అన్వేషించండి

Baby Planning: ఆరోగ్యవంతమైన బిడ్డను కనాలనుకుంటున్నారా? అయితే మీరు చేయకూడని అయిదు పనులు ఇవే

Baby Planning: బిడ్డను కనాలనుకుంటున్న మహిళలు కచ్చితంగా చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి.

Baby Planning: పెళ్లయిన ప్రతి మహిళ తల్లి కావాలని కలలు కంటుంది. ఉద్యోగం చేసే మహిళలు ఎక్కువ కావడంతో గర్భం ధరించే ప్రక్రియను వాయిదా వేసుకుంటున్నారు. బిడ్డను కనిపెంచేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అనుకున్నాకే బిడ్డను ప్లాన్ చేస్తున్నారు. అయితే గర్భం ధరించేందుకు సిద్దమయ్యాక కొన్ని రకాల పనులు చేయకూడదని చెబుతున్నారు వైద్యులు. ఆ పనులు గర్భం ధరించడంపై, బిడ్డ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని రకాల ఆహారాలు గర్భం ధరించే  అవకాశాలు తగ్గించేస్తాయి. ఇంగ్లాండ్ నేషనల్ హెల్త్ సర్వీస్ ప్రకారం తరచూ సెక్స్ చేసే  వారిలో 40 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు గర్భం దాల్చే అవకాశం 80 శాతం ఉంటుంది. ఆ అవకాశాలు తగ్గకుండా ఉండాలంటే ఈ అలవాట్లను మహిళలు వదిలేయాలి. 

ధూమపానం వద్దు
మగవారిలోనే కాదు, ఆడవారిలో కూడా ధూమపానం పెరిగిపోతోంది.గర్భం ధరించాలనుకుంటున్న స్త్రీలు ధూమపానానికి దూరంగా ఉండాలి. ఇది వారిలో అండాల సంఖ్యను తగ్గిస్తుంది. అలాగే అండాల్లో జన్యుపరమైన అసాధారణతలు ప్రమాదాన్ని పెంచుతుంది. ఇలాంటి అండాలు ఫలదీకణం చెందిన పుట్టుకతో బిడ్డలో లోపాలు వస్తాయి. నెలలు నిండకుండానే ప్రసవం కావడం, ప్రసవం జరిగేటప్పుడు బిడ్డకు హాని కలగడం వంటివి జరుగవచ్చు. 

లైంగిక వ్యాధులు
కొందరిలో వారికి తెలియకండా లైంగిక ఇన్ఫెక్షన్లు ఉంటాయి. అలాంటివేవీ లేవని వైద్య పరీక్షల ద్వారా నిర్ధారణ చేసుకున్నాకే గర్భం ధరించేందుకు సిద్ధమవ్వాలి. గోనేరియా, క్లామిడియా వంటి లైంగిక వ్యాధులు గర్భధారణను కష్టతరం చేస్తాయి. ఇవి ఫాలోపియన్ ట్యూబులను దెబ్బతీస్తాయి. 

ప్లాస్టిక్ వాడకం
గర్భం ధరించడానికి ముందే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. ప్లాస్టిక్ సంచులు,డబ్బాుల పక్కన పడేయాలి. ప్లాస్టిక్ గ్లాసుల్లో నీళ్లు తాగడం, ప్లాస్టిక్ డబ్బాల్లో వేడిగా ఉన్న పదార్థాలు వేసుకుని తినడం మానేయాలి. సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు శరీరంలో చేరితే చాలా ప్రమాదం. అండాశయాలు ,మెదడు హార్మోన్ల పనితీరుకు అంతరాయం కలిగిస్తాయివి.

ప్రాసెస్డ్ ఫుడ్
బయట అధికంగా ప్రాసెస్డ్ మాంసాహారం దొరుకుతుంది. వాటిని తినడం మానేయాలి. తాజా చికెన్ ను తెచ్చుకుని ఇంట్లోనే వండుకుని తినడం ఉత్తమం. ప్రాసెస్డ్ ఫుడ్ గర్భిణులకు చాలా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. నాణ్యమైన పిండం ఏర్పడకుండా అడ్డుకుంటుంది. కాబట్టి గర్భం ధరించాలని అనుకున్నప్పట్నించే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం మొదలుపెట్టాలి.

Also read: ఈ పండ్లు తింటే రక్తంలో గడ్డలు ఇట్టే కరిగిపోతాయి

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

టాప్ హెడ్ లైన్స్

White Sneakers Cleaning Tips : తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
Curry Leaves and Hair Oil : జుట్టు ఒత్తుగా, బలంగా కనిపించాలంటే.. కరివేపాకుతో ఈ 5 రకాల నూనెలను కలిపి ట్రై చేయండి
జుట్టు ఒత్తుగా, బలంగా కనిపించాలంటే.. కరివేపాకుతో ఈ 5 రకాల నూనెలను కలిపి ట్రై చేయండి
Best Foods for Dinner : రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
IRCTC Japan Tour Package : IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
Kiran Abbavaram: అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Embed widget