News
News
X

Bathing: గడ్డకట్టేలా ఉన్న నీళ్లలో ఈత కొడితే ఏమవుతుంది? అలా స్నానం చేస్తే మైండ్ ఫ్రెష్ అవుతుందా !

చలికాలంలో తెల్లవారుజామున నిద్ర లేచేందుకు కొందరు ఇష్టపడరు. చల్లనీటితో స్నానం చేసేందుకు అసలు ఇష్టపడరు. కానీ చలికాలంలో వేడినీటితో స్నానం చేయటం కంటే చన్నీటి స్నానం చేయడమే మంచిదని నిపుణులు అంటున్నారు.

FOLLOW US: 
Share:

చలికాలంలో తెల్లవారుజామున నిద్ర లేచేందుకు కొంతమంది ఇబ్బంది పడుతుంటారు. ఇక ఆ చలిలో లేచి చల్లనీటితో స్నానం చేసేందుకు అసలు ఇష్టపడరు. కానీ నిజానికి చలికాలంలో వేడినీటితో స్నానం చేయటం కంటే చన్నీటి స్నానం చేయడమే మంచిదని నిపుణులు అంటున్నారు. చలికాలంలో ఉదయం వేళ చల్లటి నీటిని తాకగానే మన బాడీలో వెబ్రేషన్స్ వచ్చేస్తాయి. సీజన్‌తో సంబంధం లేకుండా, ఉదయాన్నే లేచి స్నానం చేయడం చాలా అవసరం. అది కూడా చల్లటి నీటితో స్నానం చేస్తే ఎన్నో విధాలుగా ఆరోగ్యానికి మేలు కలుగుతుందని నిపుణులు అంటున్నారు. కానీ కొన్నిసార్లు చల్ల నీటి స్నానం తప్పదు అనుకున్న సమయంలో ఊపిరి బిగబట్టుకుని, ఓ బకెట్‌ నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా కొంచెం గడ్డ కట్టిన నీటిలో స్విమ్మింగ్‌ చేయడం అనే మామూలు విషయం కాదనే చెప్పాలి. మైనస్‌ డిగ్రీల వాతావరణంలో నివసించేందుకు భయపడిపోతాం.. కానీ అలాంటి పరిస్థితిల్లో కూడా గడ్డకట్టిన సరస్సులో స్విమ్మింగ్‌ చేస్తూ తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు కొంతమంది యువతీయువకులు. చైనాలో ప్రసిద్ధ శీతాకాలపు క్రీడలో భాగంగా షెన్యాంగ్‌ ప్రాంతంలో పూర్తిగా ఘనీభవించిన సరస్సులో ఈత కొట్టారు. అది కూడా మైనస్‌ 8 డిగ్రీల వాతావరణంలో స్విమ్మింగ్ అంటే మాటలు కాదు. 

మంచు నీటిలో స్విమ్మింగ్‌:
మంచుతో కడ్డకట్టిన సరస్సులో ఈత కొట్టే ఆటలు సెప్టెంబర్‌లో మొదలై, దాదాపు 6నెలల పాటు కొనసాగుతుంది. దీంతో షెన్యాంగ్‌లో జరిగే ఈ పోటీలను చూసేందుకు భారీ మొత్తంలో ప్రజలు తరలివస్తుంటారు. ముందుగా మంచుతో గడ్డకట్టుకుపోయిన సరస్సును సుత్తితో కొట్టి విచ్ఛిన్నం చేస్తారు. ఆ తర్వాత కాస్త దూరం వరకు అలాగే మంచును పగలగొడతారు. అనంతరం ఈ గేమ్‌లో పాల్గొనే యువతీయువకులు ఇందులోకి డైవ్‌ చేసి మరీ స్విమ్మింగ్‌ చేస్తారు. ఈ పోటీల్లో గెలిచిన స్విమ్మర్లకు భారీ మొత్తంలో నగదుతో పాటు ఓ ట్రోఫీని కూడా అందజేస్తారు. 

