అన్వేషించండి

Valentines Week 2024 : వాలెంటైన్స్ వీక్ స్పెషల్.. ఒక్కోరోజు ఒక్కోలా ప్రేమను వ్యక్తం చేసేయండి

2024 Valentines Day List : ప్రేమికులకు ఇష్టమైన వీక్ మరికొన్ని రోజుల్లో వచ్చేస్తుంది. అదే వాలెంటైన్స్​ వీక్. ఆ వారంలో ఏ రోజు ఏమి సెలబ్రేట్ చేసుకుంటారో.. వాటి ప్రత్యేకతలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 

Valentines Week Full List : ఫిబ్రవరి వచ్చిందంటే చాలు ప్రేమికులు పండుగ చేసుకుంటారు. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్​ డే (Valentines Day 2024)జరుపుకుని.. తమ ప్రేమికులకు ప్రేమను వ్యక్తం చేస్తారు. అయితే సంవత్సరంలో ఏ రోజుకి లేనంతగా వాలెంటైన్స్ డేకి ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ప్రేమికుల దినోత్సవాన్ని వారం రోజులు సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ వాలెంటైన్స్​ వీక్​లో ఒక్కోరోజుకి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఫిబ్రవరి 14కి వారం ముందుగా అంటే ఫిబ్రవరి 7 నుంచి ఈ వేడుకలు ప్రారంభమవుతాయి. 

వాలెంటైన్స్​డే అనేది పాశ్చత్యా ధోరణి అయినా ఇండియాలో చాలామంది దీనిని సెలబ్రేట్ చేసుకుంటారు. దీనిని ప్రేమ, ఆనందం, అందమైన భావోద్యేగాలకు గుర్తుగా చేసుకుంటారు. తమ ప్రియమైన వారికి ఈ వారంలో ప్రత్యేక బహుమతులు, సర్​ప్రైజ్​లు ఇస్తూ ఉంటారు. ఈ వాలెంటైన్స్ వీక్​ని లవ్ వీక్, రొమాన్స్ వీక్​ అని కూడా పిలుస్తారు. వాలెంటైన్స్​ వీక్​ రోజ్​ డే నుంచి ప్రారంభమై.. వాలెంటైన్స్ డే వరకు వీక్​లో ఏమేమి సెలబ్రేట్ చేసుకుంటామో ఇప్పుడు తెలుసుకుందాం. 

వాలెంటైన్స్ డే వీక్​లో రోజ్​ డే, ప్రపోజ్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే, ప్రామిస్ డే, హగ్ డే, కిస్​ డే, వాలెంటైన్స్ డే ఉంటాయి. వాలెంటైన్స్ డే అంటే కేవలం గర్ల్​ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్​కే కాదు.. భార్య భర్తలు కూడా దీనిని చేసుకోవచ్చు. 

రోజ్ డే (Rose Day 2024)

రోజ్​ డే అనేది వాలెంటెన్స్ వీక్​లో మొదటి రోజు. దీనిని ఫిబ్రవరి 7న జరుపుకుంటారు. ఈ రోజు ప్రేమ, ఆప్యాయత, అభిరుచికి చిహ్నమైన గులాబీలు ఇస్తారు. గులాబీని ఇచ్చి.. మీరు ప్రేమించే వ్యక్తికి ప్రేమను వ్యక్తం చేయవచ్చు. ఎర్ర గులాబీలు గాఢమైన ప్రేమను తెలిపేందుకు మంచి ఎంపిక. 

ప్రపోజ్ డే (Propose Day 2024)

 

వాలెంటైన్స్​ వీక్​లో ప్రపోజ్ డే రెండవ రోజు సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ రోజు మీరు ప్రేమించిన వ్యక్తికి ప్రపోజ్ చేసి.. డేట్​కి తీసుకెళ్లవచ్చు. నైట్​ డేట్​కి తీసుకువెళ్లడం అనేది మంచి ఎంపిక అవుతుంది. దానిని మీరు రోమాంటిక్ డేట్​గా కూడా మార్చుకోవచ్చు. 

చాక్లెట్ డే (Chocolate Day 2024 )

చాక్లెట్ డే వాలెంటైన్స్ వీక్​లో మూడవ రోజు వస్తుంది. చాక్లెట్​లోని మాధుర్యం తమ ప్రేమలో కూడా ఉండాలని దీనిని సెలబ్రేట్ చేసుకుంటారు. మీ పార్టనర్​కి స్వీట్స్​ అంటే ఇష్టముంటే మీరు రకరకాల చాక్లెట్స్​ను వారికి ఇవ్వొచ్చు. 

