News
News
X

Tomato Fever: పిల్లల్లో పెరుగుతున్న టమోటో ఫీవర్ కేసులు, ఇది టమోటొలు తినడం వల్ల మాత్రం రాదు

ఓపక్క కరోనా, మరోపక్క మంకీపాక్స్... మధ్యలో టమోటా ఫీవర్. మన దేశంలో వీటి కేసులు బయటపడుతున్నాయి.

FOLLOW US: 

టమోటో ఫీవర్ అనగానే అందరూ భయపడేది టమోటోలు తినడం వల్ల వస్తుందేమో అని. నిజానికి దీని పేరులో టమోటా ఉన్నా, టమోటాలకు ఈ వ్యాధికి ఏం సంబంధం లేదు. మరెందుకు ఆ పేరు వచ్చిందని సందేహం కదూ, టమోటో ఫీవర్ వచ్చిన వాళ్లలో ఎర్రటి బొబ్బలు, దద్దుర్లు వస్తాయి. అవి టమోటోల మాదిరిగా ఎర్రగా, గుండ్రంగా ఉంటాయని ఆ పేరు వచ్చింది. కాబట్టి భయపడకుండా టమోటో కూరలు లాగించండి. 

కరోనా కేసులు తగ్గాయని అనుకునేలోపే ఓపక్క టమోటో ఫీవర్, మరో పక్క మంకీపాక్స్ మనదేశంలో అడుగుపెట్టాయి. కేరళలో టమోటో ఫీవర్ కేసులు పెరుగుతున్నాయి. ఇవి రెండూ అంటు వ్యాధులే కావడం కలవరానికి గురిచేస్తుంది. కేరళలో ప్రస్తుతం 80కి పైగా టమోటో ఫ్లూ కేసులు బయటపడ్డాయి. 

చిన్నపిల్లలు జాగ్రత్త
టమోటో ఫీవర్ లేదా ఫ్లూ అధికంగా అయిదేళ్లలోపు చిన్నపిల్లల్లో వస్తోంది. శరీరంపై ఎర్రటి బొబ్బలు వస్తున్నాయి, తీవ్రమైన అలసటతో వారు బాధపడుతున్నారు. పేగులో ఏర్పడే వైరస్ వల్ల లేదా డెంగ్యూ, చికెన్ గున్యాలు వచ్చి తగ్గాక సైడ్ ఎఫెక్టు రూపంలో  టమోటో ఫీవర్ వచ్చే అవకాశం ఉంది. 

ఈ లక్షణాలు కనిపిస్తే టమోటో ఫ్లూనే
1. ఎర్రటి బొబ్బలు
2. జ్వరం
3. దద్దుర్లు
4. చర్మం దురద పెట్టడం
5. డీహైడ్రేషన్ (విపరీతమైన దాహం)
6. తీవ్రమైన అలసట
7. కీళ్ల నొప్పులు
8. డయేరియా
9. దగ్గు
10. జలుబు
11. ఒళ్లు నొప్పులు

ఏం చేయాలి?
టమోటో ఫీవర్ సోకినట్టు అనుమానం వస్తే డీహైడ్రేషన్ బారిన పడకుండా అధికంగా నీళ్లు తాగించాలి. దద్దుర్లు, బొబ్బలు గోకడం వంటివి చేయకూడదు.వేడి నీళ్లతో కాకుండా సాధారణ నీటితో స్నానం చేయించాలి. ఇది చర్మానికి ఉపశమనాన్ని కలిగిస్తుంది. అలాగే ఉప్పు, కారం అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉంచాలి. వైద్యులు సూచించిన మందులను వాడుతూ ఉండాలి. 

టమోటో ఫ్లూ సోకిన పిల్లల నుంచి మిగతా పిల్లలను దూరంగా ఉంచాలి. వారు వాడే పాత్రలు, బట్టలు కూడా విడిగా ఉంచాలి. వాటిని వాడడం వల్ల కూడా టమోటో ఫ్లూ ఇతర పిల్లలకు సోకుతుంది.

