Zinc : నాణేలు, అయస్కాంతాలు మింగేసిన వ్యక్తి.. దాని వెనుక కథ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
Coins : ఓ వ్యక్తి బాడీని బిల్డ్ చేయాలనుకున్నాడు. దీనిలో భాగంగా ఓ వింత పని చేశాడు. బాడీ పెరగడమేమో కానీ.. ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ ఆ పని ఏంటంటే..
Psychiatric Illness : ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో ఓ వ్యక్తి జాయిన్ అయ్యాడు. 20 రోజులుగా వాంతులు కావడం, తీవ్రమైన కడుపునొప్పితో ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించి.. ఎమర్జెన్సీ వార్డుకి తరలించారు. అతనికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు పొత్తికడుపులో అయస్కాంతాలు, నాణేలు ఉన్నట్లు చూసి షాకయ్యారు. ఈ విషయాన్ని బంధువులకు తెలుపగా వారు ఖంగుతిన్నారు. అతని కడుపులో 39 నాణేలు, 37 అయస్కాంతాలను రెండు గంటలు కష్టపడి బయటకు తీశారు. శస్త్రచికిత్స తరువాత పేషెంట్‌ని నార్మల్ వార్డుకి తరలించారు.
జింక్‌తో బాడీ బిల్డ్ అవుతుందని..
ఇంతకీ కడుపులో అయస్కాంతాలు, నాణేలు ఎలా వచ్చాయని వైద్యులు పేషంట్ని ప్రశ్నించగా.. అతను చెప్పిన ఆన్సర్ విని అందరూ ఆశ్చర్యపోయారు. నాణేలు, అయస్కాంతాలను జింక్ కంటెంట్ కోసం తీసుకున్నట్లు ఆ వ్యక్తి తెలుపాడు. జింక్ వల్ల తన బాడీ బిల్డ్ అవుతుందని బదులు ఇచ్చాడు. మాగ్నెట్స్ నాణేలను ప్రేగులలో ఉండేలా చేస్తుందని.. తద్వార శరీరం జింక్‌ను గ్రహించడంలో సహాయం చేస్తుందని తన రీజన్ తెలిపాడు. జింక్ కోసం ఇలా నాణేలు, అయస్కాంతాలు తినవద్దని.. అది ప్రాణాంతకమని వైద్యులు అతనికి తెలుపారు. ప్రస్తుతం ఆ వ్యక్తి బాగానే ఉన్నాడని.. వైద్యులు తెలిపారు.
రోజుకు ఎంత తీసుకోవాలంటే..
మీరు మీ శరీరాన్ని బిల్డ్ చేసుకోవాలనుకుంటే కచ్చితంగా నిపుణుల సలహా తీసుకోవాలి అంటున్నారు. వారి సలహా మేరకు ఫుడ్ తీసుకోవాలని.. అంతేకానీ నాణేలు, మ్యాగ్నెట్స్ తింటే జింక్ పెరగదని.. అవి పూర్తిగా ప్రాణాంతకమని తెలిపారు. జింక్ అనేది శరీరానికి అవసరమైన ఓ కంటెంట్ ఇది కొన్ని సమస్యలను దూరం చేయడంతో పాటు.. శరీరాన్ని బిల్డ్ చేయడంలో సహాయం చేస్తుంది. అయితే మీరు జింక్‌ను ఎంత తీసుకోవాలనేది కచ్చితంగా వైద్యుల సలహా తీసుకోవాలి. అది ఎక్కువైతే కూడా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మగవారు రోజుకు 11 మిల్లీ గ్రాములు, మహిళలు 8 గ్రాములు జింక్ తీసుకోవాల్సి ఉంటుంది.
జింక్ కలిగిన ఫుడ్స్
మంసాహారం, నత్తలు, పౌల్ట్రీ ఉత్పత్తుల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది. మాంసాహారంతో పోలిస్తే శాఖాహారంలో జింక్ లభ్యత తక్కువ. అయితే వెజ్ వాళ్లు బ్రెడ్, చిక్కుళ్లు, కాయధాన్యాలు, పప్పు దినుసులు వంటి వాటిలో జింక్ లభ్యత ఎక్కువగా ఉంటుంది. అలాగే కొన్ని పద్ధతుల్లో వండటం, మొలకెత్తించడం ద్వారా కూడా జింక్ని పొందవచ్చు. బీన్స్, ధాన్యాలు, విత్తనాలు, పులియబెట్టిన ఫుడ్స్ తీసుకుంటే మంచిది. లేదంటే వైద్యుడి సూచనల మేరకు మీరు జింక్ టాబ్లెట్లను తీసుకోవచ్చు. అయితే మెడిసన్ కంటే ఫుడ్ తీసుకుంటేనే మంచిది అంటున్నారు పోషకాహార నిపుణులు.
Also Read : స్లీప్ ఆప్నియాపై కొత్త అధ్యయనం.. శ్వాసకు బ్రేక్.. ప్రాణం పోయిన ఆశ్చర్యపోనవసరం లేదట
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.