అన్వేషించండి

Mumbai Watermelon Tragedy : పుచ్చకాయ తింటే చనిపోతారా? ఎప్పుడు తినాలి? ఎలా తినకూడదు? ముంబై ఘటనతో బయటపడిన నిజాలు

Watermelon Can Be Dangerous : పుచ్చకాయ ఆరోగ్యానికి చాలా మంచిది కానీ.. సరిగ్గా నిల్వ చేయకపోయినా.. సరైన సమయంలో తీసకోకపోయినా ప్రమాదం ఉంటుంది. దానికి ఎగ్జాంపులే ముంబై ఘటన. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ముంబైలో ఒకే కుటుంబంలో నలుగురు పుచ్చకాయ తిని మరణించారు.
  • పుచ్చకాయ ఆరోగ్యానికి మేలు చేసినా, తినే సమయం, నిల్వ కీలకం.
  • ఉదయం 10-12, మధ్యాహ్నం 2-4 మధ్య పుచ్చకాయ తినడం ఉత్తమం.
  • రాత్రి 8 తర్వాత, భోజనం తర్వాత వెంటనే తినడం మంచిది కాదు.

Watermelon Safety Guide : పుచ్చకాయ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పైగా వేసవిలో తినేందుకు అనువైన ఆహారం. అందుకే దీనిని చాలామంది డైట్​లో చేర్చుకుంటారు. కానీ సరైన పద్ధతిలో స్టోర్ చేయకుండా.. సరైన సమయంలో తీసుకోకుంటే ఆరోగ్యానికి ప్రమాదంగా మారవచ్చు. ముంబైలోని పైధోనిలో జరిగిన ఘటనే.. దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. వైరల్ అవుతున్న ఈ ఘటన గురించిన పూర్తి విషయాలతో పాటు.. పుచ్చకాయ ఏ సమయంలో తింటే మంచిదో.. పుచ్చకాయ తినేముందు చేయకూడని తప్పులు ఏంటో చూసేద్దాం. 

ముంబై విషాదం.. 

ముంబై పైధోని ప్రాంతంలో ఒకే కుటుంబంలోని నలుగురు 24 గంటల వ్యవధిలో మృతి చెందారు. రాత్రి 10 గంటల సమయంలో బంధువులతో కలిసి తిని.. వారు వెళ్లిపోయిన తర్వాత మధ్యరాత్రి 1 గంట సమయంలో కట్ చేసిన పుచ్చకాయ తిన్నారు. మరుసటి రోజు ఉదయం 5 తర్వాత వాంతులు, అస్వస్థత మొదలైంది. దాంతో వారు ఆస్పత్రిలో చేరారు. ఒకరి తర్వాత ఒకరు మృతి చెందారు. ఫోరెన్సిక్ రిపోర్టులు రావాల్సి ఉంది. అయితే అధికారులు ఇది ఫుడ్ పాయిజనింగ్​గా అనుమానిస్తున్నారు.

వైరల్ ఎందుకవుతుందంటే..

బిర్యానీ, పుచ్చకాయ కాంబినేషన్ వల్ల ఇలా జరుగుతుందా అనే పోస్ట్​లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే కొందరు బిర్యానీ రిలేటివ్స్​తో తిన్నారు. వాళ్లు బాగానే ఉన్నారు. కానీ ఫ్యామిలీ అంతా పుచ్చకాయ తిన్నారు కాబట్టి.. అదే వారు చనిపోవడానికి కారణమంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. నిజంగానే పుచ్చకాయ అర్థరాత్రి తింటే అంత ప్రమాదమా? పుచ్చకాయ తినడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో, నిపుణుల సూచనలు ఇప్పుడు తెలుసుకుందాం. 

పుచ్చకాయతో హెల్త్ బెనిఫిట్స్.. 

కచ్చితంగా పుచ్చకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో 92 శాతం నీరు ఉంటుంది. దీనివల్ల డీహైడ్రేషన్ దూరమవుతుంది. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు గుండె, కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడతాయి. తక్కువ కేలరీలు బరువు తగ్గిస్తాయి. విటమిన్ సి, ఎ, బి6 అధికంగా ఉంటాయి. ఆరోగ్యానికి మంచిది అయినా పుచ్చకాయ తినే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 

పుచ్చకాయ తినడానికి సరైన సమయం 

మీరు పుచ్చకాయ తినాలనుకుంటే.. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 మధ్యలో.. బ్రేక్​ఫాస్ట్ తర్వాత లేదా లంచ్‌కు ముందు తింటే చాలా మంచిది. మధ్యాహ్నం 2 నుంచి 4 మధ్య స్నాక్​గా కూడా తీసుకోవచ్చు. పుచ్చకాయలో నీరు అధికంగా ఉండటం వల్ల మధ్యాహ్నం తింటే శరీరం చల్లగా మారుతుంది.

ఎప్పుడు తినకూడదంటే..

