![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Cloves for Weight Loss : లవంగాలతో వేగంగా బరువు తగ్గవచ్చట తెలుసా? కానీ ఇలా తీసుకోవాలి
Weight Loss : బరువు తగ్గాలనే కోరిక అందరిలోనూ ఉంటుంది. అయితే సరైన పద్ధతిలో బరువు తగ్గితేనే హెల్తీగా ఉంటారు. అయితే మీరు బరువు తగ్గాలనుకుంటే మీ డైట్లో లవంగాలు చేర్చుకోవాలట తెలుసా?
![Cloves for Weight Loss : లవంగాలతో వేగంగా బరువు తగ్గవచ్చట తెలుసా? కానీ ఇలా తీసుకోవాలి weight loss and more health benefits with clove water Here are the full details Cloves for Weight Loss : లవంగాలతో వేగంగా బరువు తగ్గవచ్చట తెలుసా? కానీ ఇలా తీసుకోవాలి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/28/7d856fefa01d2622f0a04c742623cfa71709117266600874_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Healthy Ways to Lose Weight : ఆరోగ్యంగా ఉండాలంటే బరువు తగ్గాలని, ఫిట్‌గా ఉండాలని సూచిస్తున్నారు వైద్యులు. ఎందుకంటే అధిక బరువు వల్ల అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వస్తాయి. పైగా చిన్ననాటి నుంచే చాలామంది బరువు పెరిగిపోతున్నారు. ఒకప్పుడు ఫుడ్ తినడం వల్ల బరువు పెరుగుతున్నారు అనేవారు కానీ.. ఇప్పుడు బరువు పెరగడానికి వివిధ కారణాలు ఉంటున్నాయి. మానసికంగా ఉండే ఇబ్బందులు, జీవనశైలిలో మార్పుల వల్ల కూడా బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి.
జీవనశైలిలో మార్పులు చేయడం, జిమ్‌కి వెళ్లడం, వ్యాయామాలు చేయడం, ఫుడ్ విషయంలో మార్పులు తీసుకురావడం వల్ల బరువు తగ్గే అవకాశాలు ఎక్కువ. అయితే మీరు బరువు తగ్గడంలో, జీర్ణక్రియను మెరుగుపరచుకోవడంలో మీరు లవంగాలను మీ రోటీన్లో యాడ్ చేసుకోవచ్చు. ఎన్ని ప్రయత్నిస్తున్న బరువు తగ్గట్లేదు అనుకున్నప్పుడు మీరు లవంగం వాటర్‌ను ట్రై చేయవచ్చు. అసలు ఈ లవంగం వాటర్ ఏంటి? దీనిని ఎలా తయారు చేసుకోవాలి? దీనివల్ల కలిగే లాభాలు ఏంటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఎలా తయారు చేసుకోవాలంటే..
ముందుగా స్టౌవ్ వెలిగించి దానిపై గిన్నె పెట్టి నీరు వేయండి. అవి వేడి అయ్యాక దానిలో నీరు ఓ ఎనిమిది లవంగాలు వేసి.. మరగనివ్వండి. ఇప్పుడు స్టౌవ్ ఆపేసి నీటిని వడకట్టి దానిలో నిమ్మరసం కలపండి. ఈ నీరు మీరు బరువు తగ్గడంలో సహాయం చేస్తుంది. అంతేకాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది జీవక్రియను పెంచి.. కొవ్వును బర్న్ చేస్తుంది. మెరుగైన జీవక్రియ ఉంటే బరువు తగ్గడం వేగవంతం అవుతుంది. జీవక్రియ మందగించినప్పుడు బరువు తగ్గడం కష్టంగా మారుతుంది. కాబట్టి దానిని మెరుగుపరచుకున్నప్పుడు శరీరంలోని కొవ్వు కరిగి.. బరువు తగ్గుతారు. అందుకే లవంగాలతో చేసిన నీటిని తాగితే బరువు నిర్వహణ సులువుగా ఉంటుంది.
ఇతర ప్రయోజనాలు..
లవంగంతో చేసిన నీరు జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇది జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలను నుంచి ఉపశమనం ఇస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయం చేస్తుంది. ఈ నీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడానికి సహాయం చేస్తాయి. ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. దీనిలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు నీటి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. నోటి దుర్వాసన, చిగుళ్ల వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాడటంలో ఇది హెల్ప్ చేస్తుంది.
మధుమేహమున్నవారు తీసుకోవచ్చా?
యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగిన లవంగాల నీటిని తీసుకోవడం వల్ల శరీరంలో మంట తగ్గుతుంది. ఆర్థరైటిస్ వంటి లక్షణాలు తగ్గుతాయి. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడంలో హెల్ప్ చేస్తాయి. రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఇది హెల్ప్ చేస్తుందని పలు అధ్యయనాలు సూచించాయి. కాబట్టి మధుమేహమున్నవారు కూడా దీనిని హ్యాపీగా తీసుకోవచ్చు.
Also Read : నాణేలు, అయస్కాంతాలు మింగేసిన వ్యక్తి.. దాని వెనుక కథ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)