విటమిన్ బి6 ట్యాబ్లెట్లు అతిగా మింగితే అంత డేంజరా? ఇతడికి ఏమైందో చూడండి
విటమిన్ బి6 చాలా అవసరమే, కానీ అతిగా మాత్రం కాదు. అది ఎంత ప్రమాదకరమో చూడండి.
ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. ఒక్కోసారి అది అతి శ్రద్ధగా మారి ఇతర అనారోగ్య సమస్యలను తీసుకొస్తుంది. ఒక వ్యక్తికి ఇలాగే జరిగింది. అతిగా సప్లిమెంట్లు మింగి చివరికి కదలలేని పరిస్థితిలోకి వచ్చేశారు. అందుకే వైద్యులు సూచించిన మేరకే విటమిన్ సప్లిమెంట్లు మింగాలి. సొంత నిర్ణయాలతో, మరింత బలంగా మారుతామనే అపోహలతో అతిగా మింగేసి ఆసుపత్రి పాలవుతారు. యూకేలో ఒక వ్యక్తికి ఇలాగే జరిగింది. అతను విటమిన్ డి సప్లిమెంట్లను మింగాడు. నిజానికి వీటిని వారానికొకటి వేసుకుంటే చాలు, కానీ ఆయన రోజూ నచ్చినన్ని మింగేసేవాడు. చివరికి అనారోగ్యం పాలై నెలల తరబడి ఇబ్బంది పడ్డాడు. వాంతులు, విరేచనాలు, కాలు తిమ్మిర్లతో ఆసుపత్రి పాలయ్యాడు.
విటమిన్ బి6 ప్రభావం
ఇప్పుడు ఒక ఆస్ట్రేలియన్ పౌరుడు కూడా అలాగే చేశాడు. విటమిన్ బి6ను వైద్యులు సిఫారసు చేసిన మోతాదు కంటే 70 రెట్లు అధికంగా తీసుకోవడం ప్రారంభించాడు. అలా కొన్ని రోజుల పాటూ చేయడంతో అతను నడిచే సామర్థ్యాన్ని కోల్పోయాడు. అతని రక్త పరీక్షలో విటమిన్ బి6 తక్కువగా ఉందని తేలడంతో వైద్యులు రోజుకు విటమిన్ బి6- 50 mg సప్లిమెంట్లు తీసుకోమని రాశారు. కానీ రోజుకు ఆయన గుప్పెడు సప్లిమెంట్లు మింగడం మొదలుపెట్టాడు. కొన్ని రోజులకు ఆయన కాళ్లల్లో స్పర్శను కోల్పోవడం మొదలుపెట్టాడు. ఎవరైనా ముట్టుకున్నా ఆయనకు తెలిసేది కాదు, చివరకి నడవలేని పరిస్థితికి వచ్చేశాడు. పరీక్షలు చేయగా విటమిన్ బి6 సప్లిమెంట్లు అతిగా వేసుకోవడం వల్ల విషపూరితంగా మారినట్టు గుర్తించారు. విటమిన్ బి6తో పాటూ మెగ్నిషియం సప్లిమెంట్లు కూడా తీసుకునేవాడు. అలాగే విటమిన్ బి6 అధికంగా ఉండే ఆహారాన్ని తినవాడు. దీంతో అతని శరీంలో అవసరానికి మించి 70 రెట్లు అధికంగా విటమిన్ బి6 చేరింది.
మళ్లీ నడవగలరా?
విటమిన్ బి6 శరీరంలో చేరి విషపూరితం కావడం చాలా అరుదుగా జరుగుతుంది. ఎందుకంటే అదనపు బి విటమిన్లు మూత్రవిసర్జన ద్వారా బయటికి పోతాయి. అయితే దీర్ఘకాలికంగా అధికంగా తీసుకునే సప్లిమెంట్లు విషపూరితం అయ్యే అవకాశం ఉంది. విటమిన్ బి6 200 mg కన్నా ఎక్కువ మోతాదులో తీసుకుంటే నాడీ సంబందిత రుగ్మతలు వస్తాయి. ఇది నరాలు దెబ్బతినడం వల్ల కాళ్లలో స్పర్శ అనుభూతిని కోల్పోతారు. అయితే సప్లిమెంట్లను ఆపేస్తే తిరిగా ఆరునెలల్లో కాళ్లు సాధారణంగా మారతాయి. తిరిగి నడక సాధ్యం అవుతుంది.
ఎందుకు విటమిన్ బి6?
విటమిన్ బి6 మనకు చాలా అవసరం అయిన విటమిన్. ఇది నీటిలో కరిగే విటమిన్. ఇది శరీర విధులకు అవసరం. మన శరీరం దీన్ని స్వయం ఉత్పత్తి చేయలేము కాబట్టి ఆహారం ద్వారా తీసుకోవాల్సిందే. ఆహారం ద్వారా కూడా తగినంత అందకపోతే అప్పుడు సప్లిమెంట్లను అందిస్తారు వైద్యులు.
తినాల్సిన ఆహారాలు
చికెన్, చేపలు, కొమ్ముశెనగలు, వేరు శెనగ పలుకులు, సోయా బీన్స్, ఓట్స్, అరటిపండ్లు, పాలు... మొదలగు ఆహారంలో విటమిన్ బి6 పుష్కలంగా దొరుకుతుంది.
Also read: ఈ క్యాన్సర్లు వచ్చే అవకాశం ఆడవాళ్ల కన్నా మగవారిలోనే ఎక్కువ
Also read: ఇతరుల కన్నా దోమలు మిమ్మల్నే ఎక్కువగా కుడుతున్నాయా? దానికి మీ రంగు కూడా కారణం కావచ్చు