రాత్రుళ్లు 8 తర్వాత పుచ్చకాయ తినకపోవడమే మంచిది. ఎందుకంటే దీనిలోని చక్కెర, నీరు ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణం కావడానికి సమయం పడుతుంది. నిద్రపోయే ముందు తింటే బ్లడ్ షుగర్ పెరగవచ్చు. తరచూ మూత్రవిసర్జన అవుతుంది. దీని వల్ల నిద్ర భంగమవుతుంది. అలాగే భోజనం తర్వాత వెంటనే తినకపోవడమే మంచిది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

పుచ్చకాయ కొనే ముందు మంచిది ఎంచుకోవాలి. తొక్క మృదువుగా లేదా మచ్చలు ఉంటే కొనకండి. మార్కెట్లో కట్ చేసి పెట్టిన పుచ్చకాయ తినకండి. ఎందుకంటే కోసి ఎంతసేపు అయిందో తెలియదు. అలాగే పుచ్చకాయను కోసే ముందు కడగండి. దీనివల్ల బయటివైపు బ్యాక్టీరియా లోపలికి వెళ్లదు. కట్ చేసిన పుచ్చకాయను 2 గంటల కంటే ఎక్కువసేపు ఉంచకండి. గది ఉష్ణోగ్రత వద్ద బాక్టీరియా వేగంగా పెరుగుతుంది. CDC ప్రకారం ఇది అత్యంత ముఖ్యమైన నియమం.

ఫ్రిజ్​లో పెడితే సరిగ్గా నిల్వ చేయాలి. కట్ చేసిన పుచ్చకాయను ఎయిర్‌టైట్ కంటైనర్‌లో పెట్టి ఫ్రిజ్‌లో 4°C కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉంచండి. దీనిని 24 గంటల్లో తినేస్తే చాలా మంచిది. కట్ చేసి పుచ్చకాయను చాలాసేపు బయట ఉంచి తింటే అస్సలు మంచిది కాదు. అలాగే పుచ్చకాయ జ్యూస్ చేసుకుంటే అరగంట లోపు తాగండి. నిల్వ చేయడం వల్ల బాక్టీరియా పెరుగుతుంది. పోషకాలు తగ్గుతాయి.

ఫుడ్ పాయిజనింగ్ లక్షణాలు కనిపిస్తే..

ఏ ఫుడ్ తిన్నా.. వాంతులు, విరేచనాలు అవుతుంటే ఫుడ్ పాయిజనింగ్​గా గుర్తించి వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. తీవ్రమైన కడుపు నొప్పి, తీవ్ర జ్వరం, మైకం, అలసట కూడా దీని లక్షణాలే. కాబట్టి ఈ లక్షణాలు విస్మరించకండి. సొంత వైద్యం కాకుండా వైద్య సహాయం తీసుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే 24 నుంచి 48 గంటల్లో పరిస్థితి తీవ్ర విషమంగా మారుతుందని గుర్తించుకోండి. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Dussehra Navratri Day 7 : అమ్మవారికి 7వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ మహాలక్ష్మీ దేవికి పూర్ణాలు, పాలన్నం ఇలా చేసేయండి
అమ్మవారికి 7వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ మహాలక్ష్మీ దేవికి పూర్ణాలు, పాలన్నం ఇలా చేసేయండి
Dussehra Navratri Day6 : అమ్మవారికి 6వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ సరస్వతి దేవికి పరవాన్నం ఇలా చేసేయండి
అమ్మవారికి 6వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ సరస్వతి దేవికి పరవాన్నం ఇలా చేసేయండి
White Chicken : నోరూరింటే వైట్ చికెన్ కర్రీ.. 10/10 రెస్టారెంట్ స్టైల్ రెసిపీ ఇదే.. పక్కా ట్రై చేయండి
నోరూరింటే వైట్ చికెన్ కర్రీ.. 10/10 రెస్టారెంట్ స్టైల్ రెసిపీ ఇదే.. పక్కా ట్రై చేయండి
Beer vs Breezer : బీర్‌కు, బ్రీజర్‌కు తేడా ఏంటి? ఆల్కహాల్‌ శాతం, ఆరోగ్యంపై ప్రభావాలు, అసలు తేడాలు ఇవే
బీర్‌కు, బ్రీజర్‌కు తేడా ఏంటి? ఆల్కహాల్‌ శాతం, ఆరోగ్యంపై ప్రభావాలు, అసలు తేడాలు ఇవే

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Holidays: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Ranabaali Day 1 Collections : రణబాలి ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఆక్యుపెన్సీ... విరోష్ కపుల్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే?
రణబాలి ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఆక్యుపెన్సీ... విరోష్ కపుల్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే?
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఒక్క మూవ్‌తో గేమ్ మార్చేసిన త్రిగుణ్! ముకేశ్‌ని హర్ట్‌ చేసిన ఝాన్సీ! కెప్టెన్‌గా రాంప్రసాద్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఒక్క మూవ్‌తో గేమ్ మార్చేసిన త్రిగుణ్! ముకేశ్‌ని హర్ట్‌ చేసిన ఝాన్సీ! కెప్టెన్‌గా రాంప్రసాద్!
Surya Luxury Living:  దుబాయ్‌లో షారుఖ్ ఖాన్ ప్రాజెక్టులో లగ్జరీ ఇల్లు కొన్న సూర్యకుమార్ యాదవ్, వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ సరికొత్త ఇన్వెస్ట్‌మెంట్
దుబాయ్‌లో షారుఖ్ ఖాన్ ప్రాజెక్టులో లగ్జరీ ఇల్లు కొన్న సూర్యకుమార్ యాదవ్, వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ సరికొత్త ఇన్వెస్ట్‌మెంట్
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
కారు ధరకు బైక్.. Royal Enfield Classic 650 హైపర్‌షిఫ్ట్- ఫీచర్లు, ప్రత్యేకతలు ఇవే
కారు ధరకు బైక్.. Royal Enfield Classic 650 హైపర్‌షిఫ్ట్- ఫీచర్లు, ప్రత్యేకతలు ఇవే
Embed widget