News
News
X

Viral News: లక్ అంటే ఇతడిదే! ఓవర్ నైట్‌లో కోటీశ్వరుడు అయ్యాడు!

అమెరికాలో ఓ వ్యక్తిని అదృష్టం గట్టిగా పట్టుకుంది. మూడుకు మూడు లాటరీ టికెట్లు తగిలాయి! రాత్రిక రాత్రే కోటీశ్వరుడిని చేశాయి!!

FOLLOW US: 
Share:

అదృష్టం ఎప్పుడు, ఎవరిని, ఎలా వరిస్తుందో చెప్పడం చాలా కష్టం. కొంత మంది మట్టిని పట్టుకున్నా బంగారం అవుతుంది. మరికొంత మంది బంగారాన్ని పట్టుకున్నా మట్టి అవుతుంది. తాజాగా అమెరికాలో ఓ వ్యక్తిని అదృష్టం ఓ రేంజిలో పట్టుకుంది. టైంపాస్ కు కొన్ని మూడు లాటరీ టికెట్లు.. అన్నింటికి అన్నీ తగిలాయి. అతడి ఇంట్లో ధనలక్ష్మి నాట్యం చేసింది. ఓవర్ నైట్ లో కోటీశ్వరుడు అయిపోయాడు.

ఇటీవల.. మేరీ ల్యాండ్ కు చెందిన 67 ఏళ్ల వ్యక్తి లాటరీ టికెట్ కొనుగోలు చేయాలి అనుకున్నాడు.  సెప్టెంబర్ 20 నుంచి 25 వరకు జరిగిన లాటరీ టికెట్ల అమ్మకంలో రెండు టికెట్లు కొనుగోలు చేశాడు. తన భర్త లాటరీ టికెట్లు కొనుగోలు చేసిన విషయం భార్యకు తెలియకపోవడంతో తను కూడా ఓ టికెట్ కొనుగోలు చేసింది. మొత్తంగా ఇద్దరు కలిసి మూడు టికెట్లను కొనుగోలు చేశారు. ఫైనల్ గా లాటరీ ఫలితాలు వచ్చాయి. అదృష్టం జమైకన్ చిరుత హుస్సేన్ బోల్ట్ లా పరిగెత్తుకుంటూ వచ్చింది. మూడు లాటరీ టికెట్లు కొన్న భార్య భర్తలను చుట్టేసుకుంది.  వీరు కొన్న మూడు టికెట్లు లాటరీ డ్రాలో విజయం సాధించాయి. ఈ విజయం ద్వారా అక్షరాలా 1,50,000 అమెరికన్ డాలర్లు దక్కించుకున్నారు. భారత కరెన్సీలో సుమారు రూ. కోటి 13 లక్షలు సొంతం చేసుకున్నారు.

 లాటరీలో తన మూడు టికెట్లు ప్రైజ్ మనీ గెల్చుకోవడం పట్ల భార్యాభర్తలు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. “అనుకోకుండా మూడు టికెట్లు కొనుగోలు చేశాం. అదృష్టం కొద్దీ, ఆ మూడు టికెట్లు లాటరీలో  గెలిచాయి. మేం అస్సలు నమ్మలేకపోతున్నాం” అని చెప్పారు.   

అమెరికాలో లాటరీ డ్రాలలో విజేతలుగా నిలిచి భారీ డబ్బులను పొందిన వారు చాలా మంది ఉన్నారు. 2018లో న్యూజెర్సీలోని ఎడ్జ్‌ వాటర్‌ కు చెందిన రాబర్ట్ స్టీవర్ట్ సైతం వరుసగా మూడు లాటరీలను గెలిచి భారీ మొత్తంలో డబ్బును అందుకున్నాడు. ఈ మూడు లాటరీలకు గాను తను ఏకంగా  5 మిలియన్ డాలర్లను అందుకున్నాడు. ఇండియన్ కరెన్సీలు ఈ డబ్బు విలువ సుమారు రూ. 36.2 కోట్లు. న్యూజెర్సీలో మూడుసార్లు లాటరీ అదృష్టం వరించిన వ్యక్తిగా స్టీవర్ట్ గుర్తింపు పొందాడు.

