Womens Health: మహిళల ఆరోగ్యాన్ని దెబ్బతీసే 'సైలెంట్ కిల్లర్' వ్యాధులు ఇవే!
కుటుంబ బాగోగులు చూసుకునే మహిళలు తమ ఆరోగ్యం మీద మాత్రం అంతగా శ్రద్ధ వహించరు. ఆ నిర్లక్ష్యమే వారి ప్రాణాల మీదకి తీసుకొస్తుంది.
గృహిణిగా, తల్లిగా, భార్యగా బాధ్యతలు నిర్వహిస్తూ మహిళలు తమ ఆరోగ్యాన్ని విస్మరిస్తున్నారు. బిజీ లైఫ్ షెడ్యూల్ లో ఆరోగ్యంపై దృష్టి పెట్టలేకపోవడంతో త్వరగా అనారోగ్యాల పాలవుతున్నారు. ఇలా చేయడం వల్ల గుండె సంబంధిత సమస్యలు, రక్తపోటు, మధుమేహం, కాలేయ వ్యాధులు వంటి అనేక రోగాలు నిశ్శబ్దంగా వారి శరీరంపై దాడి చేస్తున్నాయి. మొదట్లో ఈ వ్యాధులు ఎటువంటి లక్షణాలు కనిపించవు. దీని వల్ల వాటిని గుర్తించి జాగ్రత్త పడటం కష్టమవుతుంది. వ్యాధి ముదిరిన తర్వాత చాలా మంది మహిళలు తమ ఆరోగ్యం గురించి తెలుసుకుంటున్నారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. మహిళలు తమ ఆరోగ్యంపై శ్రద్ధ చూపించలేకపోవడం వల్ల తరచుగా ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు. మహిళలకు సైలెంట్ కిల్లర్ గా మారే 5 వ్యాధుల గురించి తెలుసుకుందాం.
శరీరంలోకి ప్రవేశించి సైలెంట్ గా అవయవాలను నాశనం చేసి మరణానికి దారి తీసే జబ్బుల్లో గుండె జబ్బులు, హైపర్ టెన్షన్, మధుమేహం ముందు స్థానంలో ఉంటున్నాయి. ఇవే కాదు ప్రైమరీ అమిలోయిడోసిస్, మూత్రపిండాల వ్యాధులు కూడా మహిళ ఆరోగ్యం మీద దాడి చేస్తున్నాయి. అధిక రక్తపోటు, ధూమపానం, జీవనశైలిలో మార్పులు, అధిక కొలెస్ట్రాల్ వంటివి ఈ వ్యాధుల రావడానికి ప్రధాన ప్రమాద కారకాలని నిపుణులు చెబుతున్నారు.
అండాశయ క్యాన్సర్
ప్రతి 75 మంది మహిళల్లో ఈ వ్యాధి బారిన పడుతున్నారు. చాలా మంది మహిళలు తమకు తెలియకుండానే ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ ఐదేళ్లలో క్యాన్సర్ బారిన పడి కోలుకున్న వాళ్ళు కేవలం 46 శాతం మాత్రమేనని కొన్ని నివేదికలు చెబుతున్నారయి. ఈ సైలెంట్ కిల్లర్ వ్యాధుల సంకేతాలను కొన్ని సార్లు వైద్యులు కూడా గుర్తించలేకపోతున్నారు.
కార్డియోవాస్కులర్ డిసీజ్
ఈ డిసీజ్ లో శ్వాస ఆడకపోవడం, వికారం, అలసట వంటి లక్షణాలను స్త్రీలు అనుభవిస్తారు. మీ కుటుంబంలో హృదయ సంబంధ వ్యాధులు కలిగిన చరిత్ర ఉంటే మీరు ఇంకా ఎక్కువ ప్రమాదంలో ఉన్నట్టే.
లూపస్
లూపస్ అనేది దీర్ఘకాలిక వ్యాధి. శరీరంలో ఎక్కడైనా వస్తుంది. చర్మం, కీళ్ళు, ఇతర అవయవాలకు హాని కలిగిస్తుంది. ముక్కు లేదా బుగ్గలపై సీతాకోకచిలుక ఆకారంలో దద్దుర్లు ఏర్పడతాయి. కీళ్ళు అసౌకర్యంగా అనిపిస్తుంది. చిన్న పని చేసిన అలిసిపోతారు. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. ఇవే కాదు జుట్టు రాలిపోవడం, కడుపులో అసౌకర్యంగా ఉండటం, మైగ్రేన్ వంటివి ఈ వ్యాధి లక్షణాలు.
మధుమేహం
మధుమేహాన్ని పట్టించుకొకపోతే ప్రాణాలు హరించేస్తుంది. డయాబెటిస్ రాకుండా చూసుకోవాలి. ఒకవేళ వస్తే మాత్రం చికిత్స తీసుకుంటే సరైన ఆహారం తీసుకుంటూ ఉండాలి. అప్పుడే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అతిగా మూత్ర విసర్జన, దాహం, ఆకలి లేకపోవడం, అరికాళ్ళలో వేడి ఆవిర్లు, మంటగా అనిపిస్తే మాత్రం వెంటనే రోగనిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం ముఖ్యం.
పార్కిన్సన్స్ వ్యాధి
ఇదొక నాడీ సంబంధిత వ్యాధి. ఇందులో నరాల కణాలు కోలుకోలేని విధంగా నాశనమయ్యే స్థాయికి క్షీణిస్తాయి. దీని బారిన పడితే కండరాలు సామర్థ్యాన్ని కోల్పోతాయి. వ్యాధి ముదిరితే మరణిస్తారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: ఈ ఊర్లో మగాళ్లకు నో ఎంట్రీ, పొరపాటున వచ్చారో కటకటాలపాలే!