చల్ల నీటిలో స్విమ్మింగ్‌ చేయడం లేదా స్నానం చేయడం ఆరోగ్యానికి మేలేనా.?
శరీరంపై పడే చల్లని నీటి జల్లులు లోపలి నుంచి వెచ్చదనాన్ని కలిగిస్తాయి. వేడినీటితో స్నానం చేస్తే చర్మం వెచ్చని అనుభూతి పొందినప్పటికీ, రక్తం చర్మం ఉపరితలం వైపు కదులుతుంది. ఇది చల్లని ప్రభావాన్ని తప్పికొడుతుంది. చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల ధమనులు బలంగా తయారవుతాయి, రక్తపోటు తగ్గుతుంది. మీరు ఫిట్‌గా ఉండాలంటే చల్లటినీటితో స్నానం చేయమని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు...చల్లటి నీరు శరీరానికి ఒత్తిడిని కలుగచేస్తుంది. అయితే, తనకు హాని జరిగేటప్పుడు దాని నుంచి తప్పించుకోవడానికి స్పందించే స్వభావం శరీరానికి సహజంగానే ఉంటుంది. కొన్ని సందర్భాలలో మెదడు నుంచీ కాలి బొటన వేళ్ల వరకూ కూడా శరీరం ఒకేసారి స్పందిస్తుంది. శరీరం చన్నీటిని ఒక పెద్ద ముప్పులా చూడటంతో, ఒత్తిడిని ఎదుర్కొనేందుకు అది సన్నద్ధమవుతుంది. మీ గుండె దడ రాకెట్ వేగంలో పెరిగి, మీలో అడ్రినలిన్ ఉత్తేజితమవుతుంది.

ఇక ఉదయాన్నే స్విమ్మింగ్ చేయడం ద్వారా ఒత్తిడి తగ్గుతుంది, ధ్యానం చేస్తున్నటువంటి ఫలితాలు ఉంటాయని ఇప్పటికే నిఫుణులు వెల్లడించారు. హృదయ స్పందనలు లయబద్ధం అవుతాయి. ఉదయాన్నే లేచి ఈతకొడితే మరిన్ని ప్రయోజనాలు దక్కుతాయంటున్నారు నిపుణులు. అంతేకాదు.. సూర్యోదయం అవుతుండగా ఈత కొట్టడం, సూర్యోదయం అయ్యాక పూల్‌సైడ్ విశ్రాంతి తీసుకోవడం వలన మీకు మంచి అనుభూతితో పాటు, ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు దక్కుతాయి. 

వేడి నీటితో స్నానం చేస్తే ఏం అవుతుంది.?
వేడి నీటితో స్నానం చేయడం వల్ల శరీరంలో క్యాలరీలు కూడా తగ్గుతాయని వైద్య నిఫుణులు వెల్లడించారు. వేడి నీటితో స్నానం చేసే వారిలో గుండెపోటు, ఇతరాత్ర గుండె సమస్యల ముప్పు తగ్గినట్లు నిపుణులు చెబుతున్నారు. వేడి నీటితో స్నానం చేసేవారిలో 10 శాతం షుగర్ లెవల్స్ కూడా తగ్గాయట. వేడి నీటితో స్నానం వల్ల హాయిగా నిద్రపడుతుంది. మీరు వేడి నీటితో స్నానం చేసినప్పుడు, ఆవిరి చర్మ రంధ్రాలను తెరుస్తుంది, దీని కారణంగా చర్మంలోని మురికి బయటకు వచ్చి మీ చర్మం శుభ్రంగా మరియు ఆరోగ్యంగా ఉంటుంది. వేడి నీటి స్నానం మన చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి మరియు అందంగా కనిపించడానికి సహాయపడుతుంది. కానీ వేడి నీటితో తల స్నానం చేయడం మంచిదికాదట.

