస్ టీ అనే మాట వినగానే ఆశ్చర్యంగా అనిపించినా.. అది మీకు బోలెడంత ఆరోగ్యాన్ని ఇస్తుందట.
బియ్యంతో టీ?
రైస్ టీ పేరు వినగానే ఆశ్చర్యపోతున్నారా? బియ్యంతో టీ ఏమిటని షాకవుతున్నారా? అయితే, దీని ప్రయోజనాలు తెలిసిన తర్వాత మీరు తప్పకుండా ఈ టీ తాగేందుకు ప్రయత్నిస్తారు. రైస్ టీ అంటే పారదర్శకంగా కనిపంచే ద్రవపదార్థం. దీన్ని ఈశాన్య రాష్ట్రాల్లో పండే బ్లాక్ రైస్, రెడ్ రైస్ తో తయారు చేస్తారు. మేఘాలయలో షా-కూ అని చెప్పుకునే ఈ ద్రవాహారం చాలా మంచిదట. షా అంటే చాయ్ అని కూ అంటే బియ్యం అని అర్థం. జపనీయులు కూడా మరోరకంగా దీన్ని తాగుతారు వాళ్లు దీని తయారీకి బ్రౌన్ రైస్ వాడతారు. అక్కడ దీన్ని జెన్మాయిషా అని అంటారట. వేయించిన బ్రౌన్ రైస్ తోపాటు దీని తయారీలో గ్రీన్ టీని కూడా ఉపయోగించి జన్మాయిషా తయారు చేస్తారు. అస్సాంలో ఎక్కువ మంది విందు భోజనం తర్వాత ’షా’ అనే ఈ రైస్ టీని అతిథులకు ఇస్తారట. ఇది జీర్ణక్రియకు తోడ్పడుతుంది.
రైస్ టీ చరిత్ర ఇదే
చరిత్ర అంచనా ప్రకారం బ్రిటీష్ వారు మామూలు తేయాకును ఇక్కడ పరిచయం చేసే వరకు కూడా షిల్లాంగ్ కు దక్షిణం వైపు 94 కిలోమీటర్ల దూరంలో ఉన్న లాస్కిన్ బ్లాక్ లోని గ్రామాలలో షా-కూ చాలా ప్రాచూర్యంలో ఉండేదట. నెమ్మదిగా అక్కడి నుంచి వలసలు పెరిగిపోయిన తర్వాత ఈ రైస్ టీ పట్టణాలకు కూడా విస్తరించింది. తాగిన వారి అనుభవాలను పరిగణనలోకి తీసుకున్నపుడు చాలా మంది ఇది రుచిలో కొంత టీ లాగా కొంత బ్లాక్ కాఫీలా ఉంది అని అన్నారు.
ఎలా చేస్తారు?
నాలుగు కప్పుల రైస్ టీ కోసం 1 టేబుల్ స్పూన్ స్టిక్కీ గా ఉండే బ్లాక్ రైస్ లేదా రెడ్ రైస్ ను 2-3 నుంచి మూడు నిమిషాల పాటు వేయించాలి. తర్వాత ఇందులో 3-4 కప్పుల నీటిని పోసి 3-5 నిమిషాల పాటు చిన్న మంట మీద ఉడికించాలి. తర్వాత వడ కట్టి వేడిగా వడ్డించడమే. జపాన్, కొరియా వారు దీనికి కొద్దిగా ఆర్గానిక్ గ్రీన్ టీని కలుపుతారు. విందు భోజనం తర్వాత జీర్ణక్రియ కు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఈ పానీయం దోహదం చేస్తుందని స్నేహ వివరించారు.
మాములుగా రైస్ టీలో చక్కెర వెయ్యరు. కానీ మరింత రుచిగా తయారు చేసుకోవాలని కొందరు చక్కెర కూడా కలుపుకుంటారు. విందుల్లో డిజర్ట్ గా లేదా భోజనం తర్వాత అందించే పానీయం దీన్ని ఎక్కువగా తీసుకుంటారు. విందు తర్వాత ఈ పానీయం తీసుకుంటే హుషారుగా ఉంటారట.
పోషక భరితం
ఈ టీ లో ఫ్లెవనాయిడ్స్, ఆంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్, విటమిన్స్ పుష్కలం. దీనికి హ్యాండ్ రోల్డ్ గ్రీన్ టీ కూడా కలిపి ఇవ్వడం వల్ల మరింత పోషక భరితం చెయ్యవచ్చని న్యూట్రీషన్ నిపుణులు అంటున్నారు. ఓహియోలోని క్లీవ్ ల్యాండ్ లోని కేస్ వెస్ట్రన్ రిజర్వ్ యూనివర్సిటి నిర్వహించిన అధ్యయనాల ప్రకారం గ్రీన్ టీలోని పాలీఫెనాల్స్ క్యాన్సర్ కణాల పెరుగుదలను నివారిస్తాయి. అంతే కాదు ఇందులోని సెలీనియం థైరాయిడ్ పనితీరును సమతులంగా ఉంచుతుంది. జీవక్రియలు కూడా నియంత్రణలో ఉంటాయి. బియ్యం చర్మానికి మేలు చేస్తాయి. చర్మం మృదువుగా ఉండేందుకు , ముడతలు రాకుండా నివారించేందుకు దోహదం చేస్తుందట. అమృతం వంటి ఈ టీ రోజులో ఎన్నిసార్లయినా తాగొచ్చట.
Also read: కాలేయం ఆరోగ్యంగా ఉందా? లేక కొవ్వు పేరుకుపోయిందా? తెలుసుకోవడం ఎలా