మంకీపాక్స్ కాదు...
దేశంలో మంకీపాక్స్ కూడా వ్యాపిస్తుంది. దీంతో టమోటో ఫ్లూ లక్షణాలు కొన్ని మంకీపాక్స్ లానే ఉంటాయి. కాబట్టి కొంతమంది టమోటో ఫ్లూ వల్ల వచ్చే బొబ్బలు మంకీపాక్స్ వల్లనేమో అనుకుంటున్నారు. ఈ రెండు వ్యాధుల్లోను బొబ్బలు, దద్దుర్లు వస్తాయి. కాకపోతే టమోటో ఫ్లూ పిల్లలోనే వస్తుంది కాబట్టి వైద్యులను సంప్రదించాకే రెండింటిలో ఏ వ్యాధి సోకిందో నిర్ధారణకు రావాలి. 

Also read: తలపై దురద పెడుతోందా? ఈ చిట్కాలు పాటిస్తే చుండ్రు తగ్గి, జుట్టు బాగా పెరుగుతుంది

Also read: పగలు పదే పదే నిద్ర వస్తోందా? అయితే అధిక రక్తపోటు ఉందేమో ఓసారి చెక్ చేసుకోండి

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Published at : 29 Jul 2022 07:49 AM (IST) Tags: Tomato Fever Tomato fever causes Tomato fever symptoms Tomato fever and monkeypox

సంబంధిత కథనాలు

Heart Attack: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? గుండె ప్రమాదంలో పడినట్లే

Heart Attack: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? గుండె ప్రమాదంలో పడినట్లే

WhatsApp Emojis: వాట్సాప్‌లో ఆ రంగుల హార్ట్ ఎమోజీలకు అర్థం తెలుసా? ఒక్కో కలర్‌కు ఒక్కో భావం!

WhatsApp Emojis: వాట్సాప్‌లో ఆ రంగుల హార్ట్ ఎమోజీలకు అర్థం తెలుసా? ఒక్కో కలర్‌కు ఒక్కో భావం!

Viral news: కోడి కూసిందని కోర్టుకెక్కిన జంట, వీరి కష్టం ఏ పక్కింటోడికి కూడా రాకూడదు!

Viral news: కోడి కూసిందని కోర్టుకెక్కిన జంట, వీరి కష్టం ఏ పక్కింటోడికి కూడా రాకూడదు!

Ethiopian Airlines: గాఢ నిద్రలో పైలట్లు, ల్యాండ్ కాకుండా గాల్లోనే చక్కర్లు కొట్టిన విమానం, చివరికి..

Ethiopian Airlines: గాఢ నిద్రలో పైలట్లు, ల్యాండ్ కాకుండా గాల్లోనే చక్కర్లు కొట్టిన విమానం, చివరికి..

Karthikeya 2: కార్తికేయ-2లో హీరో పాముని ఎలా కంట్రోల్ చేశాడు? జూలింగ్వలిజంతో ఇది సాధ్యమా?

Karthikeya 2: కార్తికేయ-2లో హీరో పాముని ఎలా కంట్రోల్ చేశాడు? జూలింగ్వలిజంతో ఇది సాధ్యమా?

టాప్ స్టోరీస్

High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

Tees Maar Khan Movie Review - తీస్ మార్ ఖాన్ రివ్యూ : రేసుగుర్రంలా దూసుకు వెళ్ళాలనుకున్న ఆది సాయి కుమార్, సినిమా ఎలా ఉందంటే?

Tees Maar Khan Movie Review - తీస్ మార్ ఖాన్ రివ్యూ : రేసుగుర్రంలా దూసుకు వెళ్ళాలనుకున్న ఆది సాయి కుమార్, సినిమా ఎలా ఉందంటే?

Ram Charan: రామ్ చరణ్ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్న ఉపాసన - ఫొటో వైరల్

Ram Charan: రామ్ చరణ్ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్న ఉపాసన - ఫొటో వైరల్

Anasuya: 'నా మాటలను రాజకీయం చేయొద్దు' - నెటిజన్లకు అనసూయ రిక్వెస్ట్!

Anasuya: 'నా మాటలను రాజకీయం చేయొద్దు' - నెటిజన్లకు అనసూయ రిక్వెస్ట్!