 గతేడాది వర్జీనియాకు చెందిన ఓ వ్యక్తి సైతం లాటరీ ద్వారా భారీగా డబ్బు సంపాదించాడు. అలెగ్జాండ్రియాకు చెందిన విలియం నెవెల్  20 ఐడెంటికల్ లాటరీ టిక్కెట్లను కొనుగోలు చేసి వాటన్నింటినీ గెలుచుకున్నాడు. మొత్తం 100,000 డాలర్లను బహుమతిని పొందాడు. వీటి విలువ భారత కరెన్సీలో సుమారు రూ. 74 లక్షలుగా ఉంటుంది.  మొత్తంగా అమెరికాలో లాటరీల ద్వారా చాలా మంది రాత్రికి రాత్రే లక్షాధికారులుగా మారిన వాళ్లు చాలా మంది ఉన్నారు. కొందరు టైంపాస్ కోసం టికెట్లు కొన్న వారికి సైతం అదృష్టం కలిసి రాగా.. మరికొంత మంది ఎన్నో సార్లు లాటరీ టికెట్లు కొనుగోలు చేసి లక్కీ అనేది అందని ద్రాక్షలాగే మిగిలిపోతుంది.

Published at : 28 Sep 2022 11:52 AM (IST) Tags: Viral News lottery drawing Man wins 3 lottery tickets

సంబంధిత కథనాలు

Brain Health: మెదడుకు హాని చేసే ఆహారాలు ఇవే - వీటికి దూరంగా ఉండండి

Brain Health: మెదడుకు హాని చేసే ఆహారాలు ఇవే - వీటికి దూరంగా ఉండండి

Vitamin D: రోజూ 10 నిమిషాలు ఇలా చెయ్యండి - ‘విటమిన్ డి’ లోపమే ఉండదు

Vitamin D: రోజూ 10 నిమిషాలు ఇలా చెయ్యండి - ‘విటమిన్ డి’ లోపమే ఉండదు

Weight Loss: బరువు తగ్గే ప్లాన్ వేసుకుంటున్నారా? జాగ్రత్త, ఈ అపోహలు నమ్మొద్దు

Weight Loss: బరువు తగ్గే ప్లాన్ వేసుకుంటున్నారా? జాగ్రత్త, ఈ అపోహలు నమ్మొద్దు

ఏవండోయ్ ఇది విన్నారా? 'జస్ట్ ఫ్రెండ్స్' అన్నందుకు మహిళపై రూ.24 కోట్లు పరువు నష్టం కేసు వేశాడు!

ఏవండోయ్ ఇది విన్నారా? 'జస్ట్ ఫ్రెండ్స్' అన్నందుకు మహిళపై రూ.24 కోట్లు పరువు నష్టం కేసు వేశాడు!

Curd Vs Buttermilk: పెరుగు కంటే మజ్జిగ తీసుకోవడం మంచిదా? ఆయుర్వేద శాస్త్రం ఏం చెబుతోంది?

Curd Vs Buttermilk: పెరుగు కంటే మజ్జిగ తీసుకోవడం మంచిదా? ఆయుర్వేద శాస్త్రం ఏం చెబుతోంది?

టాప్ స్టోరీస్

YS Viveka Murder case CBI: వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు - వారిద్దరిపై ఆరున్నర గంటల పాటు ప్రశ్నల వర్షం !

YS Viveka Murder case CBI: వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు - వారిద్దరిపై ఆరున్నర గంటల పాటు ప్రశ్నల వర్షం  !

Twitter Ad Revenue Share: ట్విట్టర్ ద్వారా సంపాదన కూడా - కానీ అది మాత్రం కంపల్సరీ!

Twitter Ad Revenue Share: ట్విట్టర్ ద్వారా సంపాదన కూడా - కానీ అది మాత్రం కంపల్సరీ!

MLAs Poaching Case : ఎమ్మెల్యేలకు ఎర కేసు సీబీఐకా ? సిట్ కా ? సోమవారం తీర్పు చెప్పనున్న హైకోర్టు !

MLAs Poaching Case : ఎమ్మెల్యేలకు ఎర కేసు సీబీఐకా ? సిట్ కా ? సోమవారం తీర్పు చెప్పనున్న హైకోర్టు !

Amigos Trailer : ముగ్గురిలో ఒకడు రాక్షసుడు అయితే - కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్ వచ్చేసిందోచ్

Amigos Trailer : ముగ్గురిలో ఒకడు రాక్షసుడు అయితే - కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్ వచ్చేసిందోచ్