వేడివేడి నీళ్లు తల మీద పోసుకున్నప్పుడు జట్టులో ఉండే సహజమైన ఆయిల్‌ వెళ్లిపోయి, డాండ్రఫ్‌ (చుండ్రు) వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల మీ జుట్టులో సహజమైన ఆయిల్ నిలుపుకోవడంతోపాటు జుట్టు నిగనిగలాడేలా చేస్తుంది. చల్లటి నీటితో స్నానం చేయడం కూడా మీ చర్మాన్ని హైడ్రేట్ చేయడంలో సహాయపడుతుంది. కానీ అన్ని కాలాల్లో ఇలా చేయడం కూడా మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. మరీ ముఖ్యంగా శీతాకాలంలో చల్లటి నీటితో మాత్రమే స్నానం చేయడం ఉత్తమం అంటున్నారు. 

Published at : 07 Dec 2022 11:12 PM (IST) Tags: Health cool water bathing in cool water swimming ice water

సంబంధిత కథనాలు

ఏవండోయ్ ఇది విన్నారా? 'జస్ట్ ఫ్రెండ్స్' అన్నందుకు మహిళపై రూ.24 కోట్లు పరువు నష్టం కేసు వేశాడు!

ఏవండోయ్ ఇది విన్నారా? 'జస్ట్ ఫ్రెండ్స్' అన్నందుకు మహిళపై రూ.24 కోట్లు పరువు నష్టం కేసు వేశాడు!

Curd Vs Buttermilk: పెరుగు కంటే మజ్జిగ తీసుకోవడం మంచిదా? ఆయుర్వేద శాస్త్రం ఏం చెబుతోంది?

Curd Vs Buttermilk: పెరుగు కంటే మజ్జిగ తీసుకోవడం మంచిదా? ఆయుర్వేద శాస్త్రం ఏం చెబుతోంది?

Tips for Good Sleep: మీకు మంచిగా నిద్రపట్టాలా? ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయిపోండి చాలు!

Tips for Good Sleep: మీకు మంచిగా నిద్రపట్టాలా? ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయిపోండి చాలు!

Water for Hydration: శరీరం డీహైడ్రేట్‌కు గురైతే తాగాల్సింది నీరు కాదు - ఇవిగో ఇవి తాగండి

Water for Hydration: శరీరం డీహైడ్రేట్‌కు గురైతే తాగాల్సింది నీరు కాదు - ఇవిగో ఇవి తాగండి

Prediabetes: ప్రీ డయాబెటిస్ స్టేజ్‌లో ఏం తినాలి? ఎటువంటి ఆహారం తీసుకోకూడదు?

Prediabetes: ప్రీ డయాబెటిస్ స్టేజ్‌లో ఏం తినాలి? ఎటువంటి ఆహారం తీసుకోకూడదు?

టాప్ స్టోరీస్

Pawan Kalyan Marriages: మూడు పెళ్లిళ్ల వివాదంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ - చివర్లో బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్!

Pawan Kalyan Marriages: మూడు పెళ్లిళ్ల వివాదంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ - చివర్లో బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్!

K.Viswanath: చిరంజీవితో విశ్వనాథ్‌కు ప్రత్యేక అనుబంధం - కళా తపస్విని కన్నతండ్రిలా భావించే మెగాస్టార్!

K.Viswanath: చిరంజీవితో విశ్వనాథ్‌కు ప్రత్యేక అనుబంధం - కళా తపస్విని కన్నతండ్రిలా భావించే మెగాస్టార్!

Anil Kumar On Kotamreddy : దమ్ముంటే రాజీనామా చెయ్, కోటంరెడ్డికి అనిల్ కుమార్ సవాల్

Anil Kumar On Kotamreddy : దమ్ముంటే రాజీనామా చెయ్, కోటంరెడ్డికి అనిల్ కుమార్ సవాల్

K Viswanath Death: టాలీవుడ్‌ను ఖండాంతరాలకు తీసుకు వెళ్ళారు, తీరని లోటు - విశ్వనాథునికి చిరంజీవి, ఎన్టీఆర్, మమ్ముట్టి నివాళులు

K Viswanath Death: టాలీవుడ్‌ను ఖండాంతరాలకు తీసుకు వెళ్ళారు, తీరని లోటు - విశ్వనాథునికి చిరంజీవి, ఎన్టీఆర్, మమ్ముట్టి నివాళులు