అన్వేషించండి

Ayurveda Recipe : మామిడి ఆకులను ఇలా తీసుకుంటే మధుమేహం కంట్రోల్.. బరువు కూడా తగ్గొచ్చట

Healthy Recipe for Diabetics : మీకు మామిడి ఆకులు అంటే ఏమి గుర్తొస్తుంది? పండుగలకు కట్టే తోరణాలు.. అంతే కదా.. అయితే దీనితో మధుమేహం కంట్రోల్ చేయొచ్చనేది మీకు తెలియదు అనమాట.

Mango Leaves Benefits : మధుమేహాంతో ఇబ్బంది పడేవారు చాలా మందే ఉంటారు. చిన్న వయసు నుంచే కొందరు డయాబెటిస్​తో ఇబ్బంది పడుతున్నారు. మరికొందరు వయసు వల్ల, జెనిటిక్స్ వల్ల, ఒత్తిడి వల్ల మధుమేహం బారిన పడుతున్నారు. అయితే దీనిని కంట్రోల్ చేయడం కోసం రోజూ మెడిసిన్ ఉపయోగించాలి. ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. జీవనశైలిలో మార్పులతో పాటు.. కొన్ని హోం రెమిడీలు కూడా మధుమేహాన్ని తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. వాటిలో ఒకటి మామిడి ఆకులతో చేసే పానీయం. 

మామిడి ఆకులతో మధుమేహాన్ని కంట్రోల్ చేయగలిగే ఈ రెమిడీని పురాతన చైనీయులు కనిపెట్టారు. మధుమేహాన్ని, ఉబ్బసాన్ని కంట్రోల్ చేయడానికి మామిడి ఆకుల సారం కచ్చితంగా హెల్ప్ చేస్తుందని వారు గుర్తించారు. మామిడి ఆకుల్లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అయితే ఇది కేవలం చైనీసుల రెసిపీ మాత్రమే అనుకోకండి. ఎందుకంటే దీనికి సైన్స్​ కూడా మద్ధతు ఇచ్చింది. 2010లో నిర్వహించిన ఓ అధ్యయనంలో మామిడి ఆకుల సారంతో గ్లూకోజ్​ స్థాయిలో మార్పులను కలిగినట్లు పేర్కొంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో హెల్ప్ చేస్తుందని అధ్యయనం తెలిపింది.

మామిడి ఆకుల సారం ఎలా తయారు చేసుకోవాలంటే..

మామిడి ఆకులు తాజావి ఓ 15 తీసుకుని వాటిని బాగా కడగాలి. వాటిని 150 మి.లీ నీటిలో ఉడకబెట్టాలి. ఈ నీటిని రాత్రంతా అలాగే వదిలేయాలి. ఉదయాన్నే బ్రేక్​ఫాస్ట్ చేయడానికి ముందు నీటిని వడకట్టి తాగాలి. దీని ఫలితాలు పొందడానికి సుమారు మూడు నెలలపాటు ప్రతిరోజూ దీనిని తాగాలి. అప్పుడే మీరు దాని ప్రయోజనాలు పొందుతారు. 

బరువు తగ్గడానికి, షుగర్ కంట్రోల్ చేయడానికి..

మామిడి ఆకులు శరీరంలో గ్లూకోజ్​ స్థాయిలను ఎలా కంట్రోల్ చేస్తుంది అంటే.. మామిడి ఆకుల నుంచి తీసిన సారం.. శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. ఇది గ్లూకోజ్ పంపిణీని కూడా పెంచుతుంది. తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్ చేయడంలో హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా మామిడి ఆకుల్లో ఉండే పెక్టిన్, ఫైబర్, విటమిన్ సి వంటి అనేక పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. బరువు తగ్గాలనుకునే వారు లేదంటే ఊబకాయంతో ఇబ్బంది పడేవారు కూడా దీనిని తీసుకోవచ్చు.

ఆ సమస్యలు కూడా కంట్రోల్..

ఈ ఆకులతో చేసిన సారం తీసుకుంటే.. రాత్రుళ్లు తరచుగా మూత్రవిసర్జనకు వెళ్లే వారు తీసుకోవచ్చు. ఇది సమస్యను కంట్రోల్ చేస్తుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు కంటి చూపును మెరుగుపరచడం, బరువు తగ్గడం, మధుమేహం కంట్రోల్ చేయడం వంటి ఎన్నో వాటికి మామిడి ఆకుల సారం ఉపశమనం ఇస్తుంది. కేవలం డయాబెటిస్ ఉన్నవారే దీనిని తీసుకోవాల్సిన అవసరం లేదు. పోషక ప్రయోజనాల కోసం ఎవరైనా దీనిని తీసుకోవచ్చు. 

Also Read : టేస్టీ టేస్టీ మిల్లెట్స్ పాయసం.. రెసిపీ చాలా సింపుల్

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Lava Yuva 4: రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
Allu Arjun: 'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?తాళ్లతో కట్టేసి బెల్టులు, లాఠీలతో కొడుతూ  గుండెలపై కూర్చుని..!ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Lava Yuva 4: రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
Allu Arjun: 'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
Bengaluru: జొమాటోపై ఈ విధంగా రివెంజ్ తీర్చుకోవచ్చా ? ఈ వ్యక్తి చేసి చూపించాడు !
జొమాటోపై ఈ విధంగా రివెంజ్ తీర్చుకోవచ్చా ? ఈ వ్యక్తి చేసి చూపించాడు !
Food Poisoning In Telangana: విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
Pushpa 2 Censor: పుష్పరాజ్ రక్తపాతానికి సెన్సార్ కత్తెర... అల్లు అర్జున్ 'పుష్ప 2'లో డిలీట్ చేసిన సీన్స్ లిస్ట్ ఇదిగో
పుష్పరాజ్ రక్తపాతానికి సెన్సార్ కత్తెర... అల్లు అర్జున్ 'పుష్ప 2'లో డిలీట్ చేసిన సీన్స్ లిస్ట్ ఇదిగో
Crime News: 'ఓరి నాయనో.. పోలీస్ డ్రోన్లు వచ్చేస్తున్నాయ్' - పొలాల్లో పరుగులు పెట్టిన మందుబాబులు
'ఓరి నాయనో.. పోలీస్ డ్రోన్లు వచ్చేస్తున్నాయ్' - పొలాల్లో పరుగులు పెట్టిన మందుబాబులు
Embed widget