టెడ్డీ డే (Teddy Day 2024)

ఫిబ్రవరి 10వ తేదీన టెడ్డీ డే చేసుకుంటారు. ఇది వాలెంటైన్ వీక్​లో నాల్గవ రోజు. ఈ రోజు టెడ్డీ బేర్స్​ని గిఫ్ట్​గా ఇవ్వొచ్చు. ఈ టెడ్డీలు ఇది ఆనందానికి, ఉల్లాసానికి గుర్తుగా ఇస్తారు. మీరు కూడా ప్రేమించే వ్యక్తికి.. మంచి రంగులో టెడ్డీని సెలక్ట్ చేసి గిఫ్ట్ ఇవ్వొచ్చు.

ప్రామిస్ డే (Promise Day 2024)

వాలెంటైన్స్ వీక్​లో ప్రామిస్​ డే చాలా స్పెషల్. ఎందుకంటే ఎన్ని గిఫ్ట్​లు ఇచ్చినా.. రాని కిక్.. ఒక్క ప్రామిస్​తో వస్తుంది. మీరు ప్రేమించే వ్యక్తికి.. మీ ప్రేమను తెలియజేస్తూ.. నమ్మకంగా జీవితాంతం తమతోనే ఉంటామని ప్రామిస్ చేస్తే చాలు. ఎలాంటి గిఫ్ట్​లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రామిస్​ చేస్తే సరిపోతుంది అనుకునే బదులు.. ప్రామిస్​ని నిలబెట్టుకుంటే మంచిది. 

హగ్ డే.. (Hug Day 2024)

లవ్​ వీక్​లో ఆరవ రోజు హగ్​ డే. ఇది ప్రేమించిన వ్యక్తికి భద్రతనిస్తూ.. వారు ఒంటరి కాదని.. హగ్ ఇవ్వొచ్చు. అయినా హగ్​ అనేది స్ట్రెస్, బాధలను దూరం చేస్తుంది కాబట్టి.. దీనిని మీరు కేవలం ప్రేమించిన వ్యక్తితో కాకుండా మీరు ఇష్టపడే, వెల్​విషెర్స్​కి కూడా హగ్ ఇవ్వొచ్చు. 

కిస్ డే (Kiss Day 2024)

ఫిబ్రవరి 13వ తేదీన కిస్​ డే జరుపుకుంటారు. కిస్ అనేది ఒకరి పట్ల మరొకరు చూపించే అత్యంత సన్నిహితమైన, స్వచ్ఛమైన ప్రేమకు రూపం. ఈ రోజు మీరు మీ భాగస్వామికి ముద్దు పెట్టి మీ ప్రేమను వ్యక్తం చేసుకోవచ్చు. 

వాలెంటైన్స్ డే (Valentines Day 2024 )

వాలెంటైన్స్​ వీక్​లో ఇది చివరిది. ఈ ప్రత్యేకమైన రోజు జంటలకు చాలా ప్రాముఖ్యమైనది. ఎందకంటే ఇది అన్నిరూపాల్లో ప్రేమను వ్యక్తం చేసేందుకు ముఖ్యమైన రోజు. ఈరోజు మీ వాలెంటైన్​తో కలిసి మంచిగా టైమ్ స్పెండ్ చేయవచ్చు. వారిని తీసుకుని మంచి హాలీడే స్పాట్​కి వెళ్లొచ్చు. ఈ వాలెంటైన్​ వీక్​ని మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలో ఇప్పటినుంచే డిసైడ్ అయిపోండి. 

Also Read : హాబీ డే గురించి మీకు తెలుసా? 2024లో బాగా వైరల్ అవుతున్న ట్రావెల్ ట్రెండ్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Car Accident: అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
Vaibhav Suryavanshi New Record : మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Car Accident: అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
Vaibhav Suryavanshi New Record : మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
Deepfake Scam: డీప్ ఫేక్ రొమాన్స్ స్కామర్- రూ.18 లక్షలు పోగొట్టుకున్న 77ఏళ్ల రిటైర్డ్ లెక్చరర్
డీప్ ఫేక్ రొమాన్స్ స్కామర్- రూ.18 లక్షలు పోగొట్టుకున్న 77ఏళ్ల రిటైర్డ్ లెక్చరర్
Balayya - Venky : అన్‌స్టాపబుల్ షో ఏమోగానీ.. బాలయ్య-వెంకీ సంక్రాంతి వైబ్స్‌ని దించేశారుగా..
అన్‌స్టాపబుల్ షో ఏమోగానీ.. బాలయ్య-వెంకీ సంక్రాంతి వైబ్స్‌ని దించేశారుగా..
Purandeswari: సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Embed widget